నేడు షర్మిల పాదయాత్ర సాగుతుందిలా... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు షర్మిల పాదయాత్ర సాగుతుందిలా...

నేడు షర్మిల పాదయాత్ర సాగుతుందిలా...

Written By news on Tuesday, February 26, 2013 | 2/26/2013


 మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, జననేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర మంగళవారం మాచర్ల నియోజకవర్గంలో సాగనుందని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, టూర్ ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. మాచర్ల నియోజకవర్గంలో బసచేసిన ప్రాంతంనుంచి చినకొదమగుండ్లకు చేరుకుంటారని తెలిపారు. అక్కడినుంచి పెదకొదమగుండ్ల, కాకానివారిపాలెం, బ్రహ్మనాయుడు కాలనీకి వెళ్తారు. అక్కడకు 1.7 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారన్నారు. అక్కడినుంచి యాపకంపల్లి మీదుగా కారంపూడి చేరుకుని సభలో ప్రసంగిస్తారని తెలిపారు. అనంతరం రాత్రి బస ప్రాంతానికి చేరుకుంటారని పేర్కొన్నారు.

పర్యటించే గ్రామాలు
మాచర్ల నియోజకవర్గంలోని చినకొదమగుండ్ల, పెద కొదమగుండ్ల, కాకానివారిపాలెం, బ్రహ్మనాయుడుకాలనీ, యాపకంపల్లి, కారంపూడి.
Share this article :

0 comments: