అధికార దుర్వినియోగానికి పరాకాష్ట - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అధికార దుర్వినియోగానికి పరాకాష్ట

అధికార దుర్వినియోగానికి పరాకాష్ట

Written By news on Thursday, February 21, 2013 | 2/21/2013

వైఎస్సార్ జిల్లాలో సహకార బ్యాంకు అధ్యక్ష ఎన్నికల్లో ప్రభుత్వ అధికార దుర్వినియోగం పరాకాష్టకు చేరిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భూమా శోభా నాగిరెడ్డి సహచర ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, ధర్మాన కృష్ణదాస్, మేకతోటి సుచరిత, ఏవీ ప్రవీణ్‌కుమార్ రెడ్డితో కలిసి లోటస్‌పాండ్ వద్ద మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ జిల్లాలో సహకార బ్యాంకు ఎన్నికను తక్షణం నిర్వహించాలని డిమాండ్ చేశారు. జిల్లా సహకార బ్యాంకు డెరైక్టర్లలో తమ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ తొలి రోజున కోరం లేదనే సాకుతో వాయిదా వేశారని, ఇపుడు సాక్షాత్తూ అధికారినే అపహరించుకు వెళ్లి ఎన్నిక జరగకుండా నిలిపి వేశారని ఆమె మండిపడ్డారు. 

కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఎన్ని వికృత చేష్టలకైనా పాల్పడుతుందనడానికి ఈ సంఘటనే ఉదాహరణ అని విమర్శించారు. సీఎం కిరణ్ తన అధికారం శాశ్వతం కాదన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. సహకార ఎన్నికలు ఇంత దుర్మార్గంగా నిర్వహించడం కంటే పదవుల్లో తమకు నచ్చిన వారిని నామినేట్ చేసుకుంటే పోయేది కదా అని వ్యాఖ్యానిం చారు. తొలినుంచీ సహకార ఎన్నికల్లో అక్రమాలు, అధికార దుర్వినియోగం తీవ్ర స్థాయిలో జరిగాయని, వైఎస్సార్ సీపీ గెలుస్తాయనే సొసైటీల్లో ఎన్నికలు జరపకుండా ప్రభుత్వం స్టేలు ఇచ్చి నిలిపి వేసిందన్నారు. వైఎస్సార్ జిల్లాలో డీసీసీబీ చైర్మన్ ఎన్నిక జరపలేదనే సాకుతో స్టే తెచ్చేం దుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు.

ఎన్నిక యథావిధిగా జరుగుతుంది: వైఎస్సార్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్ష ఎన్నిక గురువారం యథావిధిగా జరుగుతుందని సహకార శాఖ కమిషనర్ శ్రీనరేష్ ప్రకటించారు. ఎన్నికల నిర్వహణ అధికారిగా డిప్యూటీ రిజిస్ట్రార్ వెంకట సుబ్బయ్యను నియమిం చినట్లు తెలిపారు. వైఎస్సార్ జిల్లాలో ప్రభుత్వం అడ్డదారుల్లో డీసీసీబీ ఎన్నికలను వాయిదా వేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, శోభా నాగిరెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తదితరులు సహకార శాఖ కమిషనర్ శ్రీనరేష్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎన్నిక గురువారం యథావిధి గా జరుపుతామని ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు.

సాంకేతిక ఇబ్బందులు లేకుండా ఉండటం కోసమే
కడప కలెక్టర్ అధికారి కిడ్నాప్ గురించి సమాచారం ఇస్తే, వెంటనే వేరే అధికారిని నియమించే వెసులుబాటు ఉన్నా అలా చేయకుండా ఎన్నికను ఎందుకు వాయిదా వేశారని శ్రీనరేష్‌ను ‘సాక్షి’ ప్రతినిధి ప్రశ్నించగా.. ‘‘ఎన్నికల ప్రక్రియ సహకార చట్టం మేరకు ఉదయం 9 గంటలకే ప్రారంభించాలి. వేరే అధికారిని నియమించినా.. అప్పటికప్పుడు సంబంధిత రికార్డులను స్వాధీనం తదితర పనులకు సమయం పడుతుంది. సమయం మించిపోయాక ఎన్నిక చేపట్టారంటూ ఎవరైనా కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. అలా జరగకూడదనే ఎన్నికను వాయిదా వేశాం..’’ అని ఆయన బదులిచ్చారు.
Share this article :

0 comments: