కాంగ్రెస్ పెద్దలు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేదాకా చంద్రబాబు అవిశ్వాసం పెట్టరని .. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్ పెద్దలు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేదాకా చంద్రబాబు అవిశ్వాసం పెట్టరని ..

కాంగ్రెస్ పెద్దలు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేదాకా చంద్రబాబు అవిశ్వాసం పెట్టరని ..

Written By news on Thursday, February 21, 2013 | 2/21/2013

- అవిశ్వాసంపై ఎంపీ మేకపాటి
- సర్కారుపై విమర్శలే తప్ప అవిశ్వాసం పెట్టరు
- కాంగ్రెస్ పెద్దలు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేదాకా అంతే

 రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని డిమాండ్ చేస్తే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కంటే ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడే ఎక్కువగా భయపడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అవిశ్వాసం పెడితే ప్రభుత్వం ఎక్కడ పడిపోతుందోనని చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు. అందుకే ప్రభుత్వంపై విమర్శలు చేస్తారే తప్ప చేతిలో ఉన్న అవిశ్వాసం అస్త్రం ప్రయోగించరని విమర్శించారు. కాంగ్రెస్ పెద్దలు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేదాకా చంద్రబాబు అవిశ్వాసం పెట్టరని చెప్పారు. 

గతంలో చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం అయ్యేవరకు అవిశ్వాసం పెట్టకుండా మిన్నకుండిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. బుధవారమిక్కడ జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశం అనంతరం ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబు చెప్పే మాటలకు విశ్వసనీయత ఉండదని విమర్శించారు. ‘‘తొమ్మిదేళ్ల చంద్రబాబు హయాంలో ఆరేళ్లు కరువు, రెండేళ్లు వరదలు సంభవించాయి. రైతులు ఎన్నో ఇక్కట్లపాలయ్యారు. బ్యాంకుల్లో వారు తీసుకున్న రుణాలకు వడ్డీ కూడా మాఫీ చేయలేదు. కనీసం రైతులను ఆదుకోవాలని కేంద్రానికి లేఖ రాయాలనే ఆలోచన రాలేదు.

అలాంటి వ్యక్తి ఇప్పుడు రుణాలు మాఫీ చేస్తారంటే ప్రజలు నమ్మే పరిస్థితిలేదు’’ అని దుయ్యబట్టారు. చంద్రబాబు తన మాటలకు విశ్వసనీయత లేకుండా చేసుకొని టీడీపీకి డిపాజిట్లు రాని పరిస్థితి తెచ్చిపెట్టారన్నారు. సహకార ఎన్నికలను విలేకరులు ప్రస్తావించగా... ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఎన్నికల గురించి మాట్లాడటం శుద్ధ దండగని మేకపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తే అన్ని జిల్లా పరిషత్‌లను తాము దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ మరే ఇతర పార్టీల్లో విలీనం కావాల్సిన ఖర్మ పట్టలేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ 225 అసెంబ్లీ, 35 పార్లమెంటు స్థానాలు గెలవనుందని అన్ని సర్వేలు చెబుతుంటే వేరే పార్టీలో ఎందుకు కలుస్తామని ప్రశ్నించారు.
Share this article :

0 comments: