బాబును నిలదీసిన మహిళలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబును నిలదీసిన మహిళలు

బాబును నిలదీసిన మహిళలు

Written By news on Tuesday, February 19, 2013 | 2/19/2013

వేమూరు : కాంగ్రెస్ నేతల చొక్కాలు పట్టుకుని మౌలిక వసతులపై నిలదీయండని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘మీకోసం..’ పాదయాత్ర 12వ రోజు సోమవారం వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలం మూల్పూరులో జరిగింది. ఈ సందర్భంగా ఆయన్ను స్థానిక మహిళలు గట్టిగా నిలదీశారు. ‘రోడ్లు ఆ నాడూ వేసినోళ్లు లేరు. ఈనాడూ వేయలేదు. మేమంతా గుంటల రోడ్ల మీదనే నడవాలా..? ’ అంటూ కఠెవరం విశ్రాంతమ్మ అనే మహిళ ప్రశ్నకు చంద్రబాబు అవాక్కయ్యారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సమక్షంలోనే మహిళలు తమ సమస్యల్ని ఏకరువు పెట్టడం గమనార్హం. ఉదయం 11.30 గంటలకు కూచిపూడి నుంచి పాదయాత్రకు బయల్దేరిన చంద్రబాబు మూల్పూరు, పోతుమర్రు, జంపని గ్రామాల్లో 8 కిలోమీటర్ల దూరం సాగారు. 

ఈ సందర్భం లో మూల్పూరు ఆటోసెంటర్‌లో ఒకరిద్దరు మహిళలు టీడీపీ హయాంలో కూడా ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పగా, వారిపై చం ద్ర బాబు సీరియస్ అయ్యారు. రోడ్లు బాగా లేవని, ఇళ్లల్లోకి పాములు వస్తున్నాయ ని బాధలు చెప్పుకునే క్రమంలో బాబు స్పందిస్తూ కాంగ్రెసోళ్ల చొక్కాలు పట్టుకుని నిలదీయండన్నారు. దళితవాడలో దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలను చూసి ఆయన తట్టుకోలేక.. ఎన్టీఆర్ మాదిగలకు ఎన్నో మంచి పనులు చేసినా ఆయన విగ్రహాలెందుకు పెట్టరూ’ అంటూ చంద్రబాబు కోపంగా మాట్లాడటం స్థానికులకు మనస్తాపాన్ని కలిగించింది. అదేవిధంగా మానుకొండ ఏసోబు అనే వ్యక్తి తమ ప్రార్థనా మందిరంలోకి ఆయన్ను ఆహ్వానించగా, పెద్దగా పట్టించుకోకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.

జెడ్పీ హైస్కూలుకు సెలవిచ్చి.. 
చంద్రబాబు పాదయాత్ర పేరుతో కూచిపూడిలో జెడ్పీహైస్కూలుకు సెలవు ప్రకటించి స్వాగతం పలకాలని విద్యార్థులను మండుటెండలో నిలబెట్టారు. అక్కడకొచ్చిన చంద్రబాబు పిల్లలతో మాట్లాడారు. ఉపాధ్యాయ పోస్టులు కొరత కారణంగా సకాలంలో సిలబస్ పూర్తికావడం లేదని చెప్పగా.. ఓట్లు లేని వారితో మాట్లాడి ఉపయోగమేంటని ఆయన ప్రశ్నించగా, తమ తల్లిదండ్రులు ఓట్లేస్తారంటూ సమాధాన మిచ్చారు. అనంతరం బాబు పోతుమర్రులో పాదయాత్ర చేసి జంపనిలో రాత్రి బసకు ఆగారు.
Share this article :

0 comments: