జగన్‌ను కలిసిన అనకాపల్లి ఎంపీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌ను కలిసిన అనకాపల్లి ఎంపీ

జగన్‌ను కలిసిన అనకాపల్లి ఎంపీ

Written By news on Friday, February 1, 2013 | 2/01/2013


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అంశంపై తేల్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి పేర్కొన్నారు. చంచల్‌గూడ జైలులో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన గురువారం ప్రత్యేక ములాఖత్‌లో కలిశారు. అనంతరం సబ్బం హరి విలేకరులతో మాట్లాడుతూ.. జగన్‌ను జైల్లోనే ఉంచేందుకు ప్రభుత్వం, సీబీఐ కలిసి నాటకాలాడుతున్నాయని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రంపై కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్‌లు తలోమాట మాట్లాడుతున్నాయని విమర్శించారు. అసలు ఆ మూడు పార్టీలు అయోమయంలో ఉన్నాయా లేక ప్రజలను అయోమయ స్థితిలో పడేయటానికి అలా వ్యవహరిస్తున్నాయా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీయే స్పష్టత ఇవ్వాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ జాతీయ నాయకులు ఆజాద్, వయలార్ రవి, పీసీ చాకో, సుశీల్‌కుమార్ షిండేలు భిన్నమైన ప్రకటనలు చేయటాన్ని బట్టి చూస్తే తెలంగాణపై వారు కూడా అయోమయంగా మాట్లాడుతున్నట్లు అర్థం చేసుకోవాలన్నారు. అశేష ప్రజాదరణ ఉన్న జగన్‌ను ఒక ప్రాంతానికే పరిమితం చేసేందుకు విభజనపై కాంగ్రెస్ తీవ్రంగా దృష్టి సారించిందంటూ వస్తున్న వార్తలను ప్రస్తావించగా.. కేవలం పార్లమెంటు సీట్ల కోసం రాష్ట్రాన్ని విడదీస్తారంటే అంతకంటే అరిష్టం లేదన్నారు.
Share this article :

0 comments: