అధికారం...అరాచకం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అధికారం...అరాచకం

అధికారం...అరాచకం

Written By news on Friday, February 1, 2013 | 2/01/2013

సహకార ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలు పరాకాష్టకు చేరాయి. కడప మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డిపై కేసు నమోదు చేయించడమే ఇందుకు ఉదాహరణ అని వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా నాయకులు అంటున్నారు. సహకార ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గెలుపు సునాయాసమని నిర్ధారణకు వచ్చిన కాంగ్రెస్..టీడీపీతో జట్టుకట్టింది. ఆ రెండు పార్టీల నేతలు కలిసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులే లక్ష్యంగా పావులు కదుపుతూ వచ్చారు. రవీంద్రనాథ్‌రెడ్డి అందుబాటులో ఉంటే వైఎస్సార్సీపీ ప్రభంజనాన్ని అడ్డుకోవడం అసాధ్యమని ఆయన్ను ఎన్నికలకు దూరంగా ఉంచాలనే నిర్ణయానికి వచ్చాయి. అందులో భాగంగానే ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి, సెక్షన్ 420 కింద కేసు నమోదు చేయించారని చెబుతున్నారు. పెద్దచెప్పలి సహకార సంఘంలో బోగస్ ఓట్లు ఉన్నాయని మాజీ మేయర్ రవీంద్రనాథరెడ్డి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై విచారణకు ఆదేశించిన యంత్రాంగం అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గింది. మాజీ మేయర్ ఫిర్యాదు ప్రతి బదులు ఆ స్థానంలో మరో ఫోర్జరీ పత్రాన్ని ఉంచి అధికారులు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై డ్రామా ఆడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి చేసినట్లు చెబుతున్న సంతకాన్ని పరిశీలిస్తే అధికార కుట్ర బట్టబయలవుతుందని వారు తేల్చిచెబుతున్నారు. రవీంద్రనాథ్‌రెడ్డి అందుబాటులో లేకుండా చేసే ఎత్తుగడలో భాగంగానే ఇదంతా జరుగుతోందని అంటున్నారు. అయితే సహకార ఎన్నికల నేపథ్యంలో మాజీ మేయర్ రవీంద్రనాథరెడ్డిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు బుధవారం వైఎస్సార్ జిల్లా పోలీసులను ఆదేశించిన విషయం విదితమే. 
Share this article :

0 comments: