21న ఎమ్మెల్సీ ఎన్నికలు..14 జిల్లాల్లో సెలవు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 21న ఎమ్మెల్సీ ఎన్నికలు..14 జిల్లాల్లో సెలవు

21న ఎమ్మెల్సీ ఎన్నికలు..14 జిల్లాల్లో సెలవు

Written By news on Friday, February 1, 2013 | 2/01/2013

మూడు పట్టభద్ర స్థానాలకు, మూడు ఉపాధ్యాయ స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఫిబ్రవరి 21వతేదీన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో స్థానికంగా సెలవు రోజుగా ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్ని మాథ్యూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ తేదీ ముందు రోజున(ఫిబ్రవరి 20వ తేదీ) ఎన్నికలు నిర్వహించే కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. 25వ తేదీన ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రాలున్న కార్యాలయాలకు కూడా సెలవు వర్తిస్తుంది. 

కౌన్సిల్ ఎన్నికల విధుల్లో పోలీసులు: ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 21వ తేదీన ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసుశాఖలో డీజీపీ నుంచి సంబంధిత పోలీస్‌స్టేషన్లకు చెందిన కానిస్టేబుళ్ల వరకూ ఎన్నికల విధుల్లో ఉంటారని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్ని మాథ్యూ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
Share this article :

0 comments: