మరో ప్రజా ప్రస్థానం - పునఃప్రారంభం! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మరో ప్రజా ప్రస్థానం - పునఃప్రారంభం!

మరో ప్రజా ప్రస్థానం - పునఃప్రారంభం!

Written By news on Wednesday, February 6, 2013 | 2/06/2013

Written by MK On 2/6/2013 5:40:00 PM
కింటేడాది డిసెంబర్ 14న రంగారెడ్డి జిల్లాలో ఎక్కడయితే వైఎస్ షర్మిల ‘మరో ప్రజా ప్రస్థానం’ ఆగిందో, అక్కడే ఈ బుధవారం నాడు -ఫిబ్రవరి ఆరో తేదీన- ఆమె పాదయాత్ర పునఃప్రారంభమయింది. ప్రజల గోడు పట్టని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికీ, అధికార పక్షంతో కుమ్మక్కయి, తన బాధ్యత మర్చిపోయిన ప్రధాన ప్రతిపక్షం దగాకోరు విధానాలకూ నిరసనగా ‘మరో ప్రజా ప్రస్థానం’ చేపట్టారు షర్మిల. కడప, అనంతపురం. కర్నూలు మహబూబ్ నగర రంగారెడ్డి జిల్లాల్లో, 57 రోజుల పాటు, 824 కిలో మీటర్ల మేరకు అప్రతిహతంగా సాగింది ‘మరో ప్రజా ప్రస్థానం’. రెండు నెల్ల కిందట హయాత్ నగర్ మండలం బీఎన్ రెడ్డి నగర్‌లో జరిగిన ఓ బహిరంగసభలో మాట్లాడి వేదిక దిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఆమె మోకాలి మృదులాస్థి గాయపడింది.

ఏడు వారాలపాటు లిగమెంటు చికిత్స జరిగిన మీదట ఈ బుధవారం నాడు షర్మిల పాదయాత్ర తుర్క యాంజాల్ సమీపంలోని ఎస్‌ఎస్‌ఆర్ గార్డెన్స్ దగ్గిర పునఃప్రారంభమయింది. గతంలో ఇక్కడే ఆమె యాత్రకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. తుర్క యాంజాల్, రాగన్న గూడ, బొంగులూరు గేటు, మన్నెగూడ ఔటర్ రింగ్ రోడ్డు, కల్లెం జగ్గారెడ్డి గార్డెన్స్, మంగళంపల్లి గేట్, శేరీగూడ గ్రామాల మీదుగా 15 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర సాగించారు షర్మిల. ఇబాహీం పట్నం నియోజక వర్గ కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు కూడా. నల్లగొండ జిల్లాలో ఆమె యాత్ర 11 రోజుల పాటు సాగుతుందని నిర్వాహకులు తెలియచేశారు. ఈ పాదయాత్ర పునఃప్రారంభ సందర్భంగా షర్మిలతో పాటుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి కూడా ఉండడం విశేషం.

‘నేను మీ రాజన్న కూతురిని- జగనన్న చెల్లెలిని’ అంటూ షర్మిల తన ప్రసంగం ప్రారంభించడం ఆనవాయితీగా మారింది. కాంగ్రెస్ అధిష్టానమ్మ సోనియా గాంధీ, తెలుగు దేశం పెత్తందారు చంద్రబాబు నాయుడు కుమ్మక్కయి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైలుపాలు చేసిన కుట్ర రాజకీయాన్ని నడివీథిలో ఉతికిఆరేయడానికే షర్మిల ఈ పాదయాత్రను తలపెట్టారు. 2003లో, తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చరిత్రాత్మక పాదయాత్ర ప్రజా ప్రస్థానాన్ని గుర్తు చేసే రీతిలో తన పాదయాత్రకు ‘మరో ప్రజా ప్రస్థానం’అని పేరుపెట్టారామె. జనసామాన్యానికి, ముఖ్యంగా మహిళలకు చక్కగా అర్థమయ్యేలా కాంగ్రెస్- టీడీపీ కుమ్మక్కు కుట్ర రాజకీయాన్ని విప్పిచెప్పారు షర్మిల.

బుధవారం నాడు ‘మరో ప్రజా ప్రస్థానం’పునఃప్రారంభించిన తర్వాత తుర్క యాంజాల్ దగ్గిర షర్మిల మహిళలతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. విభిన్న వర్గాల ప్రజలతో ఆమె మాట్లాడి, వారి సమస్యల గురించి తెలుసుకున్నారు. ఏదో పడదోసేశానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు టీడీపీ హయాంలో వృద్ధాప్య పింఛనుగా 75 రూపాయలు ఇవ్వడమే గగనం కాగా, తన తండ్రి వైఎస్సార్ అధికారం చేపట్టిన వెంటనే ఈ మొత్తాన్ని 200 రూపాయలకు పెంచిన వాస్తవాన్ని షర్మిల ప్రజలకు గుర్తు చేశారు. మానసిక వికలాంగులకూ, వితంతువులకూ కూడా పింఛను సౌకర్యం విస్తరింపచేసి అమలు చేసింది వైఎస్సారేనని ఆమె అన్నారు. వైఎస్సార్‌ను తలపింపచేసే రీతిలోనే షర్మిల చేతులూపుతూ అభిమానులను ఉత్సాహపరుస్తూ పాదయాత్ర కొనసాగించారు.


http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=57172&Categoryid=28&subcatid=0
Share this article :

0 comments: