జగన్‌కు ప్రజలే ధ్యాస...ప్రజలకు జగనే ఆశ... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌కు ప్రజలే ధ్యాస...ప్రజలకు జగనే ఆశ...

జగన్‌కు ప్రజలే ధ్యాస...ప్రజలకు జగనే ఆశ...

Written By news on Tuesday, February 26, 2013 | 2/26/2013

ఉక్కునరాలు, ఇనుప కండరాలు గల యువత... దేశానికి అవసరమని స్వామి వివేకానంద ఆశించారు. దృఢసంకల్పం, రగిలే తపన కలిగిన యువకుడు, రాజకీయనాయకుడు, సంపూర్ణంగా ప్రజల మెప్పుపొందిన యువనేత జగన్ ఒక్కరే. మహానేత వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినప్పుడు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక అసువులు బాసిన వందలాది కుటుంబాలను ఓదార్చుతానని మాటివ్వడమే కాకుండా, ప్రతి ఇంటికీ వెళ్లి అక్కున చేర్చుకున్నారు. అది కొంతమందికి కంటగింపు అయినప్పటికీ జగన్ మాత్రం ఇచ్చిన మాట తప్పలేదు. 

అధిష్టానం తనను అణగదొక్కాలని వ్యూహాలు పన్నుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీని, పార్లమెంట్ సభ్యత్వాన్ని తృణప్రాయంగా వదిలేశారు. ఎప్పుడూ ప్రజా సమస్యలు పట్టించుకోకుండా కుట్రలు, కుతంత్రాలతో రాజకీయ పబ్బం గడుపుకునే కాంగ్రెస్ నాయకులు టీడీపీతో కలిసి కుట్రపన్ని ‘26 జీవో’ల ద్వారా దోపిడీ జరిగిందని, అందులో జగన్‌కి భాగస్వామ్యం ఉందని చెప్పి ఆయన్ని అక్రమంగా జైల్లో పెట్టించారు. కోర్టులు ‘కౌంటర్’ ఇమ్మని అడుగుతుంటే ఇప్పుడు ఆ జీవోలు సక్రమమే అంటున్నారు. ఈ జీవోలు, సాంకేతికాంశాలు ప్రజలకు అర్థం కాకపోయినా కుట్ర మాత్రం కచ్చితంగా జరిగిందని అర్థం చేసుకున్నారు. కాంగ్రెస్, టీడీపీల గోబెల్ ప్రచారాన్ని నమ్మినవారు కూడా ఇప్పుడు ఆ రెండు పార్టీలను అసహ్యించుకుంటున్నారు. 

జగన్‌ని జైల్లో పెట్టామని సంబరపడిపోకండి. ఈ మూడేళ్లలో తన కష్టాలు, ప్రజల కష్టాలు అన్నీ చూశాడు. అనుభవించాడు. మీరు ఆరోపిస్తున్నట్లుగా ఆయన జైల్లో షటిల్ ఆడటం లేదు, ఫోన్లు చేయడం లేదు, రాజకీయాలు చేయడం లేదు. గొప్ప వ్యక్తుల చరిత్రలు చదువుతున్నారు. ప్రజల కష్టాలు తీర్చే పథకాల గురించి మధనపడుతున్నాడు. ‘చే గువేరా’ లాగా ప్రజల గురించి తప్ప వేరే ధ్యాసలో లేడు. ప్రజలు కూడా గుండెనిబ్బరంతో ఉన్నారు. ప్రజల కష్టాలు తెలిసిన జగన్ త్వరలో బయటికి వస్తారు. దుష్ట నాయకులారా! ఇక మీరు కాడి దించేయండి.

- గోగుల శ్రీనివాస యాదవ్, ఉదయగిరి, నెల్లూరు


Share this article :

0 comments: