మీకు మీరు ఓట్లేసుకుని... గెలిచామని చెప్పుకునేందుకే... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మీకు మీరు ఓట్లేసుకుని... గెలిచామని చెప్పుకునేందుకే...

మీకు మీరు ఓట్లేసుకుని... గెలిచామని చెప్పుకునేందుకే...

Written By news on Wednesday, February 6, 2013 | 2/06/2013

ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్య కోణం కనిపిస్తోందా? రైతు శ్రేయస్సు స్ఫురిస్తోందా?
విపక్షాలకు కనీసం ఓట్లు నమోదు చేయించుకునే అవకాశమైనా ఇచ్చారా?
ఈ ఎన్నికలు అప్రజాస్వామికం.. దుర్మార్గం.. అధికార దుర్వినియోగానికి పరాకాష్ట
ప్రజల్ని అష్టకష్టాల్లోకి నెట్టేసినందుకా.. మిమ్మల్ని గెలిపించారని సంబరపడుతున్నారు?
ఎరువుల ధరలు రెట్టింపు చేసినందుకా.. రైతులు మీకు మద్దతిచ్చారని మురిసిపోతున్నారు?
కరెంటు లేని పాలనకేనా.. ఓట్లు వేశారని మీరు సంబరాలు చేసుకుంటున్నది?
మద్దతు ధర ఇప్పించలేనందుకా.. మీకు పట్టం కట్టారనుకుంటున్నది?
గ్యాస్ సిలిండర్లకు పరిమితి పెట్టినందుకా.. మీ బ్యాలెట్ బాక్సులను నింపేశారనుకుంటున్నది?
ఇన్ని కష్టాలుంటే రైతులు మీకు ఓట్లేస్తారా? మీకు మీరు ఓట్లేసుకుని... గెలిచామని చెప్పుకునేందుకే వీటిని నిర్వహించారు... కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కయినందుకే ప్రజలకు ఈ దుస్థితి
అవిశ్వాసం పెట్టే బలమున్నా పాదయాత్ర పేరుతో బాబు మొసలి కన్నీరు కారుస్తున్నారు

 రాష్ట్రంలోని సహకార సంఘాలకు జరిగిన ఎన్నికలు అప్రజాస్వామికమని, అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విమర్శించారు. ప్రజాస్వామ్య కోణం ఇసుమంతైనా స్ఫురించకుండా నిర్వహించిన ఈ ఎన్నికలు రైతు శ్రేయస్సు కోసం పెట్టినవి కాదని, కేవలం కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పుకునేందుకే నిర్వహించారని ఆమె మంగళవారం ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. సహకార సంఘాల్లో సభ్యత్వ నమోదు ప్రక్రియ నుంచి ఎన్నికలు నిర్వహించేంత వరకు అధికార పక్షం అక్రమాలకు పాల్పడిందని, లేదంటే రైతులకు ప్రభుత్వం ఏం చేసిందని వారు గెలిపిస్తారని ఆమె ప్రశ్నించారు. 

రాష్ట్రంలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని, జీవించేందుకే పోరాటం చేయాల్సిన దుస్థితిలోకి ప్రజలను నెట్టివేశారని, అలా వారిని వేధిస్తున్నందుకే సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని ఆ పార్టీ నేతలు సంబరపడుతున్నారా? అని విజయమ్మ ప్రశ్నించారు. రెట్టింపయిన ఎరువుల ధరలు, జాడలేని వడ్డీ రహిత రుణాలు, పండించిన పంటకు దొరకని మద్దతు ధర, కరెంటు లేక ఎండిపోయిన పంటలు, విచ్చలవిడిగా పెరిగిన డీజిల్ ధరలు... ఇవి చూసి మీకు ఓట్లేశారని, అందులో గెలిచామని మీరు మురిసిపోతున్నారా అని నిలదీశారు. ప్రభుత్వ పక్షం ప్రజలను ఇబ్బందుల పాలుచేస్తుంటే వారి పక్షాన ఉండి పోరాడాల్సిన ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు అటు కేంద్రం, ఇటు రాష్ట్రంతో కుమ్మక్కయి తన కేసులను మాఫీ చేసుకునేందుకు పాకులాడుతున్నారని దుయ్యబట్టారు. మీ గెలుపు నిజమైనదే అయితే గత ఉప ఎన్నికల్లో ఎందుకు డిపాజిట్లు కోల్పోయారని విజయమ్మ ప్రశ్నించారు.

విజయమ్మ ప్రకటన పూర్తి పాఠమిదీ..

సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందిందని ఆ పార్టీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు... ఢిల్లీ స్థాయిలో నివేదికలిచ్చి సంతోషపడుతున్నారు. అసలు సహకార ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా చెప్పుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సహకార సంఘాల్లో 39 లక్షల మంది సభ్యులుంటే దానిని 51 లక్షలకు పెంచుకున్నారు. తమ వందిమాగధులకు మాత్రమే సొసైటీల్లో స్థానం కల్పించారు. విపక్షాలు ఓట్ల నమోదు కోసం వెళితే కనీసం సభ్యత్వ పుస్తకాలు కూడా ఇవ్వలేదు. ప్రభుత్వ కార్యాలయాలు వదిలిపెట్టి ప్రైవేటు గదులకు పరిమితమయ్యారు. 

తమ ఓట్లు ఏవని అడిగిన రైతులపై కేసులు కూడా పెట్టారు. ఓడిపోతామనుకున్న 150 సొసైటీల్లో ఎన్నికలను వాయిదా వేశారు. ఇవి ఎన్నికలని మీరు మురిసిపోతే సరిపోతుందా? సహకార ఎన్నికలలో కాంగ్రెస్‌కు ఓటేయకపోతే రుణాలివ్వబోమని, కేసులు పెడతామని అధికార పార్టీ నేతలు రైతులను బెదిరించారు. మీ సొసైటీలో కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే అసలు సొసైటీకే నిధులిచ్చేది లేదని బెదిరించారు. ఇంత దుర్మార్గంగా, అప్రజాస్వామికంగా, నిరంకుశంగా ఎన్నికలు నిర్వహించారు. కేవలం తాము ఎన్నికలలో గెలిచామని చె ప్పుకునేందుకే తప్ప ఏ కోశానయినా ఈ సహకార ఎన్నికలలో ప్రజాస్వామ్య కోణం కనిపిస్తోందా? రైతు శ్రేయస్సు స్ఫురిస్తోందా?

ఇందుకేనా మీరు గొప్పలు చెప్పుకుంటున్నది..

2004-09 మధ్య ఎరువుల ధరలతో పోలిస్తే 2009-13 మధ్య కాలంలో ధరలు రెట్టింపయ్యాయి. డీఏపీ, కాంప్లెక్స్, యూరియా... ఇలా అన్ని రకాల ఎరువుల ధరలు నింగినంటాయి. ఆ ధరలతో కొందామన్నా ఎరువులు రైతులకు అందుబాటులో ఉండని పరిస్థితి. ఇంతటి ఘోర పరిస్థితులు ఎదుర్కొంటున్నందుకా రైతులు మీకు మద్దతిచ్చారని మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు?

వైఎస్సార్ బతికి ఉన్నప్పుడు రైతులకు ఉచితంగా ప్రతిరోజూ 7 గంటల కరెంటు ఇచ్చేవారు. ఇప్పుడు కనీసం మూడు గంటలయినా ఇస్తున్నారా? కరెంటు లేక పంటలు దారుణంగా ఎండిపోలేదా? ఈ కరెంటు లేని పాలనకేనా రైతులు మద్దతిచ్చారని మీరు సంబరాలు చేసుకుంటున్నది?

లైలా తుపానుకు రైతులు పెద్ద ఎత్తున నష్టపోతే పరిహారం ఈ రోజువరకయినా చెల్లించారా? నష్టపరిహారం పెంచినట్లే పెంచి.. లబ్ధిదారుల పేర్లలో రైతులు లేకుండా చేసినందుకేనా మీకు రైతులు మద్దతిచ్చారని గొప్పలకు పోతున్నది?

రైతులకు కనీసం పంటరుణాలు ఇవ్వలేకపోయారే? కౌలు రైతులకు 10 శాతమైనా రుణాలిప్పించగలిగారా? వడ్డీలేని రుణాలని చెప్పిన మీరు రైతులు తీసుకున్న రుణాల కింద బ్యాంకులకు ఇప్పటివరకు రూపాయయినా సబ్సిడీ చెల్లించారా? ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందిలే అని బ్యాంకులకు వెళ్లిన రైతులు నోరెళ్లబెట్టి బయటకు రావడం వాస్తవం కాదా? ఇందుకేనా రైతులు మా వెన్నంటి ఉన్నారని మీరు ప్రగల్భాలకు పోతున్నది?

రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇప్పించగలిగారా? రైతు దగ్గర పంట ఉన్నప్పుడు మార్కెట్‌లో ధర తక్కువగా ఉంటే దళారుల వద్దకు వెళ్లేసరికి అమాంతం ధర పెరిగిపోలేదా? రైతుల నుంచి పత్తి క్వింటాలుకు రూ.2,500 నుంచి రూ.3,200కు కొనుగోలు చేసిన పంట దళారుల వద్దకు చేరిన తర్వాత రూ. 4,500 నుంచి రూ.5,000 కాలేదా? కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రైతులకు అండగా నిలబడగలిగిందా? ఆ దిశలో మీరేమైనా కనీస ప్రయత్నం చేశారా? తాము పండించిన పంటలకు మద్దతు ధర ఇప్పించలేనందుకా.. అధికారపక్షానికి రైతులు మద్దతిచ్చి సొసైటీ ఎన్నికలలో పట్టం కట్టారని మీరు భావిస్తున్నారు?

2009లో రూ.40 ఉన్న డీజిల్ ధర 2013 నాటికి రూ.51కి చేరింది. కనీసం ఈ చమురు ధరల పెరుగుదలపై నియంత్రణ ఉంచుకోకుండా చమురు కంపెనీలకు అధికారం కట్టబెట్టి భవిష్యత్తులో అడ్డగోలుగా ధరలు పెంచుకునేందుకు అవకాశ మిచ్చారు. గ్యాస్ సిలిండర్లకు లేని పరిమితి విధించి, సబ్సిడీలో కూడా కోత విధించినందుకా.. రైతులు మీ బ్యాలెట్ బాక్సులను నింపేశారని మీరు లెక్కలు కట్టుకుంటున్నారు?

గడిచిన మూడేళ్లలో ఒక్క కొత్త ఇల్లయినా రాష్ట్రంలో నిర్మించగలిగారా? కొత్త పింఛన్ ఒక్కటయినా మంజూరు చేశారా? అసలు గ్రామాల్లో తాగునీరు ఇవ్వగలిగారా? గ్రామాలకు వెళ్లి అక్కడున్న పరిస్థితులను కనీసం మీరు చూడగలిగారా? ఆపద్బంధు లాంటి 104 వాహనం అసలు కనిపిస్తోందా? 108 వాహనం పత్తా ఏమయింది? ఫీజుల పథకం కింద లబ్ధిపొందే విద్యార్థులు అభద్రతాభావంతో తమ చదువులు కూడా సరిగా చదువుకోలేకపోతున్నారు కదా? ఇందుకా.. రైతులు మీపక్షాన నిలిచి గెలిపించారని సంబరపడుతున్నారు?

రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి ఏమిటి? గృహాలకు కోతల్లేకుండా కరెంటివ్వడం మీకు సాధ్యమయిందా? కరెంటు లేక వేలాది పరిశ్రమలు మూతపడి లక్షలాది మంది కార్మికులు రోడ్డునపడలేదా? ఈ పరిస్థితుల్లో గెలిచామంటూ ఎలా గొప్పలకు పోతున్నారు?

మీ పాలనలో ప్రజలు అష్టకష్టాలూ పడాల్సి వస్తోంది. అసలు జీవించేందుకే పోరాటం చేయాల్సిన పరిస్థితి. అధికార, ప్రతిపక్షాలు కుమ్మక్కు రాజకీయాల ఫలితంగానే రాష్ర్టంలోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హేరామ్... హే దేవా... హే అల్లా... మీరే ఈ రాష్ట్రాన్ని కాపాడాలి.

కేసుల మాఫీ కోసమే కాంగ్రెస్‌తో బాబు కుమ్మక్కు

ప్రజలను పాలించాల్సిన అధికార పార్టీ తన కుర్చీని కాపాడుకునేందుకే పనిచేస్తున్న క్రమంలో ప్రజల పక్షాన ఉండి ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన తెలుగుదేశం పార్టీ అధికార పక్షంతో కుమ్మక్కయింది. రైతులకు, చిరువ్యాపారులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐల బిల్లుపై ఓటింగ్ సందర్భంగా తమ పార్టీ ఎంపీలను సభకు హాజరుకాకుండా చేసి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి సహకరించారు. రైతులు, చిరువ్యాపారులకు వెన్నుపోటు పొడిచారు. చీకట్లో చిదంబరాన్ని కలిసి కేసులు మాఫీ చేసుకునేందుకే అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్‌తో చంద్రబాబు అంటకాగుతున్నారు. అసెంబ్లీలో తగిన బలం ఉండి కూడా అవిశ్వాస తీర్మానం పెట్టకుండా పాదయాత్ర పేరుతో ప్రభుత్వాన్ని తిడుతున్నట్లు నటిస్తూ మొసలి కన్నీరు కారుస్తున్నారు.
Share this article :

0 comments: