చంద్రబాబుపై రౌడీషీట్‌ తెరవాలి: - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబుపై రౌడీషీట్‌ తెరవాలి:

చంద్రబాబుపై రౌడీషీట్‌ తెరవాలి:

Written By news on Tuesday, February 12, 2013 | 2/12/2013

హైదరాబాద్: ‘సాక్షి’పత్రిక గుంటూరు నగర కార్యాలయంపై దాడికి ప్రోత్సహించిన టీడీపీ అధినేత చంద్రబాబుపై తక్షణమే రౌడీషీట్‌ తెరవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. చంద్రబాబుపై వెంటనే చర్య తీసుకోవాలని తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసులను కోరారు. టీడీపీ శ్రేణుల్ని రెచ్చగొట్టి చంద్రబాబు ఇదంతా చేయించారని ఆరోపించారు. బజారు రౌడీ స్థాయికి దిగజారారని దుయ్యబట్టారు.

‘సాక్షి'పై దాడిని చంద్రబాబు ఖండించకపోవడాన్ని అంబటి తప్పుబట్టారు. వంగవీటి హత్య తర్వాత ఈనాడుపై దాడి జరిగితే చంద్రబాబు ఎలా స్పందించారు, మార్గదర్శిపై విచారణ జరిగితే పత్రికాస్వేచ్ఛపై దాడి జరిగిందని చంద్రబాబు మాట్లాడలేదా అంటూ ప్రశ్నించారు. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 9 ఏళ్లు ప్రతిపక్షనేతగా ఉన్న వ్యక్తి వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అంటూ నిలదీశారు. నీచమైన పనులు మానుకోవాలని హితవు పలికారు. ఆత్మవిమర్శ చేసుకోవాలని చంద్రబాబుకు అంబటి రాంబాబు సూచించారు
Share this article :

0 comments: