యువతా... హ్యాట్పాఫ్! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » యువతా... హ్యాట్పాఫ్!

యువతా... హ్యాట్పాఫ్!

Written By news on Sunday, February 24, 2013 | 2/24/2013

Written by Srinu On 2/24/2013 7:37:00 PM    sakshi
యువతలో దూకుడు ఎక్కువయిందని, పాశ్చాత్య మోజులో కొట్టుకు పోతున్నారన్నది పెద్దోళ్ల ఫిర్యాదు. జీవితం పట్ట సీరియస్ నెస్ లేదని, ప్రతిదాన్ని తేలిగ్గా తీసుకుంటారని కూడా అప్పుడప్పుడు ఆవేదన చెందుతున్నారు. అర్థంలేని ఆవేశంతో, పట్టపగ్గాల్లేని జోష్ తో జల్సా చేయడమే తప్పా సమాజాన్ని పట్టించుకోవడం లేదన్న ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. యువతలో ఎక్కువ శాతం పెడదోవలోనే పయనిపస్తున్నారన్న వాదన ముందుతరం వారి నుంచి బలంగానే విన్పిస్తోంది. ఒక్కోసారి యువత తీరు తమకు అర్థం కావడం లేదన్నవారూ లేకపోలేదు. అయితే తమలో దూకుడుతో పాటు సాటి మనుషుల పట్ల దయ ఉందని రుజువు చేసింది హైదరాబాద్ యువత.

దిల్‌సుఖ్‌నగర్‌ జంట బాంబు పేలుళ్ల నేపథ్యంలో భాగ్యనగర యువత చూపిన తెగువ, స్ఫూర్తి ప్రశంసదాయకం. ముష్క మూకలు సాగించిన మారణకాండ సందర్భంగా యువతరం ప్రదర్శించిన సాహసం ఎనలేనిది. బాంబు పేలుళ్లతో శ్మశానంగా మారిన సంఘటనా స్థలంలోకి ధైరంగా వెళ్లి సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకున్న వైనాన్ని జాతి యావత్తు కొనియాడింది. మెరికల్లా కదులుతూ కదన రంగంలో సైనికుల వలే వారు అందించిన సేవలు వెలకట్ట లేనివి. తమ కర్తవ్యంగా భావించి వ్యవహరించి బాధితులకు బాసటగా నిలిచారు. భేష్ అనిపించుకున్నారు.

ఇక్కడితో తమ బాధ్యత తీరిపోయిందని వారు భావించలేదు. దారుణ మారణకాండలో క్షతగాత్రులయి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులు కోలుకునేందుకు తమవంతు సహకారం అందించే దిశగా ముందుకు కదిలారు. బాధితులకు రక్తం అవసరమని తెలియగానే తండోప తండాలు ఆస్పత్రులకు తరలివచ్చారు. రక్తదానం చేసేందుకు వరుసలో నిలబడి మరీ వేచిచూశారు. యువతలో ఇంత సహనం ఉందా అని పెద్దోళ్లు ఆశ్చర్యపోయేలా విధివంచితులకు దన్నుగా నిలిచి తమపై ఉన్న అపోహలను పటాపంచలు చేశారు. తమలో సామాజిక స్పృహ కొరవడలేదని చాటారు.

సెల్ ఫోన్ కబుర్లు, చాటింగ్, సినిమాలు, షికార్లు, సరదాలు-సంతోషాలు, విందులు, వినోదాలు... యువత అనగానే గుర్తుకొచ్చేవి ఇవే. దూకుడు యువతకు సహజాభరణం. ఆత్మవిశ్వాసం వారి ఆయుధం. ఎవరీ లెక్కచేయక పోవడం వారి నైజం. నచ్చిన దాని కోసం ఎంతవరకైనా వెళ్లడానికి వెనుకాడని మొండి పట్టుదల వారి సొంతం. ఇది ఒక పార్శ్వం మాత్రమేనని మరోసారి యువత రుజువు చేసింది. దారుణోదంతంతో భయపెట్టాలనుకున్న ఉగ్రరాక్షసుల ఎత్తులకు భాగ్యనగర యువత బెదరలేదు. జంట పేలుళ్లు జరిగిన వెంటనే పోలీసులతో పాటు సంఘటన స్థలంలోకి ఉరికి సహాయ కార్యక్రమాల్లో చేయందించింది. అంతేకాదు బాధితులు పూర్తిగా కోలుకునే వారు మడమ తిప్పబోమని రుజువు చేస్తూనే ఉంది. తోటివారు కష్టాల్లో ఉంటే తనవంతు సేవ చేసేందుకు తామెప్పుడూ ముందుంటామని అందరూ తెలుసుకునేలా చేసింది యువతరం.

http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=58196&Categoryid=28&subcatid=0
Share this article :

0 comments: