అధికారం అండతో తొలి అంకం పూర్తి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అధికారం అండతో తొలి అంకం పూర్తి

అధికారం అండతో తొలి అంకం పూర్తి

Written By news on Friday, February 1, 2013 | 2/01/2013

అధికారం అండతో తొలి అంకం పూర్తి
సహకార ఎన్నికల్లో అన్ని రకాల అడ్డదారులు తొక్కిన కాంగ్రెస్
సొసైటీలను హస్తగతం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు
ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా జరుగుతున్న ఎన్నికల తీరుకు నిరసనగా ఎన్నికల్లో పాల్గొనబోమని తేల్చి చెప్పిన వైఎస్సార్ కాంగ్రెస్.. 
స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పలు చోట్ల స్వచ్ఛందంగా పోటీలో నిలుచుని గెలిచిన పార్టీ అభిమాన రైతులు
పార్టీ పరంగా కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు బరిలోకి..

సాక్షి, న్యూస్‌లైన్: రాష్ట్ర వ్యాప్తంగా తొలివిడత సహకార ఎన్నికల ప్రహసనం చెదురుమదురు సంఘటనల మధ్య గురువారం సాయంత్రం ముగిసింది. అధికార కాంగ్రెస్ అన్నిరకాల అడ్డదారులూ తొక్కి సొసైటీలను హస్తగతం చేసుకొనే ప్రయత్నాలు కొనసాగించింది. తమ వర్గీయులకు సభ్యత్వాలు ఇప్పించుకోవటం, ఇతర పార్టీల వారికి సభ్యత్వాలు దక్కకుండా ఇబ్బంది పెట్టటం, కొన్నిచోట్ల దౌర్జన్యంగా సభ్యత్వ పుస్తకాలు ఎత్తుకెళ్లటం వంటి సకల అక్రమాలకూ తెరతీశారు. విజయావకాశాలు లేని సొసైటీలను వాయిదా వేయించారు.

డీసీసీబీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉన్న నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న పీఏసీఎస్‌లను లక్ష్యంగా చేసుకుని వాయిదా తంత్రం రచించారు. తొలి దశలో 80 పీఏసీఎస్‌ల ఎన్నికలు వాయిదా వేయటం ద్వారా ఆయా సంఘాల ప్రతినిధులకు ఎన్నికల్లో పాల్గొనే అవకాశమే లేకుండా చేయగలిగారు. మొత్తంమీద 1,439 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాగా అందులో 80 సంఘాల ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేయగా 397 సంఘాలు ఏక గ్రీవమయ్యాయి. మరో మూడు సంఘాల ఎన్నికలపై కోర్టు స్టే ఇచ్చింది. మిగిలిన 959 సంఘాల్లో దాదాపు 12 వేల డెరైక్టర్ స్థానాలకు 32,794 మంది అభ్యర్ధులు పోటీ పడ్డారు. గురువారం సాయంత్రానికి పోలింగ్ ముగియగా వెనువెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ఎన్ని అడ్డదారులు తొక్కినా అధికార పార్టీ అనుకున్న ఫలితాలు సాధించలేక పోయినట్లు వెల్లడైన ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. 

పాలక కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో పార్టీపరంగానే అభ్యర్ధులను బరిలోకి నిలిపాయి. ప్రజాస్వామిక స్ఫూర్తికి విరుద్ధంగా జరుగుతున్న ఈ ఎన్నికల తీరుకు నిరసనగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఈ ఎన్నికల్లో పాల్గొనేందుకు తిరస్కరించింది. అయితే, పలుచోట్ల పార్టీ అభిమానులైన రైతులు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పోటీలో నిలుచున్నారు. కాగా, మొదటి విడత ఎన్నికలు ముగిసి గురువారం రాత్రి లెక్కింపు పూర్తయ్యే సరికి చాలా సొసైటీల్లో బలాబలాలు వెల్లడయ్యాయి. అయితే, ప్రాదేశిక సభ్యుల ఎన్నిక పార్టీ రహితంగా జరిగినందున సభ్యులు ఎవరికైనా మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సొసైటీలు ఏ పార్టీకి దక్కుతున్నాయో స్పష్టంగా చెప్పడం కష్టం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు... వివిధ జిల్లాల్లో సొసైటీలను దక్కించుకున్న పార్టీల మద్దతుదారుల వివరాలు ఇలా ఉన్నాయి. 

వైఎస్‌ఆర్ జిల్లాలోని 18 సొసైటీలకు ఎన్నికలు నిర్వహించగా 8 సొసైటీలను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మద్దతుదారులు దక్కించుకున్నారు. 6 సొసైటీలను కాంగ్రెస్ మద్దతుదారులు, మూడు సొసైటీల్లో టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు.

అనంతపురం జిల్లాలో 47 సొసైటీలకు ఎన్నికలు జరగ్గా 27 స్థానాల్లో వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. కాంగ్రెస్ మద్దతుదారులు 11,టీడీపీ మద్దతుదారులు 8 దక్కించుకున్నారు. 

చిత్తూరు జిల్లాలో 19 సింగిల్ విండోలకు ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్ మద్దతుదారుడు ఒకటి, టీడీపీ మద్దతుదారులు 6, వైఎస్‌ఆర్ సీపీ మద్దతుదారులు 11 సొసైటీలను సాధించుకున్నారు. 

కర్నూలు జిల్లాలో 59 సొసైటీలకు ఎన్నికలు నిర్వహించగా 29 సొసైటీలు కాంగ్రెస్ మద్దతుదారులకు దక్కాయి. 15 సొసైటీలు వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులకు, ఒకటి టీడీపీ మద్దతుదారుకు, అయిదు ఇండిపెండెంట్లకు దక్కాయి.

నెల్లూరు జిల్లాలో మొత్తం 31 సొసైటీల పరిధిలో 266 ప్రాదేశిక సభ్యత్వాలకు ఎన్నిక నిర్వహించగా 22 సొసైటీల పరిధిలో ఫలితాలు వె ల్లడయ్యాయి. వాటిలో 19 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు, రెండు స్థానాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్, ఒక స్థానంలో టీడీపీ మద్దతుదారుడు గెలుపొందారు. 

వరంగల్ జిల్లాలో 49 సొసైటీల పరిధిలో 637 ప్రాదేశిక సభ్యత్వాలకు ఎన్నిక నిర్విహ ంచగా 43 సొసైటీలకు ఫలితాలు వెల్లడయ్యాయి. వాటిలో కాంగ్రెస్ మద్దతుదారులు 30 సొసైటీలు, టీడీపీ మద్దతుదారులు ఏడు, టీఆర్‌ఎస్ మద్దతుదారులు నాలుగు, వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారుడు ఒకటి, ఇండిపెండెంటు ఒక సొసైటీని దక్కించుకున్నారు. 

ఖమ్మం జిల్లాలో 55 సహకార సంఘాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల కాగా ఎన్నికలకు ముందే ఏడు సొసైటీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 48 సంఘాలకు ఎన్నికలు జరగ్గా ఏకగ్రీవంతో కలిపి 23 సంఘాల్లో టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు. ఏడు సంఘాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు, మరో మూడింటిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. మిగిలిన ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. 

కరీంనగర్ జిల్లాలో తొలివిడత 72 సహకార సంఘాల్లో ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ మద్దతుదారులు 40, టీఆర్‌ఎస్ మద్దతుదారులు 15, టీడీపీ మద్దతుదారులు 4, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మద్దతుదారులు 5, బీజేపీ మద్దతుదారులు ఇద్దరు, సీపీఐ మద్దతుదారుడు ఒకరు, ఇండిపెండెంట్లు నలుగురు గెలుపొందే అవకాశముంది. 
నిజామాబాద్ జిల్లాలో 61 సంఘాలకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్‌కు 33, టీఆర్‌ఎస్‌కు 16,టీడీపీ 10, వైఎస్‌ఆర్‌సీపీ 1, బీజేపీ 1 దక్కించుకున్నాయి.

శ్రీకాకుళం జిల్లాలో 28 సొసైటీలకు ఎన్నిక జరగ్గా 15 సొసైటీలు కాంగ్రెస్, తొమ్మిది వైఎస్‌ఆర్ కాంగ్రెస్, నాలుగు టీడీపీ మద్దతుదారులకు దక్కాయి. 

ప్రకాశం జిల్లాలో 73 సొసైటీలకు గాను 22 ఏకగ్రీవమయ్యాయి. 51 సొసైటీలకు ఎన్నికలు జరిగాయి. ఫలి తాలు వెల్లడి కావాల్సి ఉంది. 

కృష్ణా జిల్లాలో 89 సహకార సంఘాలకు జరిగాయి. ఇందులో 28 సంఘాలు వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులు, 27 కాంగ్రెస్, 25 టీడీపీ మద్దతుదారులకు దక్కాయి. 

విశాఖపట్నం జిల్లాలో 29 సహకార సంఘాలకు 10 సంఘాల్లో వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులు, తొమ్మిది సంఘాల్లో కాంగ్రెస్, ఒక సంఘంలో టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు.
రంగారెడ్డి జిల్లాలో 37 సొసైటీల్లో ఎన్నికలు జరిగాయి. 15 సంఘాల్లో టీడీపీ మద్దతుదారులు, 16 సంఘాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందారు.
Share this article :

0 comments: