ఆ పార్టీనే ప్రజలు బహిష్కరించారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆ పార్టీనే ప్రజలు బహిష్కరించారు

ఆ పార్టీనే ప్రజలు బహిష్కరించారు

Written By news on Saturday, February 2, 2013 | 2/02/2013


కాంగ్రెస్ మునిగిపోయే నావ
‘‘నేను ఏడాదిన్నర క్రితమే కాంగ్రెస్‌కు రాజీనామా చేశా. పేదల కోసం అహర్నిశలూ శ్రమించిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, జననేత జగన్‌మోహన్‌రెడ్డిల కోసం వైఎస్సార్ కాంగ్రెస్‌లో కొనసాగుతున్నా. త్వరలోనే పెద్దసంఖ్యలో ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వైఎస్సార్ సీపీలో చేరతారు. ఈ ప్రభుత్వం మనుగడ కొద్దిరోజులు మాత్రమే. కాంగ్రెస్ మునిగిపోయే నావ. ఈసారి బడ్జెట్ ఆమోదం పొందే పరిస్థితి కూడా ఉండదు. ప్రభుత్వ విప్ నాని కూడా ఆ పార్టీని విడిచిపెట్టారం టే పాలకులు సిగ్గుపడాల్సిన విషయం. ప్రస్తుతం ఉన్నవారు కూడా అధికారం చూసి మాత్రమే. సహకార ఎన్నికల్లో కాం గ్రెస్, టీడీపీలు చీకటి రాజకీయాన్ని ప్రజలు గమనిస్తున్నారు’’.
- బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, దర్శి ఎమ్మెల్యే 

ఆ పార్టీనే ప్రజలు బహిష్కరించారు
‘‘కాంగ్రెస్ పార్టీ నన్ను బహిష్కరించడమేమిటి? నేనెప్పుడో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాను. ఇప్పుడు కొత్తగా బాధపడేదేమీ లేదు. నేను వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానిని. సహకార ఎన్నికల్లో టీడీపీతో కుమ్మక్కైన కాంగ్రెస్‌ను ప్రజలు ఎప్పుడో బహిష్కరించారు. సహకార ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు గెలిచే చోట్ల స్టేలు తేవడం ఎవరికి తెలియని విషయం. కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయి. ముందు ఆ పార్టీలోని వారి భవితవ్యం చూసుకోవాలి’’.
- గొట్టిపాటి రవికుమార్, అద్దంకి ఎమ్మెల్యే 


ఎనిమిది నెలల కిందటే రాజీనామా చేశా
‘‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ప్రభుత్వం నీరుగార్చడంతోపాటూ ప్రజాభిమానం ఉన్న నాయకుడు వైఎస్ జగన్‌మోహనరెడ్డిని వేధింపులకు గురిచేయడాన్ని తట్టుకోలేక ఎనిమిది నెలల కిందటే రాజీనామా సమర్పించా. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తే తీరిగ్గా ఇప్పుడు బహిష్కరించామనడం హాస్యాస్పదంగా ఉంది. వైఎస్ కుటుంబంపై కక్ష సాధింపుతోపాటు ప్రజావ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నా. సహకార ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. ఏం చేయాలో పాలుపోక ఈ అంశాన్ని ఇప్పుడు 
తెర మీదకు తెచ్చారు.
- సుజయ్‌కృష్ణ రంగారావు, బొబ్బిలి ఎమ్మెల్యే 

వారిది మానసిక ఆనందం
‘‘కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడో రాజీనామా చేశా. ఇప్పుడు వారు నన్ను పార్టీ నుంచి బహిష్కరించిమానసిక ఆనందం పొందుతున్నారు. జనాభీష్టానికి అనుగుణంగా వైఎస్ కుటుంబానికి బాసటగా నిలిచేందుకు కాంగ్రెస్‌కు, విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు గత నెల 24నే ప్రకటించా. ఇప్పుడు తీరుబడిగా నన్ను బహిష్కరిస్తున్నట్టు చెప్పటం కాంగ్రెస్ నేతలు మానసిక ఆనందానికే తప్ప మరొకటి కాదు. నేను కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఎటువంటి పొరపాట్లు చేయలేదు. నమ్మిన సిద్ధాంతం కోసమే ధైర్యంగా కాంగ్రెస్‌కు రాజీనామా చేశా. వైఎస్ ఆశయసాధన కోసం జగన్‌మోహన్‌రెడ్డి వెంట ఉంటా’’.
- పేర్ని నాని, మచిలీపట్నం ఎమ్మెల్యే
Share this article :

0 comments: