పార్టీలో సైనికుడిగా పనిచేస్తా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పార్టీలో సైనికుడిగా పనిచేస్తా

పార్టీలో సైనికుడిగా పనిచేస్తా

Written By news on Tuesday, February 26, 2013 | 2/26/2013

రాజన్న ఆశయాల సాధన కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీలో సైనికుడిగా పనిచేస్తానని,ఖమ్మం జిల్లాలో పదిస్థానాలు గెలిపిస్తానని పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ... రైతులు, విద్యార్థులు, బడుగుబలహీన వర్గాలకోసం అనేకనిరసన దీక్షలుచేసిన జగనన్నకు బాసటగా ఉంటానన్నారు. భర్తను పోగొట్టుకొని, కుట్రలకారణంగా కొడుకు జైలుకు వెళ్లినా పేదలకు అండగా నిలిచి ప్రజల మధ్యే తిరుగుతున్న విజయమ్మను ఆదర్శంగా తీసుకుంటానని, పేదలకు సేవచేయాలనే సంకల్పంతోనే పార్టీలో చేరానని శ్రీనివాసరెడ్డి అన్నారు. తనకు ఉన్న పరిచయాలు, కార్యకర్తల అండదండలు, నాయకుల ప్రోత్సాహంతో జిల్లాలో పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు.

తెలంగాణ జిల్లాలోనే ఖమ్మం జిల్లాను వైఎస్‌ఆర్ జిల్లాగా నిలుపుతామన్నారు. తన పరిచయ సభకు జిల్లా వ్యాప్తంగా వేలాదిమంది తరలి రావడం చూస్తూంటే జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని తెలుస్తోందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీ అత్యధిక స్థానాలు గెలుచుకొని జిల్లాలో బలమైన శక్తిగా రూపుదిద్దుకోబోతోందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ రైతులకోసం , విద్యార్థులకోసం ఫీజు రియింబర్స్‌మెంట్, మహిళలకు వడ్డిలేని రుణాలు ఇచ్చిన మహానుభావుడని... ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు ఒక్కటొక్కటి నేడు పాలకులు దూరం చేస్తున్నారని శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే మళ్లీ సంక్షేమపథకాలు అమలులోకి వస్తాయన్నారు. రాష్ట్ర ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్‌ఆర్‌సీపీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని, దాన్ని ప్రతి కార్యకర్త సద్వినియోగం చేసుకోవాలన్నారు.

వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీలో చేరిన అనంతరం తొలిసారి జిల్లాకు వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సోమవారం ఘనస్వాగతం లభించింది. జిల్లా సరిహద్దు నాయకన్‌గూడెంకు చేరుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శ్రీనివాసరెడ్డికి స్వాగతం పలికి ర్యాలీగా ఖమ్మం తోడ్కొని వచ్చారు. గిరిజన నృత్యాలు, డప్పు వాయిద్యాలు, మహిళల మంగళహారతుల నడుమ ర్యాలీ అట్టహాసంగా సాగగా విద్యార్థివిభాగం ద్విచక్రవాహనాలతో అనుసరించింది.

పార్టీ జిల్లా కన్వీనర్ అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలి వెళ్లిన నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఓపెన్‌టాప్ వాహనంలో బయలుదేరిన నాయకులు మధ్యలో నాయకన్ గూడెం ఎస్సీ, బీసీ కాలనీలలో వైఎస్‌ఆర్ విగ్రహాలకు పూల మాలవేసి నివాళి అర్పించారు. నాయకన్‌గూడెంలో అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు పూల మాలలు వేశారు. పాలేరులో పార్టీ జెండా ఆవి ష్కరించారు. ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు, ఖమ్మం కాల్వొడ్డులలో అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తు బాణసంచా కాలుస్తూ కేరింతలుతో శ్రీనివాసరెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. కాల్వొడ్డు నుం చి మయూరిసెంటర్, బస్టాండ్, వైరా రోడ్డు, జడ్‌పిసెంటర్, ఇల్లెందు క్రాస్‌రోడ్డు మీదుగా పార్టీ కార్యాలయానికి ర్యాలీ చేరుకుంది.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం రాష్ట్రంలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ వారసుడిగా జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి ఎదురు చూస్తున్నారని, రానున్నది రాజన్న రాజ్యమేనని, అందుకు పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. వైఎస్‌ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో ఇటీవల హైదరాబాద్‌లో పార్టీలో చేరిన ప్రముఖపారిశ్రామికవేత్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సోమవారం జిల్లాకు వచ్చిన సందర్భంగా వారికి జిల్లా సరిహద్దులో ఘనస్వాగతం లభించింది. భారీ ర్యాలీగా వారు ఖమ్మం చేరుకున్న అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నాయకులు మాట్లాడారు. 

పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు పెట్టిన ఇబ్బందులకు ప్రతి ఫలం గా 2004లో ప్రజలు బుద్ధిచెప్పారని అన్నారు. ఓటమి భయంతోనే స్థానిక ఎన్నికలు జరపకుండా ప్రభుత్వం వెనుకాడుతోందని అన్నారు. దీంతో స్థానిక పాలన అస్తవ్యస్తంగా మారిం దని, కేంద్రం నుంచి వచ్చే 4వేలకోట్ల నిధులు ఆగిపోయాయని అన్నారు. పార్టీ కార్మిక విభా గం రాష్ట్ర కన్వీనర్ జనక్‌ప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అవినీతి బయటపడుతుందనే భయంతోనే కాంగ్రెస్‌కు మద్దతు పలుకుతున్నారని అన్నారు. ఎఫ్‌డీఐకి అనుకూలంగా ప్రవేశపెట్టిన బిల్లుకు టీడీపీ ఎంపీలు మద్దతు ప్రకటించడం ఇందుకు నిదర్శనం అన్నారు. ఐదు జిల్లాల కో-ఆర్డినేటర్ జిట్టా బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో కుప్పకూలడం ఖాయమన్నారు.

కలిసికట్టుగా శ్రమిద్దాం.. విజయం సాధిద్దాం పువ్వాడ అజయ్‌కుమార్, పార్టీ జిల్లా కన్వీనర్: జిల్లాలో రోజురోజుకు వైఎస్సార్ సీపీ బలం పెరుగుతోంది... ప్రజాదరణ గల నేతలు పార్టీలో చేరుతున్నారు... అందరం కలిసికట్టుగా శ్రమించి వచ్చే ఎన్నికల్లో పార్టీని ముందంజలో నిలుపుదామని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా క న్వీనర్ అజయ్‌కుమార్ అన్నారు. పార్టీకి ముందు మంచిరోజులు ఉన్నాయని అన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 11వేల శాశ్వత సభ్యత్వాలు చేర్పించి ఇతర పార్టీలకు దీటుగా వైఎస్సార్‌సీపీని నిలిపామన్నారు. 

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికల్లో 10 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకోవాలన్నారు. చిన్న వయస్సులోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిద్రపట్టకుండా చేస్తున్న యువనేత జగన్‌మోహన్‌రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని, అలుపెరుగని కృషి చేసి జగన్‌ను సీఎంగా చూడాలని అన్నారు. 

వైఎస్సార్‌సీపీలో పనిచేసినందుకు గర్వపడాలి బాణోత్‌మదన్‌లాల్, సీఈసీ సభ్యులు
పేదల ముఖంలో వెలుగులు చూడాలనే తపనతో సంక్షేమ పథకాలు అందించిన మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయ సాధనకోసం స్థాపించిన పార్టీలో పనిచేసినందుకు అందరం గర్వపడాలని పార్టీ సీఈసీ సభ్యులు బాణోత్ మదన్‌లాల్ అన్నారు. స్థాపించిన కొద్దిరోజుల్లోనే బలమైన రాజకీయపార్టీగా అవతరించిందన్నారు. పార్టీ ప్రభంజనాన్ని చూసి ఓర్వలేక కేసులు పెట్టి కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు వైఎస్సార్‌సీపీ వెంటే ఉన్నారని, తగిన సమయంలో నిర్ణయం తీసుకొని కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధిచెబుతారని అన్నారు. 

అన్నిస్థానాలు కైవసం చేసుకుంటాం
చందాలింగయ్యదొర, సీజీసీ సభ్యులు
తండ్రికిచ్చిన మాట ప్రకారం ప్రజల్లోకి వె ళ్లి ప్రజల ఆదరణ పొందుతున్న జగన్‌మోహన్‌రెడ్డిని చూసి ఓర్వలేకనే జైలులో పెట్టారని పార్టీ సీజీసీ సభ్యులు చందాలింగయ్యదొర అన్నారు. యువనేత జైలు నుంచి విడుదలైతే ప్రజలను మరింత చైతన్య పరుస్తారని భావించే బెయిల్ రాకుండా చేస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అన్ని స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయమన్నారు.

జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంను చేసేవరకు విశ్రమించవద్దు యడవెల్లి కృష్ణ, సీఈసీ సభ్యులు
ప్రజాసంక్షేమాన్ని కోరుకునే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంగా చూసేవరకు విశ్రమించకుండా పనిచేయాలని పార్టీ సీఈసీ సభ్యులు యడవెల్లి కృష్ణ పిలుపునిచ్చారు. వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలంటే జగన్ సీఎం కావడం అవసరం అన్నారు. పార్టీ జెండాలతో సంబంధం లేని సహకార ఎన్నికల్లో విజయం సాధించామని గర్వపడుతున్న కాంగ్రెస్‌కు, దానికి కొమ్ముకాసిన టీడీపీకి బుద్ధి చెప్పేరోజు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. 

పార్టీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ బాణోత్ పద్మావతి మాట్లాడుతూ కూతురు లాంటి షర్మిలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న విమర్శలు నీతిమాలినవని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ బీసీసెల్ కన్వీనర్ తొటరామారావు, ఎస్టీసెల్ కన్వీనర్ దళ్‌సింగ్, మైనార్టీసెల్ క న్వీనర్ అక్రమ్, సేవాదళ్ క న్వీనర్ రాంప్రసాద్, విధ్యార్థి విభాగం క న్వీనర్ మహేశ్వర్‌రెడ్డి, ఎస్సీ విభాగం క న్వీనర్ మెండెం జయరాజ్, శీలం వెంకట్‌రెడ్డి, లీగల్‌సెల్ కన్వీనర్ పాపారావు, అధికార ప్రతినిధులు నిరంజన్‌రెడ్డి, భరత్‌చంద్ర, నాయకులు మచ్చా శ్రీనివాసరావు, నంబూరి రామలింగేశ్వరరావు, కీసర వెంకటేశ్వర్‌రెడ్డి, దయానంద్, దేవబత్తిని కిషోర్, ఖమ్మం పట్టణ కన్వీనర్ ఎస్‌ఏఎస్ అయూబ్, శ్రీలక్ష్మీ, శారద, వీరభద్రం, జమలాపురం రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: