ప్రాణాలు పోగొట్టుకోవద్దు.. పొలాలు అమ్ముకోవద్దు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రాణాలు పోగొట్టుకోవద్దు.. పొలాలు అమ్ముకోవద్దు

ప్రాణాలు పోగొట్టుకోవద్దు.. పొలాలు అమ్ముకోవద్దు

Written By news on Thursday, February 28, 2013 | 2/28/2013

ప్రాణాలు పోగొట్టుకోవద్దు.. పొలాలు అమ్ముకోవద్దు
రైతులతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల
జగనన్న ప్రభుత్వం వచ్చేవరకూ ఓపికగా ఉండాలని విన్నపం
రచ్చబండలో సమస్యలు ఏకరువు పెట్టిన రైతులు,మహిళలు,విద్యార్థులు
మాచర్ల నుంచి గురజాల నియోజకవర్గంలోకి మళ్ళీ ప్రవేశించిన పాదయాత్ర

 మీ ప్రాణాలు, పొలాలు విలువైనవి, మీ ప్రాణాలు పోగొట్టుకోవద్దు, మీ పొలాలను అమ్ముకోవద్దు, జగనన్న ప్రభుత్వం త్వరలో వస్తుంది. మీ సమస్యలు తీరతాయి. అంత వరకు ఓపిక పట్టండి... నీళ్ళింకిన కళ్ళతో తమ బాధలు వెళ్లబోసుకుంటున్న రైతులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఇచ్చిన ఓదార్పు ఇది.

మరో ప్రజాప్రస్థానం కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర బుధవారం మాచర్ల నియోజకవర్గం కారంపూడి నుంచి గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ళ మండలం జూలకల్లు, పందిటివారిపాలెం గ్రామాల మీదుగా కొనసాగింది. అడుగడుగునా ప్రజలు షర్మిలకు బ్రహ్మరథం పట్టారు. మరోవైపు తమ సమస్య లను ఏకరువుపెట్టారు.వారి కష్టాలు వింటూ కన్నీళ్లు తుడుస్తూ షర్మిల ముందుకు సాగారు.
అమ్మా! మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు కష్టాలే తెలియలేదు. హాయిగా రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు రోజు గడవడమే కష్టమౌతోంది. కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నాం.. పనులకెళితే రోజుకు రూ.100కు మించి రావడం లేదమ్మా! ఎట్టా బతికేదమ్మా అంటూ జూలకల్లు రచ్చబండలో ఓ మహిళ అవేదన వ్యక్తం చేసింది. నేను పదో తరగతి చదువుతున్నాను. పరీక్షలు దగ్గరకొస్తున్నాయి. రోజుకు మూడు నాలుగు గంటలకు మించి కరెంటు ఉండటం లేదు.

ఎట్లా చదువుకోవాలో అర్థం కావడం లేదక్కా! అంటూ విద్యార్థిని కవిత ఆవేదన వ్యక్తం చేసింది. ఇదేం ప్రభుత్వమమ్మా! పంటలకు అప్పుడప్పుడు నీరు విడుదల చేశారు. దాంతో దిగుబడి రాలేదంటూ ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. మహానేత వల్ల ఎనిమిది కోట్ల రూపాయల రుణాలు రద్దయ్యాయని షర్మిలకు కృతజ్ఞతలు తెలిపాడు. 

పులకించిన వీరులగడ్డ...
షర్మిల రాకతో పల్నాటి వీరులగడ్డ పులకించింది. పల్నాటి యుద్ధానికి వేదికగా నిలిచిన కారంపూడి గడ్డపై అడుగిడిన షర్మిల అమరవీరులను స్మరించుకొని నివాళులర్పించారు. వీరుల గుడిలో ఆనాడు వీరులు వాడిన ఆయుధాలను పరిశీలించారు. తొలుత పాదయాత్ర కారంపూడి నుంచి మొదలై పిడుగురాళ్ళ మండలం పందిటివారిపాలెం వరకు కొనసాగింది. పాదయాత్రలో మహిళలతో కలిసి నడుస్తూ యోగక్షేమాలను తెలుసుకున్నారు.

జూలకల్లు గ్రామ శివారులోని ఎస్సీ కాలనీలో మహిళలు షర్మిలకు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని బందెల దొడ్డిలో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాన్ని, రెడ్ల బజారులో వైఎస్ విగ్రహాన్ని, పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గోపాల స్వామి గుడి వద్ద రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. జగనన్న ప్రభుత్వం రాగానే అన్ని వర్గాల సమస్యలను పరిష్కరిస్తారని షర్మిల హామీ ఇచ్చారు.రచ్చబండ కార్యక్రమం ముగించుకొని షర్మిల పాదయాత్ర గుత్తికొండ అడ్డరోడ్డు వైపుగా సాగింది. 

జూలకల్లు జెడ్పీ హైస్కూల్ వద్ద విద్యార్థులు స్వాగతం పలికారు. పందిటివారిపాలెం అడ్డరోడ్డువద్దకు పాదయాత్ర చేరుకోగానే అక్కడ నిరీక్షిస్తున్న గ్రామస్తులు ఆమెను తమ గ్రామంలోకి ఆహ్వానించారు. వారి ఆత్మీయతకు చలించిన షర్మిల గ్రామంలోకి వెళ్ళి వైఎస్ విగ్రహానికి పూలమాలవేసి అక్కడి నుంచి బస కేంద్రానికి చేరుకున్నారు.

పాదయాత్రలో పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి, కార్యనిర్వాహక మండలి సభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్‌కే), గుంటూరు నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, జిల్లా యువజన విభాగం కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనరు సాయిబాబు, బీసీ సెల్ కన్వీనర్ దేవళ్ళ రేవతి, నాయకులు యెనుముల మురళీధర్‌రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ నన్నపనేని సుధ, బొల్లా బ్రహ్మనాయుడు, నూతలపాటి హనుమయ్య, ఆరిమండ వర ప్రసాదరెడ్డి, చిట్టా విజయభాస్కరరెడ్డి,మేరుగ నాగార్జున, గుత్తికొండ అంజిరెడ్డి, మందపాటి శేషగిరిరావు, కొల్లిపర రాజేంద్రప్రసాద్, అనూఫ్ , చింతా సుబ్బారెడ్డి, ఆల్తాఫ్, షేక్ ముస్తఫా,షౌకత్,ఉయ్యూరు వెంకటరెడ్డి, కాళ్లపల్లి పద్మజారెడ్డి తదితరులున్నారు.

షర్మిలను కలిసిన విజయమ్మ
మహానేత సతీమణి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ బుధవారం జూలకల్లు సమీపంలో షర్మిలను కలిశారు. భోజన విరామం తరువాత షర్మిల పాదయాత్రను కొనసాగించగా, విజయమ్మ అక్కడే ఉండిపోయారు. ఆమెను రాష్ట్ర ప్రోగామ్స్ కమిటీ కన్వీనరు తలశిల రఘురామ్, గుంటూరు కన్వీనర్ అప్పిరెడ్డి , పార్టీ నాయకులు ఎ.శ్రీనివాసరెడ్డి తదితరులు కలిశారు.
Share this article :

0 comments: