బీసీలకు బాబు బద్ధ వ్యతిరేకి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బీసీలకు బాబు బద్ధ వ్యతిరేకి

బీసీలకు బాబు బద్ధ వ్యతిరేకి

Written By news on Thursday, February 28, 2013 | 2/28/2013


 బలహీనవర్గాలకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పూర్తి వ్యతిరేకమని వైఎస్సార్ కాంగ్రెస్ బీసీ విభాగం రాష్ట్ర కన్వీనర్ గట్టు రామచంద్రరావు చెప్పారు. బాబు తొమ్మిదేళ్ల హయాంలో బీసీల కులవృత్తులను సర్వనాశనం చేసి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కోలుకోలేని దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన నిర్వాకం వల్లే గ్రామాలు జీవం కోల్పోయి, పల్లెలు వల్లకాళ్లుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తి బీసీ డిక్లరేషన్ పేరుతో మరోసారి మోసగించే ప్రయత్నం చేస్తున్నారని గట్టు ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో బీసీలకు ఏం మేలు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పేదరికం నిర్మూలన కోసం ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టకపోగా బిల్ క్లింటన్, బిల్ గేట్స్ వస్తున్నారని చెప్పి హైదరాబాద్‌లోని పేదల్ని చిత్రహింసలకు గురిచేసి తరిమేశారని గుర్తుచేశారు.

తొమ్మిదేళ్ల కాలంలో కరువు, వరదలతో రైతులు సర్వం కోల్పోతే... వారిని ఆదుకోవాల్సింది పోయి పగబట్టినట్టుగా కరెంటు బిల్లులు చెల్లించాలంటూ తీవ్ర మానసిక వేధింపులకు గురిచే శారని తెలిపారు. విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా పోరాడితే కాల్పులు జరిపించి బడుగుల ఉసురు తీసిన ఘనత చంద్రబాబుది కాదా? అని ప్రశ్నించారు. చేనేత కార్మికులు, రైతుల ఆత్మహత్యలు చంద్రబాబు హయాంలో రికార్డుస్థాయిలో నమోదయ్యాయన్నారు. 1998లో 57 మంది ఆత్మహత్య చేసుకోగా... బాబు నిర్వాకం వల్ల 2004 నాటికి 1700కు చే రాయని వివరించారు. వాటి తాలూకు వివరాలు బాబును అధికారంలోకి తెచ్చేందుకు తహతహలాడుతున్న ఆయన ‘ముద్దుల పత్రిక’ ప్రచురించిందని చెప్పారు. బడుగు, బలహీనవర్గాలకు మేలు జరిగినదల్లా దివంగత నేతలు ఎన్టీఆర్, వైఎస్సార్‌ల హయాంలోనే అని గట్టు వివరించారు
Share this article :

0 comments: