అనిల్‌పై బీజేపీ ఆరోపణల లోగుట్టు వేరే.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అనిల్‌పై బీజేపీ ఆరోపణల లోగుట్టు వేరే..

అనిల్‌పై బీజేపీ ఆరోపణల లోగుట్టు వేరే..

Written By news on Monday, February 18, 2013 | 2/18/2013

నజ్రత్ మినిస్ట్రీస్‌తో అనిల్‌కు సంబంధమే లేదు
సంస్థ నిర్వాహకుడు పాస్టర్ డేవిడ్‌రాజు స్పష్టీకరణ
ఆరోపణల అసలు ఉద్దేశం వేరేనంటున్న స్థానికులు
పార్టీల ప్రోద్బలంతోనే పైరవీకారుల కుయుక్తులు!
అనాథలకు ఆశ్రయమివ్వాలన్న లక్ష్యానికి గండికొట్టే యత్నాలు
ఆవేదన వ్యక్తం చేస్తున్న మత ప్రబోధకులు


 మత ప్రబోధకుడు బ్రదర్ అనిల్‌కుమార్‌పై ఇటీవల వచ్చిన ఆరోపణల వెనుక ఉన్న రాజకీయ లబ్ధి కోణం నానాటికీ ప్రస్ఫుటంగా బయట పడుతోంది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం మణికొండ సమీపంలోని పోకల్‌వాడలో నాలుగెకరాల భూమి అనిల్‌దేనంటూ బీజేపీ నేత ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ కొందరు వ్యక్తులతో కలిసి చేసిన ఆరోపణలపై స్థానికులే తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోకల్‌వాడ సర్వే నంబర్ 4లో జీసస్ నజ్రత్ మినిస్ట్రీస్ సంస్థకు ఆ నాలుగెకరాలను 33 ఏళ్ల పాటు హెచ్‌ఎండీఏ లీజుకివ్వడం తెలిసిందే. ఈ సంస్థతో అనిల్‌కు ఎలాంటి సంబంధమూ లేదని దాని నిర్వాహకుడు పాస్టర్ డేవిడ్ రాజు ఇప్పటికే ప్రకటించినా, హెచ్‌ఎండీఏ చూపిన హద్దుల మేరకే సంస్థ పరిధి విస్తరించినా... ఇలా భూ ఆక్రమణ అరోపణలకు దిగడం రాజకీయలబ్ధి కోసమేని స్థానికులు అభిప్రాయపడ్డారు. సమాజంలో ఎవరికీ పట్టని అనాథలకు ఆశ్రయం ఇచ్చే లక్ష్యంతో ఏర్పాటైన మినిస్ట్రీస్ సంస్థ లక్ష్యంగా కదులుతున్న పావులు వెనుక అసలు ఉద్దేశం వేరే ఉందంటూ వారు మండిపడ్డారు. ఉదాత్త లక్ష్యానికి గండి కొట్టే ప్రయత్నాలు తగవంటూ మత ప్రబోధకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పోకల్‌వాడ సర్వే నంబర్ 4లో 54 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని 1986లో అప్పటి ప్రభుత్వం హుడా పరిధిలోకి తెచ్చింది. అందులో 30 ఎకరాల్లో హుడా లే అవుట్ ఏర్పాటు చేయగా, మరో 8 ఎకరాలను రియల్టర్‌కు విక్రయించారు. మిగతా భూమిలో నాలుగెకరాలను సేవా కార్యక్రమాల కోసం తమకివ్వాలంటూ జీసస్ నస్రత్ మినిస్ట్రీస్ సంస్థ 2004లో దరఖాస్తు చేసుకుంది. రెండేళ్ల అనంతరం, అంటే 2006లో ఆ స్థలాన్ని 33 ఏళ్లకు లీజు ప్రాతిపదికన సంస్థకు కేటాయించారు. ధార్మిక కార్యక్రమాలు, అనాథ శరణాలయం, వృద్ధాశ్రమం, వైద్యాలయం, ప్రార్థన మందిరం, పాస్టర్ నివాసం తదితరాల కోసం ఈ భూమిని వినియోగించుకొనేందుకు అంగీకరించారు. ఏటా రూ.40 వేలు లీజు రుసుముగా నిర్ణయించారు. సరిహద్దులు నిర్ధారించి భూమిని అప్పగించారు. ఆ మేరకు నిర్వాహకులు అక్కడ ప్రార్థనా మందిరం, అనాథ బాలల సంరక్షణ కేంద్రం తదితర భవనాలు నిర్మించారు. రాత్రి పాఠశాల వంటి కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. సంస్థను మరింత విస్తరించి వృద్ధాశ్రమం, నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ కేంద్రం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. హెచ్‌ఎండీఏ హద్దులు నిర్ధారించి అప్పగించిన ప్రాంతంలోనే నిర్మాణాలు చేపట్టి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా భూ కబ్జా ఆరోపణలు రావడంపై స్థానిక అధికారులు సైతం విస్తుపోతున్నారు. 

అసలు ఏ ఆధారంతో ఆ ఆరోపణలు చేస్తున్నారో కూడా తెలియడం లేదని వారంటున్నారు. నిజానికి ఈ స్థలంపై ఏమైనా వివాదాలుంటే లీజుకిచ్చిన హెచ్‌ఎండీఏనే అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంతేతప్ప లీజు పొందిన సంస్థకు దానితో ఎలాంటి సంబంధమూ ఉండదు. ఇది తెలిసి కూడా కొందరు చేస్తున్న ఉద్దేశపూర్వక దుష్ర్పచారంతో తాము చేపడుతున్న సేవా కార్యక్రమాలకు అవాంతరాలు ఏర్పడతాయేమోనంటూ సంస్థ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థల వివాదాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత హెచ్‌ఎండీఏదేనని స్పష్టం చేస్తున్నారు. స్థలాన్ని లీజు అగ్రిమెంట్‌లో నిర్దేశించిన కార్యక్రమాలకు వినియోగించడం లేదన్న ఆరోపణలను వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. హెచ్‌ఎండీఏ ఇచ్చిన నోటీసుకు సమాధానంగా తాము అన్ని ఆధారాలను సమర్పించామని వివరించారు. అక్కడ నిర్మించిన కట్టడాల ఛాయా చిత్రాలు, జరుగుతున్న కార్యక్రమాల వివరాలను ససాక్ష్యంగా మీడియాకు కూడా విడుదల చేశారు. అందులో ఆక్రమణలేమీ లేవని తేల్చి చెప్పారు.

నిందలు సరికాదు 

‘‘ఆ భూమిని మినిస్ట్రీస్ సంస్థ హెచ్‌ఎండీఏ నుంచి లీజుకు తీసుకొంది. లీజు గడువు ముగియగానే దాన్ని ప్రభుత్వం తీసుకొంటుంది. అలాంటప్పుడు సంస్థపై ఆక్రమణల నింద వేయడం సరికాదు. నిజంగా బాధితులకు న్యాయం చేయాలనుకునే వారు ప్రభుత్వంతో పోరాడి సాధించాలి. గతంలో (1986లో) సాగుచేసుకొంటున్న వారి నుంచి భూమి తీసుకొన్న అప్పటి ప్రభుత్వం, బాధితులకు ఎలాంటి పరిహారమూ చెల్లించలేదు. ఆ భూమిలో మొత్తం 29 మంది సాగుదారులుండగా, వారిలో 18 మంది దళితులు. వారికి న్యాయం చేయాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. ఇప్పటికైనా హెచ్‌ఎండీఏ స్పందించి బాధితులకు ఇంటి స్థలాలైనా ఇచ్చి ఆదుకోవాలి’’
- యాలాల నరేశ్, మణికొండ మాజీ సర్పంచ్

పేదల కడుపు కొట్టారు

‘‘1986లో అప్పటి ప్రభుత్వం పేదల కడుపు కొట్టింది. అనాదిగా సాగుచేసుకొంటున్న భూములను లాక్కొని వారి బతుకులు ఆగం చేసింది. కనీసం బాధితులకు గూడు నిర్మించుకొనేందుకు ఇంటి స్థలం ఇచ్చే విషయాన్ని కూడా హెచ్‌ఎండీఏ పట్టించుకోవడం లేదు. కేవలం రాజకీయం చేసేందుకే పోకల్‌వాడ భూముల విషయాన్ని తెరపైకి తెచ్చారే తప్ప బాధితుల తరఫున ఏ పార్టీ వారూ ప్రభుత్వంతో పోరాటం చేయలేదు, చేయడం లేదు. నిజంగా బాధితులను ఆదుకోవాలనుకొన్న వారు మినిస్ట్రీస్ సంస్థపై బురద జల్లడం వ ల్ల లాభముండదు’’
- కె.వెంకటేశ్, భూమి కోల్పోయిన బాధితుడు
Share this article :

0 comments: