సర్కారు మైనార్టీలో పడింది.. అవిశ్వాసానికి బాబు సిద్ధమా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సర్కారు మైనార్టీలో పడింది.. అవిశ్వాసానికి బాబు సిద్ధమా?

సర్కారు మైనార్టీలో పడింది.. అవిశ్వాసానికి బాబు సిద్ధమా?

Written By news on Saturday, February 2, 2013 | 2/02/2013

- వైఎస్సార్ సీపీ నేత అంబటి ప్రశ్న
- 9 మందిని బహిష్కరించినట్లయితే సర్కారు సంఖ్యా బలం తగ్గి మైనార్టీలో పడినట్లే
- చంద్రబాబు అవిశ్వాసం పెడతారా లేక
- చీకటి ఒప్పందాలకే కట్టుబడి ఉన్నారా? 

సాక్షి, హైదరాబాద్: తొమ్మిదిమంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌నుంచి బహిష్కరించడంతో మైనారిటీలో పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టేందుకు ప్రతిపక్షనేత చంద్రబాబు సిద్ధంగా ఉన్నారా? లేక చీకట్లో కుదుర్చుకున్న ఒప్పందాలకు కట్టుబడి ఉన్నారా? అని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బాబు నిజంగా ప్రతిపక్ష నేతగా వ్యవహరించగలిగితే ఈ ప్రజాకంటక ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజాపక్షంగా వైఎస్సార్‌సీపీ అవిశ్వాసం పెడితే బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా టీడీపీ మద్దతిస్తుందా? అని నిలదీశారు. 

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన తొమ్మిది మంది పార్టీ ఎమ్మెల్యేలను బహిష్కరించామని చెప్తున్న పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ వారి పేర్లు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ‘‘జగన్‌ను జైల్లో ఇప్పటివరకు తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు కలిశారు. అందులో ఐదుగురు కాంగ్రెస్, నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలున్నారు. బొత్స లెక్కల బట్టి చూస్తే టీడీపీ వారిని కూడా బహిష్కరించారా..?’’ అని ఎద్దేవా చేశారు. బహిష్కరించిన వారి పేర్లను ధైర్యంగా చెప్పలేని దుస్థితిలో పీసీసీ చీఫ్ ఉన్నారని విమర్శించారు. తొమ్మిది మందిని బహిష్కరించినట్లయితే ప్రభుత్వం మైనారిటీలో పడినట్లే కనుక బేషరతుగా బల నిరూపణకు సిద్ధపడాలని డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: