జగన్ ముఖ్యమంత్రి అవడం తప్పా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ ముఖ్యమంత్రి అవడం తప్పా?

జగన్ ముఖ్యమంత్రి అవడం తప్పా?

Written By news on Tuesday, February 5, 2013 | 2/05/2013


సీబీఐకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వైఎస్సార్ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని భావిస్తే, వై.ఎస్. ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు, వారితో పనిచేసిన ఐఏఎస్ అధికారులు, ఆరోపణలున్న అప్పటి కలెక్టర్లు... ఇలా అధికార భోగాలను అనుభవించిన ప్రతిఒక్కరినీ విచారించాలి. వీళ్లందరినీ విచారించగలిగే దమ్ము, ధైర్యం సీబీఐకి ఉంటే, అప్పుడు మాత్రమే వై.ఎస్.జగన్‌ను విచారించాలి.

అంతేకాకుండా వాయిస్ ఆఫ్ వైఎస్సార్‌గా వ్యవహరించి, అధికార హోదాలు సమస్తం అనుభవించిన సలహాదారులను, కీలకపాత్ర పోషించిన కేవీపీని, తామే లేకపోతే ఆ గొప్ప పథకాలు లేవని పలుమార్లు గొప్పలు చెప్పుకున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘువీరారెడ్డి, బొత్స... వీరందరినీ నిష్పక్షపాతంగా విచారించి, అప్పుడు మాత్రమే ఏనాడూ సచివాలయానికి రాని, ఏనాడూ పనుల నిమిత్తం మంత్రులను, ఐఏఎస్‌లను ఇప్పటివారి వలె ఫోన్‌లో సైతం ఒత్తిడి చేయని జగన్‌ను విచారించాలి. ఇవన్నీ సీబీఐకి తెలిసి కూడా ఒకే ఒక్కడిపై గురిపెట్టి ప్రజల ముందు ‘దోషి’గా నిలబెట్టడానికి శతథా ప్రయత్నిస్తోంది.

ఏమాత్రం కనీస రాజకీయ అనుభవం లేని రాజీవ్‌గాంధీ, తల్లి మరణానంతరం ఏకంగా ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించగా లేనిది, ఆయన కన్నా మిన్నగా, అప్పటికే జనబాహుళ్యంలో ప్రాచుర్యం పొందిన జగన్ సీఎం కావడానికి సోనియాకు గల ఇబ్బందేమిటో తెలియదు. ఇక జగన్ సీఎం కావడం ఖాయం అనుకుని బొత్స, రఘువీరా, దానం, ఆనంలు ఆనాడు చేసిన హంగామా, ఇప్పుడు వై.ఎస్. పట్ల వారు వ్యవహరిస్తున్న తీరులన్నీ ప్రజలు గమనిస్తున్నారని తెలుసుకోవాలి. ఇక చేవెళ్ల చెల్లెమ్మ, వై.ఎస్. కుటుంబ ద్రోహి గురించి ఆయన అభిమానులు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో!

ఇంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం జగన్‌పై కుట్రలు, వ్యూహాలు పన్నుతున్నారు. కానీ ప్రజల అండ ఉన్న జగన్‌ను, ఆయన కుటుంబాన్ని ఇంతకుమించి ఏమీ చేయలేరు. వచ్చే రోజులన్నీ మంచిరోజులే. తొందరలోనే జగన్‌కు బెయిల్ వస్తుంది. కాంగ్రెస్ కళ్లు తెరుచుకుంటాయి.

- ధర్మ, ఊరిపేరు రాయలేదు

జనంలోనే జగన్ ఉన్నారని మరిచారు!

జగన్‌ను మేము ఇంతవరకు ప్రత్యక్షంగా చూడలేదు. అయినా జగన్ కుటుంబ సభ్యులందరూ అంటే మాకెంతో ప్రేమ. వైయస్ రాజశేఖరరెడ్డిగారి ద్వారా లబ్ధిపొందినవారికి, పదవులు పొందినవారికి వీరి కుటుంబంపై కనికరం లేదు. అశాశ్వతమైన పదవులే శాశ్వతమనుకుని జగన్ కుటుంబంపై కుట్రాస్త్రాలు ప్రయోగిస్తున్నారు. వయసులో వీరందరికంటే చిన్నవాడైన జగన్ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారు. దీనికితోడు రెండు ప్రధాన పార్టీలు కుమ్మక్కై ప్రతి వాయిదారోజూ బెయిల్ రాకుండా ఏదోఒక కుట్రను న్యాయస్థానం ముందుంచి అడ్డుకుంటున్నారు.

దీనివెనుక ఢిల్లీపెద్దల పాత్ర వుందని సామాన్య ప్రజలకు కూడా అర్థమైంది. ఇదే పరిస్థితి మీ బిడ్డలకు వచ్చి ఉంటే ఇదే న్యాయానికి మీరు కట్టుబడి ఉండేవారా? జగన్‌ను విచారణ పేరుతో నమ్మించి మోసం చేశారు. కానీ జగన్‌తోనే జనం ఉన్నారని, జనంలోనే జగన్ ఉన్నారని మరిచారు. ప్రజల ఆశీస్సులతో జగన్ జనం మధ్యలోకి అతిత్వరలో వచ్చి, అందరికీ బాసటగా నిలబడతారు. దీనికోసమే ఎదురుచూస్తున్నాం...

- కె. కళావతి, సిటిఎం మదనపల్లి (మం), చిత్తూరు జిల్లా
Share this article :

0 comments: