ఈడీ అటాచ్‌మెంట్ ఉత్తర్వులపై ఎల్లో మీడియా హడావుడి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈడీ అటాచ్‌మెంట్ ఉత్తర్వులపై ఎల్లో మీడియా హడావుడి

ఈడీ అటాచ్‌మెంట్ ఉత్తర్వులపై ఎల్లో మీడియా హడావుడి

Written By news on Saturday, February 23, 2013 | 2/23/2013

* ఈడీ అటాచ్‌మెంట్ ఉత్తర్వులపై ఎల్లో మీడియా హడావుడి
* స్వయంగా వాదనలు విన్నట్లు రాసేసిన రామోజీ 
* విచారణ మొదలు కాకున్నా... నేరం రుజువైందంటూ రాతలు
* తన షేరు విలువపై ఎన్నడూ నిజాలు చెప్పని ‘ఈనాడు’
* అసలు 100 రూపాయల షేరు 5.28 లక్షలకు అమ్మటమే రికార్డు
* వేరెక్కడా దొరకనట్టు ఎగబడి మరీ కొనేసిన రిలయన్స్
* అక్రమ బంధం కళ్లకు కడుతున్నా గురివింద రీతిలో రాతలు
* జడ్చర్లలో పరిశ్రమల కోసం బాబు హయాంలోనే 950 ఎకరాల భూ సేకరణ
* 2006 వరకూ మూడేళ్లపాటు ఏ పరిశ్రమా ముందుకు రాని తీరు
* 250 ఎకరాల్ని సెజ్‌గా మార్చేందుకు ఏపీఐఐసీ ప్రతిపాదన; కేంద్రం ఓకే
* హెటెరో, అరబిందో దరఖాస్తు చేయటంతో తలా 75 ఎకరాల కేటాయింపు
* ధరల కమిటీ నిర్ణయించిన ధరకన్నా తక్కువకు విక్రయించారట 
* కమిటీ నిర్ణయించింది విక్రయ ధర; ఏపీఐఐసీ కేటాయించింది లీజుకు
* లీజు మొత్తాన్ని ఒకేసారి చెల్లించిన కంపెనీలు; డెవలప్‌మెంట్ ఖర్చూ వాటిదే
* అసలు ముఖ్యమంత్రి టేబుల్ వద్దకు కూడా రాని ఫైళ్లు
* అయినా అన్నీ ఆయనకే అంటగడుతూ... జగన్‌ను ఇరికించే ఎత్తుగడలు
* ఇలాంటి ఆరోపణలతోనే తొలి చార్జిషీట్... దాని ఆధారంగానే అటాచ్‌మెంట్
* ‘సాక్షి’ మీడియా లక్ష్యంగా నగదు డిపాజిట్ల అటాచ్‌మెంట్
* ఆర్థిక మూలాలను దెబ్బతీయటం ద్వారా సాక్షి గొంతు నొక్కే కుట్ర 

వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిని విచారించకుండానే... తక్షణం శిక్ష విధించేయాలని ఈ రాష్ట్రంలో ఓ వర్గం బలంగా కోరుకుంటోంది. 

నాణేనికి రెండో కోణాన్ని చూపిస్తున్న ‘సాక్షి’ పత్రికను, చానెల్‌ను మూయించి తీరాలని కూడా ఆ వర్గం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. 

జనాభిమానాన్ని నిరూపించుకున్న వైఎస్సార్ కాంగ్రెస్‌ను వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేయకుండానే చిదిమేయాలని భావిస్తోంది. 

ఇవన్నీ ఏ రకంగానైనా జరిగిపోవాలని తన వంతు కుట్రలు చేస్తోంది ఆ వర్గం. అందుకే దానికి ఎల్లో ముద్ర పడింది. ఆ సిండికేట్ కుట్రలు లోతుకెళుతున్నట్టే... దానిపై ముద్ర కూడా పెద్దదవుతోంది. వారం రోజుల కిందట ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన ఉత్తర్వులపై గురువారంనాడు ఒక వర్గం మీడియా చేసిన హడావుడి చూసినా... నేరం రుజువయింది అంటూ రామోజీరావు విషపుత్రిక ‘ఈనాడు’ కక్కిన కథనం చూసినా ఈ ఎల్లో కుట్ర ఎంత లోతైనదో తెలుస్తుంది. ఇక శుక్రవారంనాడు రామోజీ పనిగట్టుకుని ‘ఈడీ న్యాయాధికార సంస్థ’ ఆశ్చర్యపోయిందంటూ విచారణ తానే స్వయంగా చూసినట్టుగా రాసిన కథనం... ఎల్లో సిండికేట్ దిగజారుడు తనాన్ని, చౌకబారు ఎత్తుగడల్ని ఎత్తిచూపనే చూపిస్తోంది.
పీకల్లోతు నష్టాల్లో ఉన్న తన కంపెనీ ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్‌లో రూ. 100 విలువైన ఒక్కో షేరును రూ.5,28,630 చొప్పున అమ్మేశారు రామోజీ. ప్రపంచంలో ఇంకెక్కడా షేర్లే దొరకనట్టు గొట్టాం కంపెనీల్ని సృష్టించి మరీ... 2,600 కోట్లు పెట్టి ఎగబడి కొనేసింది రిలయన్స్ ఇండస్ట్రీస్. వాటాదారులకు చెప్పకుండా వాళ్ల డబ్బును మళ్లించి, స్టాక్ ఎక్స్ఛేంజీలకు చెప్పకుండా మాయదారి మార్గంలో జరిగిన ఈ కొనుగోలును చూసి నవ్విపోనిదెవరు? సిగ్గు పడాల్సినదెవరు? శకునం చెప్పే బల్లి కుడితిలో పడినట్టు... అందరికీ నీతులు చెప్పే రామోజీ తాను చేసిందేమిటి? ఏం! నీతి నియమాలేవీ ఈ నేతి బీరకాయకు వర్తించవా? 

నేరం రుజువయినట్టా?
వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు, తెలుగుదేశం నేతలు వేసిన కేసులో హైకోర్టు ఆదేశంతో సీబీఐ దర్యాప్తు జరుగుతోంది. అది ఇప్పటికే నాలుగు చార్జిషీట్లు దాఖలు చేసింది. అవే చార్జిషీట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా తన చార్జిషీట్లుగా దాఖలు చేస్తూ వస్తోంది. ఈ చార్జిషీట్ల మేరకు కొన్ని ఆస్తులు ఇప్పటికే సీబీఐ అటాచ్‌మెంట్‌లో ఉన్నాయి. చార్జిషీట్ల వారీగా ఈడీ కూడా అటాచ్‌మెంట్ ఉత్తర్వులను జారీ చేస్తోంది. ఈడీ అటాచ్‌మెంట్ ఉత్తర్వులు కరెక్టా? కాదా? అనే అంశంపై ఈడీ కోర్టులో విచారణ జరిగింది. ఈడీ కోర్టు ఈడీకి అనుకూలంగా ఉత్తర్వులిచ్చింది. 

ఇదీ... జరిగిన కథ. 
దీనర్థం నేరం రుజువయినట్టా? అసలు విచారణ జరిగిందా? వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిపై విచారణ ఇంకా మొదలైనా కాలేదే? ఆయన ప్రస్తుతం విచారణలో ఉన్న ఖైదీ కూడా కాదు. కేవలం రిమాండ్‌లో ఉన్నారు. రిమాండ్‌లో ఉంచగలిగేది కూడా 14 రోజులే. అందుకే ప్రతి 14 రోజులకోసారి రిమాండ్‌ను పొడిగిస్తూ వస్తున్నారు. గత తొమ్మిది నెలలుగా ఇదే తంతు కొనసాగిస్తున్నారు. ఇదంతా రామోజీకి తెలియదా? మరి ‘నేరం రుజువు’ అంటూ రాయటాన్ని ఏమనుకోవాలి? రామోజీ తన కోరికను, జగన్‌మోహన్‌రెడ్డిపై అక్కసును ఇంత నిర్లజ్జగా బయటపెట్టుకోవటాన్ని ఏమనాలి? రామోజీ మోసం చేస్తున్నదెవరిని? తన పాఠకుల్ని కాదా? పాఠకులంటే అంత లోకువా? 

ఈడీ ఆరోపణలివీ...
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని ప్రత్యేక ఆర్థిక మండలిలో (సెజ్) హెటెరో డ్రగ్స్, అరబిందో ఫార్మాలకు తలా 75 ఎకరాల్ని వై.ఎస్.రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏపీఐఐసీ కేటాయించింది. కమిటీ నిర్ణయించిన ధర కన్నా తక్కువ ధరకు ఈ భూమిని కేటాయించటం ద్వారా ఈ రెండు సంస్థలకూ తలా 8.6 కోట్ల చొప్పున మొత్తం 17.2 కోట్ల లబ్ధి కలిగిందని ఈడీ పేర్కొంది. 

* మెదక్ జిల్లా పాశమైలారంలోని ఎక్స్‌పోర్ట్స్ ప్రమోషన్ ఇండస్ట్రియల్ పార్క్ లో (ఈపీఐపీ) అరబిందో ఫార్మాకు ప్రభుత్వం భూమి కేటాయించింది. అది ఆ భూమిని తన అనుబంధ సంస్థ ట్రైడెంట్ లైఫ్ సెన్సైస్‌కు బదలాయించింది. ఇలాకాక ట్రైడెంట్ నేరుగా ప్రభుత్వం నుంచి కొని ఉంటే ప్రభుత్వానికి రూ.4.3 కోట్ల మేర లాభం వచ్చేదనేది ఈడీ చేసిన మరో ఆరోపణ. 
* ఇలా ఈ రెండు సంస్థలకూ ప్రభుత్వం రూ.21.5 కోట్ల మేర లబ్ధిని చేకూర్చిం దని, అందుకు ప్రతిఫలంగా ఆ సంస్థలు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన సంస్థల్లో రూ.29.5 కోట్లను పెట్టుబడిగా పెట్టాయని ఈడీ చెబుతోంది. 
* ఈ రెండు మొత్తాలనూ కలిపి (రూ.21.5 కోట్లు + రూ.29.5 కోట్లు) 51 కోట్ల విలువైన ఆస్తుల్ని అటాచ్ చేస్తూ ఉత్తర్వులిచ్చేసింది. 
* అసలు 21.5 కోట్లు లబ్ధి కలిగినందుకు ప్రతిఫలంగా 29.5 కోట్లు పెట్టుబడి పెట్టడమనేదే అర్థంలేని ఆరోపణ. అలా ఎవ్వరూ చేయరని ఈడీకి తెలి యదా? ఇది జగన్‌మోహన్ రెడ్డిని ఇరికించటానికి చేస్తున్న ఆరోపణ కాదా?

వైఎస్సార్‌కు, జగన్‌కు సంబంధమేంటి?
అసలు ఈ ఆరోపణలతో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డికి సంబంధం ఉందా? ఆయన పాత్రేంటి? నిజంగా ఆయనే వీటికి భూములు కేటాయించారా? సీఎం సంతకాలు చేశారా? కేటాయింపు ఆదేశాలిచ్చారా? ఈ ప్రశ్నలన్నిటికీ లేదనే సమాధానం వస్తుంది. దీనికి మూలాలన్నీ చంద్రబాబునాయుడి హయాంలో కనిపిస్తాయి. సీబీఐ గానీ, ఈడీ గానీ అటువైపు చూడకపోవటమే చిత్రాతిచిత్రం. 

చంద్రబాబు హయాంలోనే భూ సేకరణ...
జడ్చర్లలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా 954 ఎకరాల భూమిని సేకరించారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాకముందే ఈ భూ సేకరణ పూర్తయిపోయింది. దీనికి ఎకరాకు రూ.75 వేల చొప్పున పరిహారాన్ని చెల్లించారు. భూ సేకరణ పూర్తయిన తరవాత మూడేళ్ల దాకా... అంటే 2006 వరకూ ఏ ఒక్క పరిశ్రమా ఇక్కడ కంపెనీ పెడతామంటూ ముందుకు రాలేదు. అప్పుడు... అంటే 2006లో నాటి ఏపీఐఐసీ ఎండీ బి.పి.ఆచార్య రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో కేంద్రానికి ఒక ప్రతిపాదన చేశారు. మొత్తం 954 ఎకరాల భూమిలో 250 ఎకరాల్ని సెజ్‌గా ప్రకటిస్తే పరిశ్రమలు ముందుకు రావచ్చని, అవి యాంకర్ యూనిట్లుగా కూడా నిలుస్తాయని చెప్పారు. 2006 అక్టోబర్లో కేంద్రం దీనికి అనుమతించింది. యాంకర్ యూనిట్లను ప్రోత్సహించటానికి ఈ సెజ్‌లో ఎకరాకు రూ.15 లక్షలు వసూలు చేయాలని ధరల కమిటీ నిర్ణయించింది. 2006 డిసెంబర్ 31 లోగా ఈ ధరకు భూమిని కేటాయించాలని, లేదంటే ధరను పక్కనబెట్టి 50 ఎకరాలను కేటాయించాలని... వీటిలో ఏది ముందు జరిగితే అది చేయాలని సూచించింది. 

నవంబర్లోనే దరఖాస్తులు...
2007 జూన్, అక్టోబర్ నెలల్లో ఈ సంస్థలకు భూమి కేటాయించారని, నవంబర్-డిసెంబర్ నెలల్లో అవి పెట్టుబడులు పెట్టాయని... ముడుపుల సంగతి నిరూపించటానికి ఇదొక్కటి చాలని ఈడీ పేర్కొన్నట్టుగా ఈనాడు రాసేసింది. అసలు ఏం జరిగిందో తెలుసా? 
2006 నవంబర్‌లో హెటెరో, అరబిందో సంస్థలు ఏపీఐఐసీకి లేఖలు రాశాయి. తమకు ఆ సెజ్‌లో తలా 75 ఎకరాలు కేటాయించాలని కోరాయి. ఈ లేఖల్ని పరిశీలించిన ఏపీఐఐసీ అధికారులు ఎండీ బి.పి.ఆచార్యకు పంపారు. చివరికి ఎకరా 7 లక్షల చొప్పున విక్రయానికి ఓకే చేశారు. కాకుంటే ఇక్కడ గమనించాల్సిందొకటుంది. ఎకరాకు రూ.15 లక్షల ధరను నిర్ణయించింది ఏకమొత్తంగా అమ్మటానికి. కానీ ప్రభుత్వం ఎకరా రూ.7 లక్షల చొప్పున కేటాయించింది లీజు పద్ధతిన. రూ.7 లక్షల చొప్పున ధర నిర్ణయించి... ఆ ధరలో ఒక శాతాన్ని ఏడాదికి లీజు అద్దెగా చెల్లించాలనేది హెటెరో, అరబిందో సంస్థలతో చేసుకున్న ఒప్పందం. ఆ లీజు మొత్తాన్ని ఒకేసారి ముందే చెల్లించాలనేది కూడా ఒప్పందంలోనే ఉంది. దీంతో ఆ రెండు సంస్థలూ భూమిని తీసుకున్న వెంటనే ఎకరాకు రూ.7 లక్షల చొప్పున లీజు అద్దెను ఒకేసారి చెల్లించేశాయి. అంటే ఎకరాకు రూ.7 లక్షల చొప్పున సొమ్ము ముందే ఏపీఐఐసీ చేతికి వచ్చింది. లీజు గడువు ముగిశాక ఆ భూమి ఎలాగూ ఏపీఐఐసీదే. దీన్ని ప్రభుత్వానికి కలిగిన నష్టంగా భావించవచ్చా? 

పెపైచ్చు ఏపీఐఐసీ ధరల కమిటీ నిర్ణయించిన ధర మామూలు కేటాయింపులకు వర్తించేదే. అంటే చుట్టూ కాంపౌండ్ వేసి... మధ్యలో రోడ్లు వేశాక అమ్మితేనే వర్తిస్తుంది. కానీ జడ్జర్ల సెజ్‌కు అలాంటివేమీ చేయలేదు. కంచె, రోడ్లు, వీధిలైట్ల వంటి సౌకర్యాలేవీ లేవు. అవన్నీ హెటెరో, అరబిందోలే వేసుకున్నాయి. మరి అభివృద్ధి చేసిన భూమిని ఎకరా 15 లక్షలకు ఏకమొత్తంగా విక్రయించాలనుకున్నపుడు... అభివృద్ధి చేయని భూమిని ఎకరా రూ.7 లక్షల చొప్పున... లీజుకివ్వటం తప్పా? అసలు దీంట్లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి పాత్రేమిటి? కనీసం ఈ ఫైళ్లు ఆయన టేబుల్ వద్దక్కూడా రాలేదనే విషయాన్ని సీబీఐ, ఈడీ ఎందుకు చెప్పటం లేదు. కంపెనీలు ముందుకు రావటం, ఏపీఐఐసీ కేటాయించటం ఈ రాష్ట్రంలో కొత్తేమీ కాదుగా? మరి దాన్ని ముఖ్యమంత్రికి అంటగట్టడంలో దురుద్దేశం బయటపడటం లేదా? కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి కనుక ఆ కంపెనీ ప్రతినిధులు తనను కలవటానికి అనుమతించటమో, లేక వారితో ఫొటో దిగటమో చేస్తే తప్పా? సీఎం దగ్గరకు రాని ఫైళ్లను ఆయనకు అంటగడుతూ... దానికి లింకు పెట్టి ఆయన తనయుడి కంపెనీలను టార్గెట్ చేయటం వెనక దురుద్దేశాలు తెలియటం లేదా?

టార్గెట్ ‘సాక్షి’ మీడియా... 
‘సాక్షి’ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతించిన ఈడీ ప్రాధికార సంస్థ... భూములతో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్లనూ అటాచ్ చేయడానికి అనుమతించింది. కంపెనీ ఆస్తులంటే భూములు, భవనాలు, యంత్రాల వంటివి ఉంటాయి. కంపెనీ షేర్లు కూడా కంపెనీ ఆస్తులే. కంపెనీ మనుగడకు ఇబ్బంది లేకుండా అలాంటి ఆస్తుల్ని అటాచ్ చేసినా ఇబ్బంది ఉండదు. కానీ ‘సాక్షి’ విషయంలో నగదు ఫిక్స్‌డ్ డిపాజిట్లను అటాచ్ చేయటమే అనేక అనుమానాలకు ఆస్కారమిస్తోంది. ఎందుకంటే మున్ముందు వచ్చే అవసరాల కోసం సంస్థలోనే పెట్టి ఉంచిన రివాల్వింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లను అటాచ్ చేస్తే కంపెనీని నడపటం అనేది ఎవరికైనా సవాలే. ‘సాక్షి’ విషయంలో జరుగుతోంది అదే. 

మాతృగర్భం నుంచే పోరాటం మొదలైనట్లు...
‘సాక్షి’ది ఆవిర్భావం నుంచీ పోరాటమే. అసలు ‘సాక్షి’ పుట్టడానికి ముందే ఎల్లో కుట్రలు పదునెక్కి... ఆరోపణలు చట్ట సభలనూ కుదిపాయి. అన్నిటినీ తట్టుకుని నిలబడ్డ ‘సాక్షి’ మీడియా... ప్రత్యర్థుల భయాన్ని నిజం చేసింది. అప్పటిదాకా తాను రాసిందే వార్త.. తాను చూపిందే నిజమని చెబుతూ వచ్చిన ఆధిపత్య మీడియాకు గండి పడింది. నాణేనికి రెండో కోణం కూడా ఉందని తెలుగు పాఠకులకు తెలిసింది. కొన్ని దశాబ్దాల పాటు ఎందరెందరినో కొట్టి, ఎన్నో అడ్డదార్లు తొక్కి నిర్మించిన ఆధిపత్యపు కోటలు ఒక్కసారిగా కూలిపోయేసరికి ప్రత్యర్థులకు దిక్కుతోచలేదు. ఫలితం... సాక్షి గొంతు నొక్కే ప్రయత్నాలు తీవ్రమయ్యాయి. కుట్రలు మరింత లోతులకు పోయాయి. వేల మంది ఉద్యోగులను రోడ్డున పడేసైనా సరే... సాక్షి గొంతు నొక్కాలన్న కసితో సాగుతున్న ఎల్లో కుట్రల్లో మరో కోణమే ఈడీ అటాచ్‌మెంట్ కూడా
Share this article :

0 comments: