పాదయాత్ర రికార్డుల కోసం కాదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పాదయాత్ర రికార్డుల కోసం కాదు

పాదయాత్ర రికార్డుల కోసం కాదు

Written By news on Monday, February 18, 2013 | 2/18/2013

పాదయాత్రలు రికార్డుల కోసం, పండగలు జరుపుకోవడం కోసం కాదని వైఎస్ జగన్ సోదరి షర్మిల అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్రను మహానేత వైఎస్ఆర్ మహాయజ్ఞంలా చేశారని షర్మిల అన్నారు. నాన్నగారి ఆశీస్సులు, దేవుని దయతో చేస్తోన్న పాదయాత్ర 1000 కి.మీ చేరుకుందని షర్మిల అన్నారు. 

పాదయాత్ర చేసిన అన్ని గ్రామాల్లో ప్రజల కన్నీళ్లు, కష్టాలే కనపడుతున్నాయని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. అంత బాధలో కూడా ప్రజలు రాజన్న రాజ్యం రావాలని, జగనన్న సీఎం కావాలనుకుంటున్నారని షర్మిల అన్నారు. కొండ్రపోల్‌లో వైఎస్ఆర్ విగ్రహానికి స్థలాన్నిచ్చిన సూర్యనారాయణ దంపతులకు షర్మిల కృతజ్ఞతలు తెలిపారు. 
Share this article :

0 comments: