గుంటూరు జిల్లా 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 300 కిలోమీటర్ల మేర యాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గుంటూరు జిల్లా 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 300 కిలోమీటర్ల మేర యాత్ర

గుంటూరు జిల్లా 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 300 కిలోమీటర్ల మేర యాత్ర

Written By news on Monday, February 18, 2013 | 2/18/2013

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరోప్రజాప్రస్థానం పాదయాత్ర ఈ నెల 22న గుంటూరు జిల్లాలో ప్రవేశించనుంది. ఆ రోజు షర్మిల నల్లగొండ జిల్లా వాడపల్లి వంతెన మీదుగా పొందుగుల గ్రామంలోకి ప్రవేశించి జిల్లాలో యాత్ర ప్రారంభిస్తారని గుంటూరు జిల్లా పార్టీ కన్వీనర్ మర్రి రాజశేఖర్, పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం ఆదివారం మీడియాకు తెలిపారు. వాస్తవానికి ఈనెల 18నే గుంటూరు జిల్లాలో యాత్ర ప్రారంభం కావాల్సి ఉన్నా.. వర్షాలతోపాటు జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున యాత్ర 22 నుంచి మొదలవుతుందన్నారు. 

శనివారం గుంటూరు జిల్లా కలెక్టర్‌ను పాదయాత్ర అనుమతి కోసం కలిశామని, జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున జిల్లాయేతరులు ఈనెల 19 నుంచి 21 వరకు జిల్లాలో ఉండకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిందని చెప్పినట్లు వివరించారు. ఇందుకు సహకరించాలని కలెక్టర్ కోరారన్నారు. దీంతో పార్టీ నేతలతో చర్చించి యాత్ర షెడ్యూల్‌ను ఖరారు చేశామని తెలిపారు. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 300 కిలోమీటర్ల మేర యాత్ర సాగుతుందని చెప్పారు. గురజాల, మాచర్ల, పెదకూరపాడు, సత్తెనపల్లి, నరసరావుపేట, చిలకలూరిపేట, తాడికొండ, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, ప్రత్తిపాడు, పొన్నూరు, తెనాలి, వేమూరు, మంగళగిరి నియోజకవర్గాల్లో యాత్ర జరుగుతుందన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో యాత్ర ముగిశాక కృష్ణా జిల్లాలోకి ప్రవేశిస్తుందని వివరించారు.
Share this article :

0 comments: