రాజన్న రాజ్యం కోసం.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజన్న రాజ్యం కోసం..

రాజన్న రాజ్యం కోసం..

Written By news on Friday, February 8, 2013 | 2/08/2013

వారు రాజశేఖరరెడ్డికి రక్త సంబంధీకులు కాదు.. అంతకంటే బలీయమైన బంధాన్ని పెనవేసుకున్నారు.. బంధుమిత్రులు అంతకన్నా కాదు.. అంతకుమించిన ఆప్యాయతను చూపుతున్నారు.. రాజకీయ నాయకులు కాదు.. పదవుల కోసం పనిచేస్తున్నారనడానికి.. సామన్య ప్రజలు. రాష్ర్టంలో రాజన్న పాలన మళ్లీ రావాలన్నదే వారి లక్ష్యం.. సుదూర ప్రాంతాల్నుంచి వచ్చి.. కుటుంబాలకు దూరంగా... తిండితిప్పలను సైతం పక్కనపెట్టి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో చేయి కలిపారు.. మరోప్రజా ప్రస్థానం మైలురాయిలో తాము భాగస్వాములమవ్వాలని భావించారు. రోజుల తరబడి నడుస్తున్నా.. ఉరకలేసే ఉత్సాహాన్ని చూపుతున్నారు. మహానేత కుమార్తె షర్మిల మరో ప్రజా ప్రస్థానం పేరుతో చేపట్టిన పాదయాత్రలో ఆమెతో కలిసి అడుగేస్తున్నారు. ఇడుపుల పాయనుంచి ఇచ్చాపురం వరకు తాము ఆమె వెన్నంటే ఉంటామని చెబుతున్నారు. వారే వైఎస్ రాజశేఖరరెడ్డి వీరాభిమానులు.. ఆత్మీయ బంధువులు.. వారితో ‘న్యూస్‌లైన్’ మాటామంతీ..
- న్యూస్‌లైన్, ఇబ్రహీంపట్నం రూరల్

జగన్ కోసమే...
జగన్ కోసమే షర్మిల పాదయాత్ర లో పాల్గొంటున్నాను. ఆయన్ను ముఖ్యమంత్రిగా చూడాలనేదే నా కోరిక. ఇడుపులపాయ నుంచి ఈ పాదయాత్రలో పాల్గొంటున్నాను. టైలరింగ్ నా వృత్తి. వైజాగ్ నుంచి కుటుంబానికి దూరంగా వుండి పాదయాత్రలో పాల్గొంటున్నాను. వైఎస్‌ఆర్ మా పాలిటదైవం. జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి పోలవరం దీక్షలో పాల్గొన్నాను. మరో ప్రజాప్రస్థానం పూర్తయ్యేవరకు యాత్రతోపాటే వుంటా. జగన్ జైలునుంచి వచ్చిననాడే ఈ రాష్ట్రానికి సంపూర్ణ న్యాయం జరుగుతుంది.
- ఉప్పు వరప్రసాద్, దేవవరం, నక్కలపల్లిమండలం, విశాఖ జిల్లా

ఆడబిడ్డకు తోడుగా ఉండాలనే...
నాన్న ఆశయ సాధనకోసం.. అన్నకు ఇచ్చినమాటకోసం ఓ ఆడబిడ్డ పాదయాత్ర చేస్తూ ప్రజల్లో తిరుగుతుంటే.. నేనూఒక ఆడబిడ్డగా ఆమెతో కలిసి పనిచేస్తున్నా. ప్రతిమహిళా లక్షాధికారి కావాలని కలలుగన్న రాజశేఖరరెడ్డి కుటుంబం ప్రస్తుతం ఆపత్కాలంలో వుంది. ఇలాంటి సమయంలో మాలాంటి సామాన్య ప్రజానీకం మద్దతు వారికి కావాలి. అందుకోసమే ప్రజాప్రస్థానం ప్రారంభమైనప్పట్నుంచీ నేను షర్మిలతో పాటే వుంటున్నా. ఈ యాత్రముగిసే వరకు ఆమెతోనే వుంటా. 
- సన్నపురెడ్డి రమణమ్మ, నేలటూర్లు మద్దిపాడు మండలం, ప్రకాశం జిల్లా

కాళ్లకు చెప్పుల్లేకుండా...
ప్రజా ప్రయోజనం కోసం పాదయాత్ర చేస్తున్న షర్మిలమ్మతో కలసి ఇడుపులపాయ నుంచి వస్తున్నా. ఇంతమంచి కార్యంలో కాళ్లకు చెప్పుల్లేకుండా పాల్గొనాలని నిశ్చయించుకున్నా. అందుకే ఇప్పటివరకు కాళ్లకు చెప్పుల్లేకుండా పాదయాత్రలో నడుస్తున్నా. ఇచ్చాపురం వరకు ఇలాగే వెళ్తాను. గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డితో కలిసి పాదయాత్రలో పాల్గొన్నా. 560కిలో మీటర్లు ఆయనతో కలిసి నడిచాను. అప్పుడు కూడా చెప్పుల్లేకుండా నడిచాను. ఇలా నడిస్తేనే నాకు సంతృప్తిగా వుంటుంది.
- గజ్జెల కృష్ణారెడ్డి,రొంపిచర్ల, నర్సరావుపేట మండలం, గుంటూరు జిల్లా

ఉడతా భక్తి..
మహానేత రాజశేఖరరెడ్డి పేదల పక్షపాతి. రైతుబాగుంటే రాష్ట్రం కళకళలాడుతుందని నమ్మిన రైతుబాంధవుడు. ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ, వృద్ధాప్య ఫించన్లు, 108, జలయజ్ఞం వంటి బృహత్తర పథకాలను ప్రవేశపెట్టిన ఆయన మాలాంటి సామాన్య ప్రజానీకానికి దైవం. ఆయన కుమారుడిని కుట్రలతో జైలు పాలు చేయడం తట్టుకోలేకపోయాం. రామాయణండలో ఉడతభక్తి వలె.. రాజన్న బిడ్డ చేపట్టిన మరోప్రజా ప్రస్థానంలో భాగస్వాములమయ్యాం. ఇ చ్చాపురం వరకు యాత్రలో పాల్గొని విజయవంతం చేస్తాం. 
- వై.చినరెడ్డయ్య, అమినెలగ్రామం, వెన్‌పల్లిమండలం, కర్నూలు జిల్లా

వైఎస్‌తో కలిసి 750కిలోమీటర్లు...
గతంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఆయనతోపాటు 750 కిలోమీటర్ల దూరం నడిచాను. ఆయనతో నాది ఆత్మీయానుబంధం. నన్ను చూడగానే పలకరించేవారు. ఆ మహానేత మనకు దూరమయ్యేసరికి ప్రభుత్వ, ప్రతిపక్షాలు కుట్రతో ఆయన కుటుంబాన్ని వేధిస్తున్నాయి. వెటర్నరీ విభాగంలో ఉద్యోగం చేస్తూ ఇటీవలే రిటైర్ అయ్యాను. నేనేకాదు నాలాంటి వారెంతో మంది ఈ రోజు షర్మిలతో కలసి పాదయాత్ర చేస్తున్నారు. 
- బి.తిమ్మయ్య, పావురాలగుట్ట, కర్నూలుజిల్లా

త్వరలో మళ్లీ రాజన్న రాజ్యం
షర్మిల చేపట్టిన మరోప్రజాప్రస్థానం పాదయాత్రలో మొదటిరోజు నుంచి పాల్గొంటున్నా. గత నాలుగు సంవత్సరాలుగా రాజశేఖరరెడ్డి కుటుంబంతో కలిసి అభిమానంతో పనిచేస్తున్నా. పాదయాత్రతో త్వరలో రాజన్న రాజ్యం రాబోతుంది. అందులో ప్రజలే పాలకులు. ప్రజలమంతా ఏకమై నేడు స్వచ్ఛందంగా పాదయాత్రలో పాల్గొనేది ప్రజాధికార సాధన కోసమే. 2014లో జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి మన సమస్యలను పరిష్కరిస్తారు. 
- ముడిమారం మంగమ్మ, కీసర, రంగారెడ్డిజిల్లా

ప్రాణదాత కుటుంబానికి అండగా..
ప్రజా సంక్షేమ పథకాలెన్నో ప్రవేశపెట్టి పేద, మధ్యతరగతి కుటుంబాలకు మేలుచేసి, ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతోమంది ప్రా ణాల్ని కాపాడిన ప్రాణదాత రాజశేఖరరెడ్డి. ప్రస్తుతం ఆయన మనమధ్యలో లేరు. ప్రస్తుత ప్రభుత్వం ఆయన పథకాలను తుంగలోతొక్కుతోంది. అందుకే ఆయన కూతురు షర్మిల పాదయాత్రకు పూనుకున్నారు. ఆమెకు తోడుగా మేం పాదయాత్రలో అడుగులేస్తున్నాం. ఎందిరికో ప్రాణ దానం చేసిన మహానేత కుటుంబంకోసం ప్రాణాలైనా ఇస్తాం.
- నాగిపొదు దయామణి, వైదన గ్రామం, ప్రకాశంజిల్లా

లండన్ వదిలి.. మరో ప్రజాప్రస్థానంలో..
లండన్‌లో సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా పనిచేసేవాడ్ని. ఒక సదాశయం కోసం షర్మిల చేపట్టిన పాదయాత్రకు మద్దతు తెలిపి ఆ కార్యక్రమంలో భాగస్వామిని కావాలనుకున్నా. దీనిలో భాగంగానే. ఉద్యోగానికి రాజీనామా చేసి ఇక్కడకు వచ్చాను. విద్యావైద్య రంగాల్లో రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. తిరిగి వైఎస్ పథకాలను కొనసాగించాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి. అప్పటివరకు పాదయాత్రలాంటి ఎలాంటి కార్యక్రమానికైనా పనిచేస్తా. 
- దవళి గిరిబాబు(ఎన్నారై), టెక్కలి శ్రీకాకుళంజిల్లా
Share this article :

0 comments: