అధికారం దక్కదనే అడ్డగోలు మాటలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అధికారం దక్కదనే అడ్డగోలు మాటలు

అధికారం దక్కదనే అడ్డగోలు మాటలు

Written By news on Thursday, February 7, 2013 | 2/07/2013

* చంద్రబాబుపై వైఎస్సార్ సీపీ నేత శోభానాగిరెడ్డి విమర్శ 
* వ్యవస్థలన్నిటినీ భ్రష్టుపట్టించింది బాబే 

సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి రాలేననే నిరాశా నిస్పృహలతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్షం ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి విమర్శించారు. బుధవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి పత్రికను అడ్డం పెట్టుకుని న్యాయవ్యవస్థను బెదిరిస్తున్నారంటూ చంద్రబాబు చేసిన విమర్శలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘జగన్‌కు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకముంది. ఇప్పుడూ ఉంది. భవిష్యత్‌లోనూ ఉంటుంది. టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కై జగన్‌పై ఎన్ని కుట్రలు చేస్తున్నారో తెలిసి కూడా న్యాయవ్యవస్థపై నమ్మకంతో మేం న్యాయపోరాటాన్ని చేస్తున్నాం.

జగన్ బెయిల్ విచారణకు రావడానికి ఒక్క రోజు ముందు టీడీపీ ఎంపీలు కేంద్రంలో చిదంబరంను కలిసినా.. బాబు చీకట్లో చిదంబరాన్ని కలుసుకుని తనపై కేసులు రాకుండా చూసుకుంటున్నా.. మేం మాత్రం న్యాయస్థానాలనే నమ్ముకుని ఉన్నాం’ అని ఆమె అన్నారు. వాస్తవానికి ఒక్క న్యాయవ్యవస్థనే కాదు, వ్యవస్థలన్నింటిని భ్రష్టు పట్టించిందెవరో అందరికీ తెలుసునని ఆమె అన్నారు. ఆ రోజు ఎన్టీఆర్‌ను కాదని సైకిల్ గుర్తు పొందడానికి బాబు చేసిన వ్యవహారం అందరికీ తెలుసునన్నారు. వ్యవస్థలన్నింటినీ తనకు అనుకూలంగా వాడుకుని పనిచేయించుకోగల వ్యక్తి, నమ్మకద్రోహి చంద్రబాబు అని ఆయన మామ ఎన్టీఆరే అన్నారని శోభ గుర్తు చేశారు. బాబు అంత మ్యానిపులేటర్ మరొకరు లేరన్నారు. వ్యక్తులను వాడుకుని వదలి వేయడంలో బాబును మించిన వారొకరుండరని సినీనటి జయప్రద కూడా పేర్కొన్నారని ఆమె ఉదహరించారు. 

బాబూ.. నీకు ఏ కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చింది..
బాబు తన పాదయాత్రలో రోజూ జగన్ నామస్మరణ చేయకుండా.. వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఆడిపోసుకోకుండా ఉండలేక పోతున్నారని శోభానాగిరెడ్డి దుయ్యబట్టారు. ‘ప్రధాన ప్రతిపక్ష నేత అయిన బాబు ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి. అధికార పార్టీ లోపాలను తూర్పారబట్టాలి. ఇక్కడ దురదృష్టమేమిటంటే ఆయన ఎప్పుడూ జగన్ మీద, ఆయన కుటుంబం మీద లేని పోని ఆరోపణలు చేస్తున్నారు’ అని ఆమె విమర్శించారు.

నిజంగా బాబుకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంటే.. ఆయన కేసులపై స్టేలు ఎందుకు తెచ్చుకున్నారు? ఐఎంజీ, ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారాల్లో ఎందుకు తప్పించుకుంటున్నారు? అని ఆమె ప్రశ్నించారు. బాబు తనకు తాను మచ్చలేని చంద్రుడినని చెప్పుకుంటున్నారని.. అసలు ఆయనకు ఏ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్‌తో కలిసి పోతుందని బాబు చేస్తున్న విమర్శలు అర్థం లేనివని కొట్టిపారేశారు. నిజంగా కాంగ్రెస్‌తో కలిసే ఆలోచనే ఉండి ఉంటే.. జగన్ 8 నెలలుగా జైల్లో ఎందుకుంటారని ప్రశ్నించారు. ప్రస్తుతం మైనారిటీలో పడిపోయిన సర్కారుకు రక్షణ గోడగా ఎందుకు నిలుస్తున్నారో బాబు జవాబు చెప్పాలన్నారు. 

ఇంకా మీకు పత్రికలెందుకు?
చంద్రబాబును మోయడానికి అరడజనుకుపైగా పత్రికలు, మీడియా చానళ్లు ఉన్నపుడు ఇంకా ఆయన పత్రికలు పెట్టడం ఎందుకని శోభ ప్రశ్నించారు. జగన్ సాక్షి పత్రికను, టీవీ చానల్‌ను పెట్టినందుకు బాబు నిందలు వే స్తూ.. తాను చాలా ఏళ్లు అధికారంలో ఉన్నా వాటిని స్థాపించలేకపోయానని అనడం విచిత్రంగా ఉందన్నారు. ‘రాష్ట్రంలోని మెజారిటీ పత్రికలు, చానళ్లు బాబు వేసే ప్రతి అడుగును సవివరంగా చూపిస్తున్నాయి. బాబును ముఖ్యమంత్రి చేయాలన్న తాపత్రయం ఆయనకన్నా వారికే ఎక్కువగా ఉంది. ఇంకా బాబుకు ప్రత్యేకంగా పత్రికలు, చానళ్లు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది?’ అని ఆమె అన్నారు.
Share this article :

0 comments: