నేడు 9 కిలోమీటర్లు పాదయాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు 9 కిలోమీటర్లు పాదయాత్ర

నేడు 9 కిలోమీటర్లు పాదయాత్ర

Written By news on Saturday, February 23, 2013 | 2/23/2013


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శనివారం నుంచి గుంటూరు జిల్లాలో ప్రారంభం కానుంది. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దాన్ని భుజాన మోస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడి వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన పాదయాత్ర శనివారం మధ్యాహ్నం నల్లగొండ జిల్లా వాడపల్లి వంతెన మీదుగా గుంటూరు జిల్లా పొందుగల గ్రామంలోకి ప్రవేశించనుంది. వాస్తవానికి ఈనెల 18వ తేదీనే షర్మిల పాదయాత్ర గుంటూరు జిల్లాలో ప్రవేశించాల్సి ఉంది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, హైదరాబాద్‌లో బాంబు పేలుళ్ల మృతులకు సంతాప సూచకంగా యాత్రను 23వ తేదీకి మార్చినట్టు పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, మరో ప్రజాప్రస్థానం ప్రోగ్రామ్స్ కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. గుంటూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో సుమారు 300 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర కొనసాగుతుందన్నారు. గురజాల, మాచర్ల, పెదకూరపాడు, సత్తెనపల్లి, నరసరావుపేట, చిలకలూరిపేట, తాడికొండ, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, ప్రత్తిపాడు, పొన్నూరు, తెనాలి, వేమూరు, మంగళగిరి నియోజకవర్గాల్లో పాదయాత్ర నిర్వహిస్తారు. అనంతరం షర్మిల పాదయాత్ర కృష్ణా జిల్లాలోకి ప్రవేశిస్తుందని చెప్పారు. 

నేడు 9 కిలోమీటర్లు పాదయాత్ర

షర్మిల శనివారం 9 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేస్తారని తెలిపారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి బస నుంచి ఉదయం యాత్ర ప్రారంభమవుతుంది. నల్లగొండ జిల్లా పరిధిలో 3 కి.మీ. పాదయాత్ర అనంతరం వాడపల్లి బ్రిడ్జి మీదుగా గుంటూరు జిల్లాలోని పొందుగల గ్రామానికి చేరుకుంటారు. కృష్ణానది వంతెన దాటి పొందుగలకు చేరుకోవడంతో గుంటూరు జిల్లాలో షర్మిల పాదయాత్ర మొదలవుతుంది. మధ్యాహ్నం అక్కడ బహిరంగ సభలో ప్రసంగించిన తరువాత 6 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించనున్నారని, పాదయాత్రలో ప్రజలను కలిసి పులిపాడు క్రాస్‌రోడ్డు వద్ద ఏర్పాటు చేయనున్న బసకు చేరుకుంటారని చెప్పారు. అక్కడితో మొదటి రోజు పాదయాత్ర ముగుస్తుందని, యాత్రలో ఎటువంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు. 
Share this article :

0 comments: