చెరగని చిరునవ్వే వేధింపులకు సమాధానం! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చెరగని చిరునవ్వే వేధింపులకు సమాధానం!

చెరగని చిరునవ్వే వేధింపులకు సమాధానం!

Written By news on Wednesday, February 6, 2013 | 2/06/2013

మానవ దౌర్బల్యాలలో అహం మహా చెడ్డది. పగ, ద్వేషం, ప్రతీకారం వంటి వాటిని ప్రేరేపిస్తుంది. చివరికి ఎవరి పతనానికి వారే కారణమయ్యేలా చేస్తుంది. నిజానికి దుర్యోధనుడు రాజనీతి కలవాడు. కానీ, ద్రౌపది నవ్వినందుకు తన అహం దెబ్బతింది. ఫలితమే... కురుక్షేత మహాసంగ్రామం. శ్రీకృష్ణుడు పారిజాత పుష్పాన్ని రుక్మిణికి ఇవ్వడంతో సత్యభామ అహం దెబ్బతింది. తత్ఫలితం కృష్ణుడికీ ఇంద్రుడికీ యుద్ధం. ఇలా అహంతో చేసిన పనులు యుద్ధాలకు, ప్రాణనష్టానికి, పరిపాలన పతనాలకు దారి తీసాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ కలియుగంలోనూ అహంతో మనుషులు పతనమవుతున్నారు. 

అధికారం ఉంది కదా అని సోనియాగాంధీ అహంతో వైయస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబాన్ని వేధింపులకు గురిచేసి, జగన్‌ని జైలు పాలు చేశారు. ఫలితంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ పతనం అంచున ఊగిసలాడుతోంది. కాంగ్రెస్ పార్టీకి ఈ దీనపరిస్థితి రావడానికి నాయకులు ఎవరికి వారు తమ వంతు ‘సహాయం’ చేసుకున్నారు. ప్రజాదరణ కలిగిన ఏకైక నాయకుడు జగన్‌ని కూడా దూరం చేసుకున్నారు. విలువలకు, విశ్వనీయతకు కట్టుబడి; రాష్ట్ర ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం ఎండనక వాననక ఓదార్పు యాత్ర చేసిన జగన్‌ను అక్రమంగా జైల్లో పెట్టిన విధానాన్ని రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్నది సత్యం. 

అయినా... ప్రజలు మౌనంగా ఉన్నారంటే... జగన్ జైల్లో ఉన్నా మోములో చెదరని చిరునవ్వే కారణం కావచ్చు. తండ్రి ఆశయాలను నెరవేర్చాలన్న పట్టుదలతో ప్రతి పేద వాడి గుండె చప్పుడు విన్న జగన్‌ని ఏ కుట్రలూ అడ్డుకోలేవు. మబ్బులు కమ్ముకున్నంత మాత్రాన సూర్యుడి కాంతి తగ్గుతుందనుకోవడం పొరపాటు, అవివేకం. అది తెలిసి కూడా జగన్‌ని ఒంటరిని చేయాలని తలపండిన రాజకీయ నాయకులు సైతం తనమునకలవుతున్నారు. జగన్ ఒంటరివాడు కాదని బహుశా ఇప్పటికే రాజకీయ దురంధరులందరికీ అర్థమైపోయి ఉండాలి. 

అందుకు నిలువెత్తు సాక్ష్యం షర్మిలగారు తలపెట్టిన పాదయాత్రే. తండ్రి ఆశయాల కోసం, అన్న జగన్ చెప్పిన మాటలు శిరోధార్యంగా సాగిస్తున్న ఆ యాత్రలో ఆమె వెంట ప్రజలు వెల్లువెత్తారు. 
- పి. శ్రీవాణి, రామవరప్పాడు, కృష్ణాజిల్లా


గుణపాఠం చెప్పే రోజు ఎంతో దూరంలో లేదు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు; రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం, ఎల్లోమీడియా... ఈ దుష్టచతుష్టయం కాంగ్రెసు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ను పావుగా వాడుకొని పన్నిన కుట్రలను కుతంత్రాలను జననేత జగన్మోహన్‌రెడ్డి తన అసమాన ధైర్య సాహసాలతో త్వరలోనే చేధించి సదరు దుష్టచతుష్టయానికి తగిన గుణపాఠం చెప్పేరోజు ఎంతో దూరం లేదు. 

జగన్‌పై వారు చేస్తున్న ఆరోపణలను, వారి వల్ల ఆయనకు జరుగుతున్న అన్యాయాన్ని విజ్ఞత కలిగిన తెలుగు ప్రజానీకం మౌనంగా గమనిస్తూ ఉంది. కట్టలు తెంచుకొనే ఆవేశాన్ని బడబాగ్నిలా గుండెల్లో దాచుకుని తదుపరి ఎన్నికల కోసం ఎదురుచూస్తోంది. ఓటు అనే తిరుగులేని ఆయుధంతో కనీవినీ ఎరుగని సునామీని సృష్టించి జననేత జగన్‌కు చరిత్రపుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించే అఖండ విజయాన్ని అందించి కాంగ్రెసును, కాంగ్రెసుతో అంట కాగుతున్న తెలుగుదేశం పార్టీని నామ రూపాలు లేకుండా చేయడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారు. జననేత జగన్ తన మీద బనాయించిన పసలేని కేసుల నుండి కడిగిన ముత్యంలా బయటకు వస్తారనడంలో ఎటువంటి సందేహమూ లేదు.
- వజ్రాల అంజిరెడ్డి, అద్దంకి, ప్రకాశం జిల్లా
Share this article :

0 comments: