వైఎస్ మరణంతో ఆగిన సంక్షేమ పథకాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ మరణంతో ఆగిన సంక్షేమ పథకాలు

వైఎస్ మరణంతో ఆగిన సంక్షేమ పథకాలు

Written By news on Monday, February 11, 2013 | 2/11/2013

దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంతో సంక్షేమ పథకాలు ఆగిపోయాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకురాలు షర్మిల అన్నారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నల్గొండ జిల్లా చండూరు గ్రామం చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే ఆగిపోయాయన్నారు. ఆయన బతికి ఉంటే ఎస్ ఎల్ బిసి సొరంగ పథకం పూర్తి అయ్యేదన్నారు. 2004 నుంచి 2009 వరకు ఆర్టీసీ బస్ చార్జీలు పెరగలేదు. గ్యాస్ ధర పెరగలేదు. విద్యుత్ చార్జీలు పెరగలేదని గుర్తు చేశారు. వైఎస్ హయాంలో 47 లక్షల ఇళ్లు కట్టించారు. ఈ ప్రభుత్వం ఎన్ని ఇళ్లు కట్టించిందో చెప్పాలని ఆమె అడిగారు. ప్రజల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. నిరుపేదలను పట్టించుకునే నాధుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎడాపెడా పన్నులు బాధేస్తుందన్నారు. ఏ ప్రాంతంలో చూసినా ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని చెప్పారు. ఈ ప్రభుత్వంపై మంత్రులకే నమ్మకంలేదన్నారు. 

గీత కార్మికుడు చెట్టుపై నుంచి పడి మరణిస్తే లక్ష రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది రాజశేఖర రెడ్డి గారేనని గుర్తు చేశారు. తెల్ల బంగారం అనే పత్తిని పండించే రైతు పరిస్థితి ఇప్పుడు దుర్భరంగా ఉందని చెప్పారు. ఆ బంగారం లాంటి పత్తే ఇప్పుడు రైతు ఉసురు తీస్తోందన్నారు.

వైఎస్ఆర్ 450 ఫ్లోరైడ్ గ్రామాలకు 375 కోట్ల రూపాయలతో కృష్ణా జలాలు అందించారు. ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్లినా మహిళలు గుప్పెడు మంచినీళ్ల కోసం ప్రాధేయపడుతున్నారని షర్మిల చెప్పారు. తాగడానికి ప్రజలకు నీరు కూడా ఇవ్వలేని ఘనత ఈ రాక్షస ప్రభుత్వానిదన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడినందుకే జగనన్నను జైలుకు పంపారన్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అవినీతిపై ఎన్ని ఆరోపణలు వచ్చినా విచారణ చేపట్టరన్నారు. ప్రభుత్వం చీప్ విప్ గండ్ర వెంకట రమణా రెడ్డి సవాల్ ను స్వీకరిస్తున్నాని, ప్రజల్లో తేల్చుకుందాం రమ్మన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సంస్కారం లేదన్నారు. తన ఇంట్లో గదుల సంఖ్య ఏమైనా జాతీయ సమస్యా? అని షర్మిల ప్రశ్నించారు.
Share this article :

0 comments: