తొమ్మిదేళ్లు సాగిన ‘మాయల ఫకీరు’ పరిపాలనలో అగ్రవర్ణ పేదలను ఎవరైనా గుర్తించారా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తొమ్మిదేళ్లు సాగిన ‘మాయల ఫకీరు’ పరిపాలనలో అగ్రవర్ణ పేదలను ఎవరైనా గుర్తించారా?

తొమ్మిదేళ్లు సాగిన ‘మాయల ఫకీరు’ పరిపాలనలో అగ్రవర్ణ పేదలను ఎవరైనా గుర్తించారా?

Written By news on Saturday, February 2, 2013 | 2/02/2013

జగన్ ఆస్తులకేసులో న్యాయస్థానాల తీర్పు ఎలా ఉన్నా, ప్రజాకోర్టులో జగన్ నిర్దోషని, నిరంతరం ప్రజల మధ్యన ఉండి ప్రజల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు పాటుపడే ఏకైక ప్రజానాయకుడు ఈ సమకాలీన రాజకీయాల్లో జగన్ ఒక్కడేననీ గత ఉపఎన్నికల్లో మూడు ప్రాంతాల ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. జగన్ జనంలో ఉన్నా, జైల్లో ఉన్నా ప్రజాదరణ, అభిమానం పెరుగుతాయే గాని తరగవని చెప్పటానికి నిదర్శనం ఆయన పార్టీలోకి గోదావరి వరదలా పెరుగుతున్న వలసలే. ప్రాంతాలు, కులాలు, మతాలు, పార్టీలు, వయోభేదాలు లేకుండా రాజకీయాల్లో తలపండిన కురువృద్ధులు సైతం నిస్వార్థంగా వైఎస్సార్‌సీపీలో చేరటం చూస్తుంటే... జగన్ ఒక వ్యక్తి మాత్రమే కాదు గొప్పశక్తి అని అర్థమౌతోంది.

ఒకటి మాత్రం వాస్తవం. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజలందరూ వైఎస్సార్‌సీపీని అఖండ మెజార్టీతో గెలిపించి, యువనేత జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుని, మళ్లీ రాజశేఖరరెడ్డి స్వర్ణయుగాన్ని పునరావృతం చేసుకుంటారు. అందులో సందేహం లేదు. 

- శీలం నర్సిరెడ్డి, హైదరాబాద్

‘పెద్దాయన’కు ప్రతిరూపం జగన్‌బాబు

మనలో మనుధర్మం ఎందరికి తెలుసు? ప్రపంచానికి ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు ఒకదేశాన్ని బలిచ్చి అయినా ప్రపంచాన్ని కాపాడుకోవాలి అన్నాడు మనువు. అదే ఒక దేశాన్ని కాపాడుకోవటానికి ఒక రాష్ట్రాన్ని, ఒక రాష్ట్రం కోసం ఒక గ్రామాన్ని, ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని, ఒక కుటుంబం కోసం తన ఆర్థిక, సామాజిక స్థాయిని కాపాడుకోవటానికి కుటుంబంలోని ఒక వ్యక్తిని కోల్పోయినా తప్పు లేదన్నదే మనుధర్మం. దానికి ఉదాహరణగా పాండవులు విడిది చేసిన ఏకచక్రపురంలోని ప్రతి కుటుంబం నుండి ప్రతిరోజు ఒక మనిషిని బకాసురునికి ఆహారంగా పంపడాన్ని చెప్పుకోవచ్చు. ఆ ‘మను ధర్మాన్నే’ తిరగరాశాడు మన పెద్దాయన. ఏ కుటుంబం కూడా తన స్థాయిని కోల్పోనవసరం లేదన్నాడు. దురదృష్టం వెంటాడి ఆ కుటుంబంలోని ఏ వ్యక్తికైనా ప్రాణాంతక వ్యాధి వస్తే, ఆ కుటుంబం తన పూర్తి ఆర్థిక స్థాయిని ఫణంగా పెట్టి వైద్యం చేయించుకోనవసరం లేదు, ఆ బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనన్నాడు ఆయన. ఆ కుటుంబంలోని పిల్లలను ఆస్తులు కుదవపెట్టి, ఉన్న కొద్దిపాటి పొలాలు అమ్మేసి చదివించాల్సిన పని లేదన్నాడాయన. ఆ బాధ్యత కూడా ప్రభుత్వానిదేనన్నాడు. 

2004కి ముందు తొమ్మిదేళ్లు సాగిన ‘మాయల ఫకీరు’ పరిపాలనలో అగ్రవర్ణ పేదలను ఎవరైనా గుర్తించారా? ఒక్క ‘పెద్దాయన’కే ఆ బాధితులు కనబడ్డారు. కాలం కలిసి రాక నిరుపేదలైన ఈ అగ్రవర్ణ పేదల ఇంట ‘పెద్దాయన’ దయతో ప్రయోజకులైన నేటి యువతకు ఎవరేమిటో, ఎవరేమి చేశారో పూర్తిగా తెలుసు. ప్రస్తుత అధికార, ప్రధాన ప్రతిపక్షాల ‘కృతఘ్నత’ గురించి, ప్రేమించడం మాత్రమే తెలిసిన ‘పెద్దాయన’ గురించి ఈ పసివాళ్లు తమ తరువాతి పది తరాలకు కథలు కథలుగా చేరవేస్తారు. ఇప్పటికే వీరంతా ‘జగన్‌బాబు’లో తమ ‘పెద్దాయన’ను చూసుకుంటున్నారు. 

నిశ్శబ్దకెరటం ‘ఢీ’కొట్టబోయే సమయం దగ్గరలోనే ఉంది. ఒడ్డున ఉన్న పీత బొక్కల్లోకి ఎన్నెన్ని పెద్ద తలలు, తలదాచుకోవడానికి పోబోతున్నాయో మనమందరం త్వరలో చూడబోతున్నాం.

- ఎ.వి.మహేంద్ర ప్రసాద్, సికింద్రాబాద్

 చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.
e-mail: ysjagankosam@gmail.com
Share this article :

0 comments: