నేటి షర్మిల పాదయాత్ర సాగుతుందిలా... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » నేటి షర్మిల పాదయాత్ర సాగుతుందిలా...

నేటి షర్మిల పాదయాత్ర సాగుతుందిలా...

Written By news on Monday, February 25, 2013 | 2/25/2013

మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, జననేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర సోమవారం గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో సాగనుందని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, టూర్ ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. 

గురజాల నియోజకవర్గంలో బసచేసిన ప్రాంతంనుంచి కిలోమీటరు దూరంలోగల తక్కెళ్లపాడుకు చేరుకుంటారని తెలిపారు. అక్కడినుంచి నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారన్నారు. అనంతరం మాచర్ల నియోజకవర్గం కాచవరం, ఇనపరాజుపల్లి, గాదెవారిపల్లి మీదుగా రాత్రి బస ప్రాంతానికి చేరుకుంటారని పేర్కొన్నారు.

పర్యటించే గ్రామాలు: గురజాల నియోజకవర్గంలోని తక్కెళ్లపాడు, మాచర్ల నియోజకవర్గంలోని కాచవరం, ఇనపరాజుపల్లి, గాదిరాజుపల్లి
Share this article :

0 comments: