‘ఆరు నెలలు ఓపిక పడితే రాజన్న రాజ్యం’ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » ‘ఆరు నెలలు ఓపిక పడితే రాజన్న రాజ్యం’

‘ఆరు నెలలు ఓపిక పడితే రాజన్న రాజ్యం’

Written By news on Wednesday, February 13, 2013 | 2/13/2013

ఆరు నెలలు ఓపిక పడితే రాజన్న రాజ్యం వస్తుందని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల యాచారం గ్రామస్తులకుబుధవారం భరోసా ఇచ్చారు. మరో ప్రజాప్రస్థానంలో భాగంగా ఆమె చేపట్టిన పాదయాత్ర 65వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా యాచారంలో ఆమె రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలను షర్మిలకు విన్నవించారు. పక్కనే నాగార్జున సాగర్ డ్యామ్ ఉన్నా ప్రజలకు నీరందించలేని దుస్థితిలో సర్కారు ఉందన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ కూలీల శ్రమను దోపిడీ చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్, టీడీపీలకు గట్టిగా బుద్ధి చెప్పకుంటే పరిస్థితులు ఇలానే కొనసాగుతాయని అన్నారు. కిరణ్ పాలన చంద్రబాబు పాలనను తలపిస్తోందని షర్మిల ఎద్దేవా చేశారు. 
Share this article :

0 comments: