పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో విజయమ్మ దిశానిర్దేశం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో విజయమ్మ దిశానిర్దేశం

పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో విజయమ్మ దిశానిర్దేశం

Written By news on Thursday, February 21, 2013 | 2/21/2013

* పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో విజయమ్మ దిశానిర్దేశం
* స్థానిక ఎన్నికల తర్వాత వరుసగా ఎన్నికలే 
* క్షణం వృథా చేయకుండా ప్రజాక్షేత్రంలో ఉండాలి
* ఇది ప్రజల పార్టీ... పేదల పార్టీ అని రుజువు చేయాలి 
* జగన్‌లో ఆత్మవిశ్వాసం ఏమాత్రం తగ్గలేదు
* మూడేళ్లు కష్టపడితే 30 ఏళ్లు సువర్ణయుగం 
* రుణమాఫీ చేయాలని 2012లోనే లేఖ రాశాం
* బాబు హయాంలో ఒక్క లేఖయినా రాశారా? 
* వైఎస్‌ను తిట్టడమే ఎజెండాగా పనిచేస్తున్నారు
* బాబు ఎన్ని గిమ్మిక్కులు చేసినా ప్రజలు విశ్వసించరు 
* అనిల్‌పై ఆరోపణల విషయంలో పరువునష్టం దావా 

 రాష్ట్రంలో వరుసగా రాబోతున్న ఎన్నికల్లో సత్తా చాటేందుకు పార్టీ శ్రేణులు సర్వసన్నద్ధంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొని ప్రత్యర్థులకు పార్టీ సత్తా చూపించాలన్నారు. పంచాయతీ ఎన్నికలతో మొదలు అసెంబ్లీ, లోక్‌సభ వరకు ఒకదాని తర్వాత మరొక ఎన్నికలు వస్తాయని, ప్రతి ఎన్నికల్లోనూ ఘనవిజయం సాధించడానికి పార్టీ యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని చెప్పారు. విజయమ్మ అధ్యక్షతన బుధవారం జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో నేతలకు రానున్న ఎన్నికలను ఎదుర్కొనడం, పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.

ప్రజాసమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైనప్పుడు ప్రశ్నించాల్సిన ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం అదే ప్రభుత్వంతో అంటకాగుతూ కేవలం వైఎస్ రాజశేఖరరెడ్డిని, ఆయన కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయాలన్న లక్ష్యంతోనే పనిచేస్తున్న విధానాన్ని ఎండగట్టారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇటు ప్రధాన ప్రతిపక్షం ప్రజలకు దూరమయ్యాయని, రాష్ట్ర ప్రజలంతా ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్‌పై నమ్మకంతో ఉన్నారని చెప్పారు. వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు పార్టీనేతలు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని ఉద్బోధించారు. రాష్ట్ర ప్రజలు ఎన్ని కష్టాల్లో ఉన్నా అధికారపక్షం పట్టించుకోవడం లేదని, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా దీనిని ప్రశ్నించడం లేదని విమర్శించారు. ‘‘టీఆర్‌ఎస్ ఉద్యమ పార్టీ కాదు, ఎన్నికల పార్టీ అని కేసీఆర్ వెల్లడించేశారు. కాంగ్రెస్ నేతలు ఢిల్లీ చుట్టూ తిరుగుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు.

చంద్రబాబునాయుడు చీకట్లో కాంగ్రెస్‌తో దోస్తీ చేసి తనపై కేసులు రాకుండా చూసుకుంటున్నారు. అందుకే ప్రజలు వీరి విధానాలు చూసి రాజన్న రాజ్యం కావాలని కోరుకుంటున్నారు. అన్ని ప్రాంతాల ప్రజలు సంక్షేమాన్ని కోరుకుంటున్నారు. మన మీద వారు ఎంతో నమ్మకాన్ని ఉంచారు. అందుకే మనం పార్టీని పోలింగ్ బూత్, గ్రామ, వార్డు స్థాయి పునాదుల నుంచి పటిష్టంగా నిర్మించాలి. క్రమశిక్షణ గల పార్టీగా రూపొందించాలి. గడపగడపకూ వైఎస్ విధానాలు తీసుకెళ్లాలి. జగన్ ముఖ్యమంత్రి అయితేనే తమ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందనే నమ్మకంతో ఉన్న వారందరి మద్దతు పొందాలి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని దేవుడని ప్రజలు పూజిస్తున్నారు. మన పార్టీకి మంచి భవిష్యత్ ఉంది’’ అని విజయమ్మ ఉద్బోధించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ చేయవద్దని సూచించారు. సభ్యత్వ కార్యక్రమం, సంస్థాగత వ్యవహారాలు, గ్రామ, బస్తీ, వార్డు కమిటీల ఏర్పాటును తాను స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు. క్రమశిక్షణ గల కార్యకర్తలను తయారు చేసుకోవడంతోపాటుగా వారందరికీ శిక్షణా తరగతులు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా రూపొందిస్తున్నామని ఆమె తెలిపారు. 

జగన్ ఆత్మవిశ్వాసం చెక్కు చెదరలేదు: ‘‘జగన్‌ను అన్యాయంగా, అధర్మంగా జైల్లో పెట్టారు. ఇప్పటికి తొమ్మిది నెలలుగా జైల్లో ఉన్నా ఏ మాత్రం ఆయన ఆత్మ విశ్వాసం చెక్కు చెదరలేదు. సడలి పోలేదు. జైలుకు వెళ్లడానికి ముందు ఎలాగున్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారు. జగన్‌కు ప్రజల్లో అభిమానం పెరుగుతున్నందునే సీబీఐ పగబట్టి వేధిస్తోంది’’ అని విజయమ్మ చెప్పారు. పార్టీ సంస్థాగత విషయాలు చర్చించుకోవడానికి ఒకసారి సమావేశం అయితే మంచిదని జగన్ ఇచ్చిన సూచనల మేరకే ఈ సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. 

తన వెంట వచ్చే వాళ్లకు కష్టాలు తప్పవని జగన్ ఎప్పుడో చెప్పారని గుర్తుచేశారు. మూడేళ్ల పాటు కష్టపడితే ఆ తరువాత 30 ఏళ్లపాటు ప్రజలకు సువర్ణయుగం అందించవచ్చన్నారు. ‘‘మనది ప్రజల పార్టీ, పేదల పార్టీ అని రుజువు చేయాలి. జగన్‌కు ఉన్న పట్టుదల, కార్యదీక్షను స్ఫూర్తిగా తీసుకుని కార్యకర్తలు ముందుకు సాగాలి. నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ స్థానిక ఎన్నికలకు ఇప్పటినుంచే కార్యోన్ముఖులు కావాలి’’ అని కోరారు. ‘జగన్ కోసం జనం సంతకం’ కార్యక్రమాన్ని 20 రోజుల్లో విజయవంతంగా పూర్తి చేసినందుకు అందరికీ అభినందనలు తెలిపారు. 

రుణమాఫీపై స్పందించింది మేమే: రైతుల రుణాలు మాఫీ చేయాలని 2012 నవంబర్ పదో తేదీన ఒకసారి, అదే ఏడాది డిసెంబర్ 14వ తేదీన మరోసారి తానే స్వయంగా లేఖ రాశానని విజయమ్మ తెలిపారు. ప్రధాని సమయం ఇస్తే తమ ఎమ్మెల్యేలతో ఢిల్లీకి వెళ్లి రుణాలు మాఫీ చేయాల్సిందిగా కోరతామని చెప్పారు. కేంద్రంలో చక్రం తిప్పానని, ప్రధానమంత్రిగా ఎవరుండాలో తానే నిర్ణయించానని చెప్పుకునే బాబు తాను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రుణ మాఫీని ఎందుకు చేయించలేకపోయారని ప్రశ్నించారు. రుణాలు మాఫీ చేయమని కనీసం ఒక్క లేఖయినా రాశారా? 4,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏ ఒక్క రైతు ఇంటికైనా వెళ్లి బాబు పరామర్శించారా? అని నిలదీశారు.

వైఎస్ ముఖ్యమంత్రి అయిన 40రోజుల్లోనే రుణాల రీషెడ్యూలింగ్ చేశారని, వడ్డీ మాఫీ చేయించారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ పథకాలను, వైఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలను మరింత మెరుగ్గా అమలు చేస్తానని చెప్పడం తప్ప... చంద్రబాబు ఏనాడూ తన పాలనను తెస్తానని చెప్పే సాహసం చేయడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నా ప్రతిపక్షనేతగా స్పందించడంలేదని దుయ్యబట్టారు. వైఎస్‌ను, ఆయన కుటుంబాన్ని తిట్టడమే అజెండాగా పనిచేస్తున్నారని విమర్శించారు. బాబు ఎన్ని గిమ్మిక్కులు చేసినా ప్రజలు విశ్వసించడంలేదనీ, అందుకే ఇప్పటికి 50 స్థానాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగితే ఒక్కటీ టీడీపీ గెలవలేకపోగా సగం చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయని ఆమె గుర్తుచేశారు. 

అనిల్‌పై ఆరోపణలు నిరాధారం...
షర్మిల భర్త అనిల్‌కుమార్‌పై చంద్రబాబు, ఆయన వందిమాగధులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని విజయమ్మ ఖండించారు. ఈ విషయాల్లో వాస్తవాలేమిటో తెలుసుకునే అవకాశం ఉన్నా, తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఓ వ్యక్తి ఇలా మాట్లాడ్డం ఏమాత్రం సబబు కాదని చెప్పారు. అందుకే బాబు గ్యాంగ్‌పై క్రిమినల్ కేసుతో కూడిన పరువు నష్టం దావా వేస్తున్నారని వెల్లడించారు.
Share this article :

0 comments: