స్వాధీనం చేసుకుంది టీడీపీ హయాంలోనే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » స్వాధీనం చేసుకుంది టీడీపీ హయాంలోనే

స్వాధీనం చేసుకుంది టీడీపీ హయాంలోనే

Written By news on Tuesday, February 19, 2013 | 2/19/2013

స్వాధీనం చేసుకుంది టీడీపీ హయాంలోనే 
బ్రదర్‌పై విమర్శలు సమస్యను పక్కదారి పట్టించేందుకే
పొలిటికల్ స్టంట్‌పై మండిపడుతున్న స్థానికులు
పోకల్‌వాడ భూముల కోసం ఆందోళనకు సన్నాహాలు 

‘‘అనాదిగా మేం సాగుచేసుకుంటున్న భూములను 1986లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అకస్మాత్తుగా లాక్కుని మమ్మల్ని దిక్కులేని వారిని చేసింది. న్యాయం చేయమని కోరిన పాపానికి పోలీసు కేసులు పెట్టించి వేధించింది. పేదలను ఆదుకోవాల్సిన సర్కారే ఉన్న ఆధారాన్ని కూడా ఊడ్చేసింది. మేం ఎవరికి చెప్పుకోవాలి ? ఇక మాకు దిక్కెవరు..?’’ అంటూ మణికొండ భూ భాధితులు వాపోతున్నారు. మణికొండ మాజీ సర్పంచ్ యాలాల నరేష్ ఆధ్వర్యంలో బాధితులు సోమవారం సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఇప్పటికైనా సర్కార్ తమకు న్యాయం చేయాలి, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించా రు. ఈ సందర్భంగా యాలాల నరేష్ మాట్లాడుతూ... రాజేంద్రనగర్ మండలం మణికొండ పరిధిలోని పోకల్‌వాడలో సర్వే నం.4లో సుమారు 54 ఎకరాల ప్రభుత్వ భూమిలో పోకల్‌వాడ గ్రామానికి చెందిన 18 మంది దళితులతో పాటు రాయదుర్గం, షేక్‌పేట్‌కు చెందిన 29 మంది పేదలు సాగుచే సుకొంటూ జీవనం సాగించారని చెప్పారు. 

అయితే 1986లో అప్పటి ప్రభుత్వం ఆ భూమిని నోటిఫై చేసి, బలవంతంగా స్వాధీనం చేసుకుని హుడా పరిధిలోకి తెచ్చిందని తెలిపారు. ‘‘మొత్తం భూమిలో ఏడెకరాలు నిరుపేదలకు ఇంటిస్థలాల కోసం కేటాయించగా, మరో 30 ఎకరాలను అప్పటి హుడాకు అప్పగించింది. దీంతో వారు లేఅవుట్‌ను అభివృద్ధి చేశారు. ఇదే భూమిలో 8 ఎకరాలను ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు విక్రయించగా, మరో నాలుగు ఎకరాలు జీసస్ నజ్రత్ మినిస్ట్రీస్ సంస్థకు 2006లో 33 ఏళ్ల పాటు లీజుకిచ్చింది’’ అని వివరించారు. వాస్తవాలిలా ఉండగా... దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ దళితులనుంచి భూములు లాక్కుని కబ్జాచేసి అక్రమంగా చర్చి నిర్మించారని వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆరోపించడం సమస్యను పక్కదోవ పట్టించేందుకేనని ఆయన దుయ్యబట్టారు. తమను బలిపశువుల్ని చేసి మళ్లీ రాజకీయ డ్రామాలు ఆడుతున్నారంటూ బాధితులు మండిపడ్డారు.

దొంగ కేసులు పెట్టారు
దిమ్మలు కూలగొట్టారని మాపై దొంగకేసులు పెట్టారు. అన్యాయంగా కేసులు బనాయించారని కోర్టు కూడా మా వైపే తీర్పు చెప్పింది. పోలీసుల్ని పెట్టించి మరీ ఎన్టీఆర్ మా భూముల్ని హుడాకు ఇచ్చారు. ఇది అన్యాయం అని పోరాడిన వాళ్లందరూ చనిపోయారు. నేను ఒక్కడ్నే బతికున్నా.
- లింగమయ్య, స్థానికుడు

మా భర్తలను పోలీస్ స్టేషన్‌లో వేశారు
1986లో ఎన్టీఆర్ హయాంలో మా భూమిని దౌర్జన్యంగా లాక్కున్నారు. అదేమిటని అడ్డుపడిన మా భర్తలను పోలీస్ స్టేషన్‌లో వేశారు. సరే కనీసం భూమి తీసుకొని క్వార్టర్స్ ఇస్తారు అనుకున్నాం. కానీ ఇవ్వలేదు. న్యాయం కోసం ఎంతమందిని కలిసినా లాభం లేకుండా పోయింది.
-భారతమ్మ, స్థానికురాలు

సతాయిస్తున్నారు 
పోలీసుల చేత మమ్మల్ని చితక్కొట్టించి మరీ మా భూముల్ని లాక్కున్నారు. మీరైనా కాపాడండి అని హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని చాలాసార్లు కలిశాం. ఇస్తాం చేస్తాం అని తిప్పించుకుంటుంది తప్ప ఇప్పటివరకు చేసిందేమీ లేదు.
-వీరమ్మ, స్థానికురాలు

పచ్చని పొలాల్ని లాక్కున్నారు..
జొన్నలు, వరి పండించే వాళ్లం. పచ్చని పొలాల్ని పోలీసులను పెట్టించి మరీ ఎన్టీఆర్ హయాంలో లాక్కొని హుడాకు ఇచ్చారు. అడ్డొచ్చిన మా భర్తల్ని దర్గా టౌన్, నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లలో వేశారు. నా భర్త చనిపోయాడు. ఇప్పటివరకూ న్యాయం చేయలేదు. పొలం లేదు. ఇల్లు లేదు అన్నీ పోయాయి.
-జంగమ్మ, స్థానికులు
Share this article :

0 comments: