కాంగ్రెస్ తో చంద్రబాబు కుమ్మక్కు: షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్ తో చంద్రబాబు కుమ్మక్కు: షర్మిల

కాంగ్రెస్ తో చంద్రబాబు కుమ్మక్కు: షర్మిల

Written By news on Wednesday, February 6, 2013 | 2/06/2013

మహానేత వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు కోసం ఎన్నో పథకాలు చేపట్టారని మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో బుధవారం నాటి ముగింపు సభలో షర్మిల అన్నారు. వైఎస్ హయంలో రైతులు అప్పుల ఊబి నుంచి బయటపడ్డారని షర్మిల తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం రైతుల్ని అష్టకష్టాల పాలుచేస్తున్నారన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి.. అవిశ్వాసం పెట్టకుండా ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపాడుతున్నారన్నారని షర్మిల మండిపడ్డారు. కాంగ్రెస్‌తో చంద్రబాబు కుమ్మక్కయ్యారు.. అందుకే అవిశ్వాసం పెట్టడం లేదని ఆరోపించారు. 

ప్రతి విషయంలోనూ ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం హయంలో గ్యాస్ ధరలు అమాంతంగా పెరిగిపోయాయని, కరెంట్ ఛార్జీలు నాలుగు రెట్లు పెంచేశారని ప్రజల దృష్టికి తీసుకువచ్చారు. 

వైఎస్ హయాంలో ఒక్కసారి కూడా విద్యుత్, గ్యాస్ ధర పెరగలేదని, ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకం అందక ఎంతోమంది విద్యార్థులు చదువుకునే స్తోమత లేక ఇంట్లోనే ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ హయంలో ఫీజు రీయింబర్స్‌తో ఎంతో మంది విద్యార్థులు లబ్ధి పొందారన్నారు. ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు, ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లను వైఎస్ చేపట్టారని..104,108, ఫీజు రీయింబర్స్‌ను వైఎస్ అమలు చేశారని షర్మిల తెలిపారు. 

కిరణ్ సీఎం అయ్యాక రాష్ట్రంలో భయంకరమైన విద్యుత్ సంక్షోభం నెలకొందని... రైతులకు కనీసం 4 గంటలు కరెంట్‌ కూడా ఇవ్వడం లేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంట్ సంక్షోభంతో పరిశ్రమలన్నీ మూతపడ్డాయని..లక్షల మంది యువకులు ఉద్యోగాలు కోల్పోయారని షర్మిల అన్నారు. ఇక తన హయంలో చంద్రబాబు 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని షర్మిల అన్నారు. 

చిరంజీవి కూతురు ఇంట్లో 70 కోట్ల రూపాయలు బయటపడిన విషయాన్ని షర్మిల ప్రస్తావించారు. వైఎస్ జగన్‌ బయటకు వస్తే కాంగ్రెస్‌, టీడీపీలు మూతపడతాయని.. అందుకే వైఎస్ జగన్ ను బయటకు రాకుండా కాంగ్రెస్, టీడీపీలు కుట్ర పన్నాయని షర్మిల విమర్శించారు. 
Share this article :

0 comments: