బువ్వ పెట్టిన చెయ్యి.. బస్సులు కడుగుతోంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బువ్వ పెట్టిన చెయ్యి.. బస్సులు కడుగుతోంది

బువ్వ పెట్టిన చెయ్యి.. బస్సులు కడుగుతోంది

Written By news on Friday, February 8, 2013 | 2/08/2013

వేలకు వేలు కరెంట్ బిల్లు కట్టలేక.. సాగు నడవక.. 
కాడి వదిలేసి బతుకుదెరువు కోసం నానా ఇబ్బందులు

పక్క చిత్రంలో షర్మిలతో కలిసి నడుస్తున్న ఈ రైతు ఓ విధివంచితుడు.. బతికి చెడిన అభాగ్యుడు. పేరు గోడికొండ్ల యాదయ్య. ఊరు రంగారెడ్డి జిల్లా మూని గౌరెల్లి. నాలుగు ఎకరాలకు ఆసామి.. ఊరికి పెద్దమనిషి. దర్జాగా బతికిన రోజుల్లో నలుగురికి అన్నం పెట్టిన చెయ్యి. ఆరుగాలం కష్టపడి పంటను తీశారు. కుటుంబాన్ని సాకాడు. చంద్రబాబు నాయుడి తొమ్మిదేళ్ల పాలనలో అప్పుల పాలయ్యాడు. అయినా వ్యవసాయం వదిలిపెట్టలేదు. ఇద్దరు మగ పిల్లలు.. ఓ ఆడపిల్లను చదివించాడు. వైఎస్సార్ ముఖ్యమంత్రి కాగానే రుణాలు మాఫీ అయ్యాయి. పిల్లలు బడికి వెళ్తుంటే... జీతగాన్ని పెట్టుకొని వ్యవసాయం చేశాడు. ఆడపిల్ల పెళ్లి చేశాడు. పెద్ద కొడుకును బీఈడీ చదివించాడు. చిన్న కొడుకుని కాలేజీకి పంపించాడు. అంతా బాగా సాగుతుందనుకున్న సమయంలో ఊహించని విధంగా వైఎస్సార్ మరణ వార్త. అది తట్టుకోలేక కొద్దికాలం మంచాన పడ్డాడు. మెల్లమెల్లగా తేరుకున్నాడు. ఏడాది గచిచిపోయింది. కాలం కన్నెర్రజేసింది. 

పంటలు ఎండిపోయాయి. ఆడబిడ్డను భర్త వదిలేశాడు. పెద్దోని ఉద్యోగం కొద్దిలో తప్పిపోయింది. అయినా వ్యవసాయన్నే నమ్ముకున్నాడు. మళ్లీ అప్పుల పాలయ్యాడు. ఇన్ని కష్టాల సమయంలో సాయం చేయాల్సిన సర్కారు వేల రూపాయల కరెంటు బిల్లు కట్టాలని మెడ మీద కత్తి పెట్టింది. అప్పులకు తట్టుకోలేక భూమి అమ్మకానికి పెట్టాడు. అయితే అది లావణి పట్టా భూమి అని కొనేందుకు ఎవరూ రాలేదు. పూట గడవని పరిస్థితి రావడంతో కుటుంబాన్ని బతికించుకోవడానికి యాదయ్య పని కోసం పట్నం బాట పట్టాడు. ఇబ్రహీంపట్నం బస్సు డిపోలో బస్సులు కడిగే కార్మికుడిగా అవతారం ఎత్తాడు. గురువారం పాదయాత్రలో అటుగా వచ్చిన షర్మిలను కలిశాడు. ఆమెతోపాటు దాదాపు 45 నిమిషాలు నడుస్తూ బాధలు చెప్పుకొన్నాడు. ‘ఈ సర్కారు పేదోళ్లకు సాయంగాదు బిడ్డా.. అన్నొస్తే మల్లా రైతునై కాడిపట్టుకుంటా’ అని అనడంతో.. అన్న తప్పకుండా త్వరలోనే బయటకొస్తాడు అని షర్మిల ఆయనకు ధైర్యం చెప్పి ముందుకుసాగారు.
Share this article :

0 comments: