దేశవ్యాప్త సమ్మెకు వైఎస్ఆర్ సీపీ మద్దతు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దేశవ్యాప్త సమ్మెకు వైఎస్ఆర్ సీపీ మద్దతు

దేశవ్యాప్త సమ్మెకు వైఎస్ఆర్ సీపీ మద్దతు

Written By news on Tuesday, February 12, 2013 | 2/12/2013

కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ ఈ నెల 20, 21 తేదీల్లో జరప తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ ట్రేడ్‌ యూనియన్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గాన్ని బలహీనపరిచి బడా పారిశ్రామిక వేత్తలకు కొమ్ము కాస్తున్నాయని, ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్ల కార్మికుల జీవితాలు దుర్బరం అయ్యాయని వైఎస్‌ఆర్‌ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు జనక్‌ ప్రసాద్‌ అన్నారు. దేశవ్యాప్త సమ్మెలో అన్ని జిల్లాల కార్మిక నేతలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఙప్తి చేశారు.
Share this article :

0 comments: