ఇది అప్రజాస్వామికం కాదా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇది అప్రజాస్వామికం కాదా?

ఇది అప్రజాస్వామికం కాదా?

Written By news on Friday, February 8, 2013 | 2/08/2013

మేడమ్ సోనియాగారూ! అధికారం హాలాహలమని తెలిసి కూడా తమ ఒక్కగానొక్క కుమారుడిని దేశంలోని అత్యున్నత అధికార స్థానంలో ఎందుకు కూర్చోబెట్టాలని తాపత్రయపడుతున్నారు? నూట పదికోట్ల జనాభాలో యోగ్యత కలిగిన ఎవరూ లేరనా? తమరి తనయుడు భావి భారత ప్రధాని అని ఊహకు రాగానే మనసు ఉప్పొంగి ఆనందబాష్పాలను అణచుకోలేకపోయారు. మీ భర్తగారి హఠాన్మరణం తర్వాత మీకు అసలు రాజకీయాలు అక్కర్లేదని ఇంట్లో కూర్చున్నారు. ఎప్పుడైతే అధికారపు కుర్చీలో కూర్చున్నారో ఆ అధికార దాహం ఎక్కువై, దాని దరిదాపునకు కూడా ఎవరినీ రానివ్వడం లేదు. అర్హత కలిగినవారిని అడ్డు తొలగించుకోవడం, వంగి వంగి దండాలు పెట్టేవారిని అందలమెక్కించటం, ఆ వెనకాల నుండి అధికారం చెలాయించడం మొదలుపెట్టారు. ఇది అప్రజాస్వామికం కాదా? 

రాజకీయాల్లో యువతకు సముచిత పాత్రనివ్వాలని రాహుల్‌గాంధీ అన్నారు. మంచిదే. అయితే యువత అంటే ఆయన ఒక్కరేనా? జగన్ కాదా? యువతను అకారణంగా జైల్లో పెట్టించి, రాహుల్ ప్రధానమంత్రి ఎలా అవుతారు? ఒక మాజీ ప్రధానమంత్రి కొడుకు ప్రధానమంత్రి అయితే, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి కాకూడదా? ముఖ్యమంత్రిని చేయటానికి 156 మంది ఎమ్మెల్యేలు సరిపోరా? ఇదేమి ప్రజాస్వామ్యం? దేశానికి రాజీవ్‌గాంధీగారెంతో, రాష్ట్రానికి వైఎస్సార్ కూడా అంతే కదా! అసలు జగన్ చేసిన ఆర్థిక నేరాలేమైనా రుజువు చేశారా? అధికారం ఉన్నదని అన్యాయంగా జైల్లో పెట్టించడమేనా? జగన్‌కు జరిగిన అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ గమనిస్తూనే ఉన్నారు. 2014 ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు.

- కె.బి.పాల్, అంబర్‌పేట, హైదరాబాద్

ప్రజల దీవెనలు ఫలిస్తాయి 

ఆనాడు వైఎస్సార్‌ను చూసి కాంగ్రెస్‌కు ఓటు వేశారు కాని, ఆ పార్టీలో ఉన్న పెద్దలను చూసి కాదు. అందుకే నేడు ఆయన తనయుడిని ఇబ్బంది పెడుతుంటే చూసి ప్రతి ఒక్కరూ ఆ పార్టీని అసహ్యించుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకులంతా జగన్‌ని అణగదొక్కటానికే తమ శక్తి సామర్ధ్యాలను వినియోగిస్తున్నారు కాని, ప్రజల సమస్యలను పరిష్కరించటానికి ఏమాత్రం కృషి చేయటం లేదు. వాస్తవానికి వైఎస్సార్ చనిపోయినప్పుడే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చనిపోయింది. వైఎస్సార్ ద్వారా గెలిచిన ఈ ఎమ్మెల్యేలు, అప్పుడే సోనియాని ఎదిరించి జగన్‌ని సీఎంగా ఎన్నుకున్నట్లయితే, మన రాష్ట్రం ఇంత అథోగతిపాలై ఉండేది కాదు.

వై.ఎస్. తర్వాత అంతటి నాయకుడు జగన్ మాత్రమే. అతడు ధీశాలి. పురుషోత్తముడు అలెగ్జాండర్‌ను ఎదిరించినట్లు, సోనియాను ఎదిరించి ధైర్యంగా పదికోట్ల ఆంధ్రుల ప్రతినిధిగా నిలబడ్డాడు. కానీ కాంగ్రెస్‌ను ఆగర్భశత్రువుగా భావించే పార్టీకి అధినేత అయిన చంద్రబాబు మాత్రం అవిశ్వాస తీర్మానం పెట్టడం లేదు. ఆనాడు అంబి అనే రాజు అలెగ్జాండర్‌కు లోబడి, తన రాజ్యాన్ని స్వచ్ఛందంగా ఇచ్చివేసినట్లున్నది బాబు గారి తీరు. అటు కాంగ్రెస్, ఇటు ‘దేశం’... రెండూ ప్రజాసమస్యలను విస్మరించిన ప్రస్తుత తరుణంలో ప్రజలకు కనిపిస్తున్న ఏకైక ప్రత్యామ్నాయం జగన్ మాత్రమేనన్నది జగమెరిగిన సత్యం. 

జగన్ ముఖ్యమంత్రి అవుతారు. ఈ రాష్ట్ర ప్రజలకు కడగండ్లు తీరుస్తారు. అధికారం ఉందనిచెప్పి నిరంకుశత్వంతో వ్యక్తులను నిర్బంధించవచ్చు కాని వ్యక్తులు నమ్ముకున్న సిద్ధాంతాన్ని ఏ శక్తీ ఏమీ చేయలేదు. నాకు తెలిసినంతవరకు వైఎస్సార్ కుటుంబానికి ఒకే ఒక సిద్ధాంతముంది. అది ‘ప్రజలందరికీ మేలు చేయటం’. ప్రజల శ్రేయస్సే వారి సిద్ధాంతం. అదే వారి ఆశయం. ఆ ఆశయ సాధనకై వెళుతూ చనిపోయిన రాజన్న కుటుంబంపై ఎల్లప్పుడూ ప్రజల దీవెన ఉంటుంది. వారి దీవెనలు ఫలించి జగన్ త్వరలోనే బయటికి వస్తారు.

- కె.షేతు, కరీంనగర్

 చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.
e-mail: ysjagankosam@gmail.com
Share this article :

0 comments: