ఏం పెద్దయ్యా ఫించన్ వస్తుందా..?! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఏం పెద్దయ్యా ఫించన్ వస్తుందా..?!

ఏం పెద్దయ్యా ఫించన్ వస్తుందా..?!

Written By news on Friday, February 8, 2013 | 2/08/2013

 రచ్చబండ కార్యక్రమంలో ప్రజలతో షర్మిల-ప్రజల మధ్య సాగిన సంభాషణ..
షర్మిల: నమస్తే అమ్మా.. నమస్తే అయ్యా! బాగున్నారా.. ఏం పెద్దయ్యా ఫించన్ వస్తుందా..?!
అంజయ్య : అమ్మా! నాకు చేతగాకుంటా అయింది. పింఛన్ వస్తలేదు. ఎన్నోసార్లు దరఖాస్తు పెట్టుకున్నా ఇప్పటిదాకా నాకు పింఛన్ రాలేదు. చేతగానోడ్ని నాలాంటోళ్లకు రాకుంటే ఎవరికొస్తదమ్మా పింఛన్..
షర్మిల: ఇలావుందండీ మన ప్రభుత్వ దుస్థితి. 60ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి వృద్ధాప్య పింఛన్ కింద నెలకు రూ.200 ఇవ్వాలని నిర్ణయించుకుని రాజశేఖరరెడ్డి దాన్ని అమలు పరిచారు. ప్రస్తుత ప్రభుత్వం వాటిని తుంగలో తొక్కి అర్హులైన వారికి కూడా ఫించన్లు ఇవ్వకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. భవిష్యత్‌లో జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయినాక పింఛన్లను రూ.300కు పెంచుతాం. 

షర్మిల: ఏ అమ్మా! ఇళ్లు కట్టుకున్నారా..!
ఒంగూరి మల్లమ్మ: ఇళ్లులేదు.. ఏంలేదు తల్లీ..! ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుందామని చాలాసార్లు అధికారులకు దరఖాస్తు పెట్టుకున్నా. ఇ ళ్లు ఇవ్వలేదు. చిన్నపాటి ఇంట్లోనే ఉంటున్నాం.

షర్మిల: ప్రతి పేదోడికి సొంతింటికల సాకారానికి రాజశేఖరరెడ్డి ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడితే.. ప్రభుత్వం ఇళ్లులేని ఒంగూరి మల్లమ్మలాంటి వారికి కూడా ఇళ్లు నిర్మించేందుకు సానుకూలంగా లేదు. ఆసలు ఈ ప్రభుత్వం ఉండి ఏం ప్రయోజనం. 

షర్మిల: ఏంటన్నా.. అలా వున్నావ్.. ఇతరుల సహాయం తీసుకుని నిలబడుతున్నావ్ సరిగా నిలబడరాదా..?
దాసల రాములు: నాకు కాలుచేయి పనిచేయవమ్మా..! ఇలా ఇంకొకరి సహాయం తీసుకుని నిలబడాల్సిందే. కాలు, చేయి పనిచేయక అవస్త పడుతున్నా. పేదోన్ని.. కూలీచేసుకునేవాడ్ని ఇదివరకు. ఇలా ఒక్కసారిగా పరిస్థితి రావడంతో కుటుంబ పరిస్థితి ఆందళన కరంగామారింది.. ఫించను రావడంలేదు. 

షర్మిల: కాలు చేయి పనిచేయక రాములన్న లాంటివారెందరో అవస్తలు పడుతుంటే వికలాంగ ఫించను రాకపోవడం దారుణం. చేతగాని ప్రభుత్వానికి నిదర్శనం. కుర్చీల కోసం కుమ్ములాడుకునే ప్రభుత్వం ఇలాంటి పేదల పరిస్థితి ఎందుకు పట్టించుకోదు.. త్వరలో మనకు మంచిరోజులు వస్తాయి.. వికలాంగుల ఫించన్లు ఇప్పుడున్నదానికంటే రెట్టింపుచేసి ఇస్తాం. 

షర్మిల: అమ్మా! ఏంచేస్తారు...
మామిడికాయల జయమ్మ: కూలి పనిచేస్తాను తల్లీ.. వచ్చిన డబ్బులు తినడానికే సరిపోతాయి. లోన్లు ఇస్తమని ప్రభుత్వం చెప్తున్నరు.. కానీ ఆ లోన్లు ఎవరికి వస్తున్నయో ఏమో.. నాకైతే రాలేదు.. 
షర్మిల: మహిళలకు వడ్డీలేని రుణాలు ఇచ్చిన ఘనత రాజశేఖరరెడ్డిది. ఇప్పటి ప్రభుత్వం మాత్రం అర్హులైన వారికి కూడా రుణాలివ్వడంలేదు. త్వరలో రాజన్న రాజ్యంలో జగనన్నపాలనలో ఒక మహిళలకే కాదు అన్ని వర్గాలవారికి వడ్డీలేని రుణాలు ఇస్తుంది.. 

ఇలా ఆగపల్లి ప్రజలతో రచ్చబండద్వారా సమస్యల్ని అడిగి తెలుసుకున్న షర్మిల తిరిగి పాదయాత్రను కొనసాగించారు.. 
Share this article :

0 comments: