విజయమ్మను కలిసిన గల్ఫ్ బాధితులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విజయమ్మను కలిసిన గల్ఫ్ బాధితులు

విజయమ్మను కలిసిన గల్ఫ్ బాధితులు

Written By news on Wednesday, February 13, 2013 | 2/13/2013

విమానాశ్రయం నుంచి నేరుగా పాదయాత్రకు

సాక్షి, హైదరాబాద్: గల్ఫ్‌లో అనధికారికంగా నివసిస్తున్న భారతీయులకు అక్కడి ప్రభుత్వం క్షమాభిక్ష కింద స్వదేశం వెళ్లేందుకు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పది మంది తెలుగువారు మంగళవారం దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు ఇక్కడకు వచ్చిన వీరంతా, తాము స్వదేశం రావడానికి సహాయం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు కృతజ్ఞతలు తెలపాలని భావించారు. దీంతో వారందరూ నల్లగొండలో షర్మిల పాదయాత్ర చేస్తున్న గ్రామానికి చేరుకున్నారు. 

నల్లగొండ జిల్లా కనగల్ గ్రామంవద్ద విజయమ్మ, షర్మిలను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బాధితులు హైదరాబాద్ చేరుకునేందుకు అయిన విమాన, ఇతరత్రా ఖర్చులను వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నాైరె ల (ప్రవాస భారతీయుల) విభాగం ఏర్పాటు చేసింది. తొలివిడతగా 26 మంది, ప్రస్తుతం పది మంది స్వదేశానికి వచ్చారని ఎన్నారై విభాగం కన్వీనర్ మేడపాటి వెంకట్ తెలిపారు. వీరికి వెంకట్‌తో పాటు మైగ్రెంట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు భీమ్‌రెడ్డి శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. స్వదేశానికి చేరుకున్న వారిలో వై.నరసయ్య, వీరన్న రాంబాయి (నిజామాబాద్), జి.రాములు (కరీంనగర్) పాప జుత్తిక, ఓగూరి మంగతాయారు, సీహెచ్ రామలక్ష్మి, మల్లికార్జున రాజు, శామ్యూల్(తూర్పు గోదావరి), చంద్రకాంతం, ఎ.కుమారి(పశ్చిమగోదావరి) ఉన్నారు. 

స్వచ్ఛందంగా ముందుకొచ్చింది వీరే: అమెరికాలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు సుబ్బారెడ్డి చింతకుంట, రమేష్ వల్లూరు, డాక్టర్ వాసుదేవరెడ్డి, ధనుంజయ్ ఘట్టం, గురవారెడ్డి పుణ్యాల, రాజశేఖర్ కసిరెడ్డి, సుబ్బారెడ్డి పమ్మి, ఇంద్రసేన్ గంగసాని, రామకృష్ణ అగ్తు, రవి బల్లాడ, దయాకర్‌రెడ్డి, రఘు పాడి, పవన్ నరంరెడ్డి, మల్లికార్జున్ ఘట్టంనేని, దేవనాథ్ గోపిరెడ్డిలు గల్ఫ్ బాధితులు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు అయిన ఖర్చులను స్వచ్ఛందంగా భరించారని వెంకట్ చెప్పారు. వివిధ దేశాల్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు మానవతా దృక్పథంతో అంతా ఒకే కుటుంబంగా భావించి ఈ సాయం చేశారని మేడపాటి వెంకట్ ‘సాక్షి’కి తెలిపారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను గల్ఫ్ బాధితులు కలిసిన సందర్భంలో పార్టీ నేతలు కె.కె.మహేందర్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డిలు ఉన్నారు. 
Share this article :

0 comments: