వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి?

వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి?

Written By news on Friday, February 15, 2013 | 2/15/2013

 కర్నూలు జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఎస్.వి. సుబ్బారెడ్డి త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. త్వరలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైలులో ‘ములాఖత్’లో కలుసుకోనున్నారు. ఎస్.వి. సుబ్బారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరితే రాయలసీమలో, ముఖ్యంగా కర్నూలు జిల్లాలో కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బ అని ఆ పార్టీల నాయకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన కుమార్తె భూమా శోభానాగిరెడ్డి, ఆమె భర్త, మాజీ ఎంపి భూమా నాగిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతేకాకుండా శోభ 2009లో పిఆర్‌పి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనందున శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉప ఎన్నికల్లో తిరిగి విజయం సాధించిన సంగతి తెలిసిందే. కర్నూలు జిల్లాకు చెందిన దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర రెడ్డిని పార్టీలో అందరూ ‘పెద్దాయన’గా పిలిచే వారు. అదేవిధంగా ఎస్.వి. సుబ్బారెడ్డికి కూడా జిల్లాలో ‘పెద్దాయన’గా గుర్తింపు ఉంది. గతంలో కోట్ల విజయభాస్కర రెడ్డిపై పోటీ చేసేందుకు సమవుజ్జీ ఎవరూ లేరని భావించిన టిడిపి నాయకత్వం సుబ్బారెడ్డిని పోటీకి దింపింది. కాగా వైఎస్ హయాంలో ఎస్‌వి టిడిపికి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు.
కర్నూలు లోక్‌సభకు..!
ఇలాఉండగా త్వరలో ఎస్.వి. సుబ్బారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలియగానే, కర్నూలు లోక్‌సభకు ఆయనను పోటీకి దించే అవకాశాలూ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కర్నూలు లోక్‌సభకు కాంగ్రెస్ తరఫున కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, టిడిపి తరఫున మాజీ ఎంపి కె.ఇ. కృష్ణమూర్తి పోటీ చేస్తారు కాబట్టి వారిని ఎదుర్కొవాలంటే ఎస్‌వితోనే సాధ్యమని నాయకులు అంటున్నారు


http://www.andhrabhoomi.net/content/ysr-congress-1
Share this article :

0 comments: