నా కోరిక బాబు గారు తీరుస్తారా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నా కోరిక బాబు గారు తీరుస్తారా?

నా కోరిక బాబు గారు తీరుస్తారా?

Written By news on Friday, February 8, 2013 | 2/08/2013


బాబు గారు రైతుల కోసం నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించినప్పుడు ,TV9 వారధి ప్రోగ్రాం లో TDP MLC
రాజేంద్ర ప్రసాద్ "మా బాబు గారికి షుగర్ వ్యాధి ఉంది, కాబట్టి ప్రభుత్వం అయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దీక్ష కు కూర్చొన్న వెంటనే అయన డిమాండ్లు పరిష్కరించి దీక్ష విరమింప చేయాలి   అని అన్నారు.
బాబు గారు ఆతరువాత 2 ,3 రోజులకు అనుకొంటా దీక్ష కు కూర్చున్నారు.మంచిది రైతుల కోసము బాబు గారు దీక్ష చెయ్యడం మనమంతా అభినందించవలసిందే.
అసలు డ్రామా ఇక్కడే మొదలయ్యింది. 
దీక్ష మొదలైన రెండు రోజులకి బాబు గారి షుగర్ లేవేల్సు తగ్గి 71 కి వచ్చింది.సరే ఆ తరువాత   ఇంకో   రెండు మూడు రోజులకు బాబు గారిని  నిమ్స్ కు తరలించారు ఆరోగ్య మంత్రి డీ ఎల్  రవీంద్ర రెడ్డి గారి అద్వర్యంలో . దీక్ష మొదలైన  8 వ రోజున బాబు గారిని పరీక్ష చేసి డాక్టర్లు అయన షుగర్ రీడింగు 91 అని చెప్పారు.ఇదొక విచిత్రం అంటారు డాక్టర్లు.
వైద్య శాస్త్రం ప్రకారం షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళకు ఆహారము తీసుకోక పొతే షుగర్  లేవేల్సు దారుణంగా పడిపోతాయి. ఆరోగ్యవంతుడి కి కూడా 8  రోజుల  నిరాహారదీక్ష తరువాత సుగ లెవెల్ 91 ఉండే అవకాసం లేదు అంటారు డాక్టర్లు. మరి  బాబు గారికి నిమ్స్ లో ఏమి ఇచ్చారు అనేది పాఠకులకు వదిలి పెడదాము. సరే ఈ షుగర్లెవెల్ తగ్గడానికి బదులు పెరగడాన్ని సాక్షి టీవీ చర్చ పెట్టి దానికి డాక్టర్లు ని పిలిచింది. దానికి వాళ్ళంతా ఇది సాధ్యం కాదు. షుగర్ లెవెల్ పడిపోతాయి కానీ మన బాబు గారికి పెరిగాయి, ఇదో విచిత్రం అన్నారు.
దానికి సమధానంగా TDP  నాయకుడు కడియం శ్రీహరి , మా బాబు గారికి షుగర్ లేదు , సాక్షి అబద్దాన్ని ప్రచారం చేస్తుంది అని కేకలు వేసారు.
ఆ తరువాత రెండు రోజులకు సిపిఐ జాతీయ నాయకుడు AB Bardhan గారు మీడియా తో మాట్లాడుతూ బాబు గారికి షుగర్ వ్యాధి ఎప్పటినుంచో ఉంది,అనేక సార్లు మా ఇంట్లో భోజనం చేసారు కదా నాకు తెలిసు అని చెప్పారు.
ఇది అంత ఎందుకు  చెబుతున్నానంటే  బాబు గారికి షుగర్ వ్యాధి ఉండడం తప్ప్పు కాదు కానీ దాన్ని దాచిబెట్టి సాక్షి పై ఎదురుదాడి దిగడం అత్యంత హేయము.
బాబు గారు ఎప్పుడు నేను చాల రోగ్య నియమాలు పాటిశ్తాను అనేవారు అయన ముక్య మంత్రి గ ఉన్నపుడు, నేను కేవలము  ౩ ఇడ్లి, 2 పుల్కాలు, కొద్దిగా పండ్లు తింటాను, అంత సింపుల్ లైఫ్ నాది అని  ప్రచారం చేసుకొనే వాళ్ళు.మా లాంటి వాళ్ళు ఆహా, మన బాబు గారు ఎంత సింపులో అనుకునే  వాళ్ళము. సుగరు ఉన్న వాళ్ళు ఎవరైనా తినేది ఇదే కానీ మన బాబు గారు తనకున్న జబ్బు ను దాచిబెట్టి , తను ఎంత మితాహారం తీసుకొంతాదో చెబుతూ ,దాన్ని కూడా ప్రచారం కు ఉపయోగించడం ఆయనకే చెల్లింది.
బాబు గారు ఎప్పుడైనా నిజం మాట్లాడితే వినాలని ఉంది.నా కోరిక బాబు గారు తీరుస్తారా, వేచి చూద్దాము  అంతే
కదా!


Courtesy: CVReddy



Share this article :

0 comments: