ఇన్నాళ్లూ ప్రజల సమస్యలేమిటో తెలియకుండా ఉన్నారా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇన్నాళ్లూ ప్రజల సమస్యలేమిటో తెలియకుండా ఉన్నారా?

ఇన్నాళ్లూ ప్రజల సమస్యలేమిటో తెలియకుండా ఉన్నారా?

Written By news on Monday, February 18, 2013 | 2/18/2013

ఇన్నాళ్లూ ప్రజల సమస్యలేమిటో తెలియకుండా ఉన్నారా? 
షర్మిల పాదయాత్రపై బాబు, టీడీపీ విమర్శలు దిగజారుడుతనం 

 ‘‘తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తిరిగి అధికారంలోకి వస్తే తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి (1995-2004) పరిపాలనను మళ్లీ అందిస్తానని ప్రజలకు చెప్పగలరా? ఆయనకు ఆ దమ్ము, ధైర్యం ఉంటే ఈ మాట చెప్పాలి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ సీఈసీ సభ్యురాలు ఆర్.కె.రోజా సవాల్ చేశారు. బాబు ఎంత సేపూ ఎన్‌టీఆర్ గురించి చెప్పటమో లేదా వై.ఎస్.రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలను మరింత బాగా అమలు చేస్తామని చెప్పటమో చేస్తున్నారు తప్ప.. తన తొమ్మిదేళ్ల పాలన నాటి పరిస్థితులను తెస్తానని చెప్పలేక పోతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేస్తున్నది పాదయాత్ర కాదని.. తన తొమ్మిదేళ్ల పరిపాలనలో ప్రజలను ఇబ్బందులకు గురిచేసినందుకు గాను చేస్తున్న పనిష్మెంట్ యాత్ర అని విమర్శించారు. రోజా ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా సుదీర్ఘకాలం ఉండిన వ్యక్తి ప్రజా సమస్యలను తెలుసుకోవటానికి వెళుతున్నాననటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ‘‘ఇన్నాళ్లూ వారి సమస్యలేమిటో తెలియకుండా ఉన్నారా?’’ అని ఆమె చంద్రబాబును ప్రశ్నించారు. 

‘‘బాబుకు ఎటు చూసినా జగన్, విజయమ్మ, షర్మిల.. వీరే కనిపిస్తున్నారు. నిద్రలేచి నిద్రపోయేదాకా ఆయన వారి గురించే మాట్లాడుతున్నారు. రాజకీయంగా తనకు అడ్డొస్తున్నారని వారిపై దిగజారి విమర్శలు చేయిస్తున్నారు. తన తండ్రిని అభిమానించే ప్రజలు కష్టాల్లో ఉంటే వారి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తేవటానికి, ఏ తప్పూ చేయని తన అన్న జగన్‌ను అక్రమంగా నిర్బంధించినందుకు నిరసనగా షర్మిల పాదయాత్ర చేస్తుంటే ప్రతిపక్షంగా ప్రశంసించాల్సింది పోయి ఆమెపై దిగజారుడు విమర్శలు చేయటం సబబేనా?’’ అని రోజా ప్రశ్నించారు. తన భర్తను, పిల్లలను వదలిపెట్టి పాదయాత్ర చేస్తుంటే ఆమె ర్యాంప్ వాక్ చేస్తోందని మరో మహిళతో విమర్శలు చేయించటం పట్ల రోజా అభ్యంతరం తెలిపారు. ‘‘ఒక మహిళ సాటి మహిళపై ఇలాంటి దిగజారుడు విమర్శలు చేయడం సమంజసమేనా?’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. 

వైఎస్ ఇచ్చిన వాటిని మీరు ఇచ్చేదేమిటి? 

‘‘బాబు అధికారంలోకి వస్తే తానూ ఉచిత విద్యుత్ ఇస్తానంటున్నారు. అసలు ఆయన ఇచ్చేదేమిటి? వైఎస్సార్ ఇచ్చేశారు కదా! రుణాల మాఫీ చేస్తానంటున్నారు.. వైఎస్ హయాంలో రుణాల మాఫీ జరిగింది కదా! నేనొస్తే ఆరోగ్యశ్రీ ఇంకా మెరుగ్గా అమలు చేస్తానంటున్నారు. అసలు ఆరోగ్యశ్రీకి రూపకల్పన చేసి అమలు చేసిందే వైఎస్ కదా! ఫీజు రీయింబర్స్‌మెంట్ తెస్తానంటున్నారు.. ఆ పథకాన్ని పేదల కోసం వైఎస్ ప్రవేశపెట్టారు కదా! కానీ నీ కుమారుడు లోకేష్‌కు ఫీజు రీయింబర్స్ కావాలని సత్యం రామలింగరాజు వద్ద చేతులు కట్టుకుని నిలబడ్డ మాట వాస్తవం కాదా..?’’ అని రోజా దుయ్యబట్టారు. ఎన్‌టీఆర్ ప్రవేశపెట్టిన 2 రూపాయల కిలోబియ్యం ధరను 5 రూపాయలకు పెంచటం, విద్యుత్ బకాయిలు చెల్లించని రైతులను పీడీ చట్టం కింద అరెస్టు చేయించటం, ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు పరిహారం కోరితే.. ‘పరిహారమిస్తే ఆత్మహత్యలను ప్రోత్సహించినట్లు అవుతుంది’ అని హేళనగా మాట్లాడటమే బాబు పాలనలో సాధించిన ఘనత అని ఆమె వివరించారు. రైతులు, ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోలేదు కనుకనే తానిపుడు రుణాలు రద్దు చేస్తానంటే ఎవరూ నమ్మటం లేదని రోజా విమర్శించారు. 

తనపై కేసులు రాకుండా ఉండేందుకే... 

పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు, బస్సు చార్జీలు, కరెంటు చార్జీలు పెంచినా కాంగ్రెస్, కిరణ్ సర్కారులను చంద్రబాబు ప్రశ్నించటం లేదని ఆమె విమర్శించారు. కిరణ్ సర్కారు కొనసాగే అర్హత లేదని బయటకు విమర్శిస్తున్న బాబు.. తనపై కేసులు రాకుండా ఉండేందుకు ఆ ప్రభుత్వాన్ని కాపాడుతున్నారని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల కౌన్సిల్ ఎన్నికల్లోనూ, ఉప ఎన్నికల్లోనూ, సహకార ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆరోపించారు. చిత్తూరు జిల్లా సహకార ఎన్నికల్లో టీడీపీ నామినేషన్ వేయకుండా కాంగ్రెస్‌కు నిస్సిగ్గుగా సహకరించిందన్నారు. బాబు వైఖరిని చూస్తుంటే.. చిరంజీవి లాగా ఆయన కూడా టీడీపీని 2014 లోగా కాంగ్రెస్ పార్టీలో కలిపేసేట్లున్నారని ఎద్దేవా చేశారు. జగన్ ఎమ్మెల్యేలను సంత పశువుల్లా కొనుగోలు చేస్తున్నారని బాబు విమర్శించటాన్ని రోజా తప్పుపట్టారు. తన మామ ఎన్‌టీఆర్‌ను గద్దె దించినపుడు వైస్రాయ్ హోటల్‌లో గుంపుగా ఎమ్మెల్యేలను పశువుల్లాగా క్యాంపు నిర్వహించారు కదా.. వారందరికీ ఎన్ని కోట్లు చెల్లించి కొనుగోలు చేశారని ఆమె ప్రశ్నించారు. తన ఆస్తిగా వచ్చిన స్వల్ప వాటా భూమిని తన నల్లధనాన్ని తెల్లదిగా మార్చుకునేందుకు తండ్రికే అమ్మి తిరిగి కొనుగోలు చేసిన ఘనత చంద్రబాబుదని ఆమె విమర్శించారు. 
Share this article :

0 comments: