విద్యార్థుల భవిత జగనన్న - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విద్యార్థుల భవిత జగనన్న

విద్యార్థుల భవిత జగనన్న

Written By news on Thursday, February 21, 2013 | 2/21/2013

జగన్ అరెస్ట్ అయ్యాక వైఎస్సార్‌సీపీ కేవలం ఇద్దరు మహిళలతో ప్రచారానికి సిద్ధమయ్యింది. నేను మీ రాజన్న కూతురిని. మీ జగనన్న చెల్లెల్ని అని చెయ్యి ఊపుతూ ప్రసంగించిన తీరుకు ప్రతి ఒక్కరికి షర్మిలలో వైయస్సార్, జగన్ ఇద్దరూ ఒకేసారి కనిపించారు. పోటీకి నిలబడిన అభ్యర్థుల్లో ధైర్యం వచ్చింది. జగనన్న బాణంలా దూసుకు వచ్చిన షర్మిల అన్నకు అండగా నిలిచింది. అన్న అరెస్టు అన్యాయమని తిరగబడింది. అధికారపార్టీకి, దానికి అండగా ఉండే ప్రతిపక్ష పార్టీకి, ఎల్లో మీడియాకు ముచ్చెమటలు పట్టించింది. 

ఉపఎన్ని కలలో పార్టీ అఖండ విజయానికి తనవంతు సహాయం అందించింది. జగనన్న జైలు నుండి బయటకు రాగానే పాదయాత్ర చేయాలనుకుంటుంటే.. బెయిల్ రాకుండా సరిగ్గా ముందురోజు కుట్రలు జరుగుతున్నాయి. ఇది గ్రహించిన షర్మిల తాను పాదయాత్ర చేయాలి అని నిర్ణయం తీసుకోవడంపై ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమ్మా... షర్మిలమ్మా... జగనన్న సాధించబోయే విజయం వెనుక ఒక చెల్లిగా మీ పాత్ర ఎంతోమంది ఆడపడుచులకు ఆదర్శం, అభినందనీయం. కష్టకాలంలో మా జగనన్నకు (ప్రజల మనిషి) అండగా నిలిచినందుకు ‘అన్న’ను అభిమానించే ప్రతి హృదయస్పందన తరఫున మీకు వందనాలు.

అమ్మా... భారతి గారూ... సాక్షి ఫ్యామిలీలో ‘జగన్‌కోసం’ శీర్షికలో అప్పుడప్పుడు వస్తున్న మీ ఆర్టికల్స్ ప్రత్యేకంగా చదువుతున్నాము. మీ పట్ల ప్రతి ఒక్కరిలో గౌరవం, అభిమానం పెరిగాయి. మీరు ఈరోజున ఎందరో మహిళలకు ఆదర్శవంతమైన స్త్రీ. 2009 సెప్టెంబర్ 2 వ తేదీ తరువాత నుండి జగనన్న పట్ల జరుగుతున్న కుట్రలకు ఒక భార్యగా మీరెంత నలిగి పోతున్నారో రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు. ‘‘అమ్మా...నాన్నకు బెయిల్ ఎప్పుడు వస్తుంది? ఏప్పుడు ఇంటికి వస్తారు?’’ అని పిల్లలు అడిగినప్పుడు సమాధానం ఏమి చెప్పాలో తెలియక మీరు పడుతున్న బాధను రాష్ట్రప్రజలు సహానుభూతితో చూస్తూనే ఉన్నారు. ఒకవైపు పత్రిక బాధ్యతలు, మరోవైపు పిల్లలను సముదాయించడం, జైలులో జగనన్న ఎదురుగా ధైర్యంగా ఉండడం... మేము గమనిస్తూనే ఉన్నాం. మీకు, మీ కుటుంబానికి తప్పక మంచిరోజులు వస్తాయి. 

చాలామంది తల్లిదండ్రులు, అత్తమామలు భారతిగారి లాంటి వ్యక్తిత్వం ఉన్న కూతురు, కోడలు మాకూ ఉంటే ఎంతోబాగుండు అనుకుంటే...., మీరు రాసే ఆర్టికల్స్ చదివి, ఇన్‌ఫ్లుయెన్స్ అయి మిమ్మల్ని ఎంతోమంది అమ్మాయిలు ఆదర్శంగా తీసుకుంటున్నారు. మీ ఆర్టికల్స్ చదివిన తరువాత ప్రతి ఒక్కరికి జగనన్న కడిగిన ముత్యంలా బయటికి వస్తాడు అనే ధైర్యం వచ్చింది. మాలో ప్రతిఒక్కరం మా ‘నాయకుడు’ కోసం కష్టపడుతున్న మీకు సెల్యూట్ చేస్తున్నాం. జగనన్న మీ ఇంటి మనిషి మాత్రమే కాదు. ప్రతి పేదవాడి ఎదురుచూపు జగనన్న. ప్రతి విద్యార్థి భవిత జగనన్న. ప్రతి వికలాంగుడికి భరోసా జగనన్న. 

- మండవ శ్యామ్‌సుందర్ రెడ్డి, తొండిపాక, ఖమ్మం జిల్లా 

ఆశయ రథసారథికి ఇదే నా అక్షర ప్రణామం!

జగనన్నా నీలాగా, రాజన్నలాగా ఆప్యాయత, అనురాగాలతో కల్మషంలేని చిరునవ్వును చిందించేనేత ఈ కాంగ్రెస్, టీడీపీలలో లేనేలేరు. అయినప్పటికీ వీళ్లు నిన్ను నేరస్థుడు అంటుంటే బాధేస్తోంది జగనన్నా. అంతేనేమోలే కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు అనే సామెత ఉందిగా. ప్రజాసంక్షేమం కోసం పాటుపడుతున్నందుకే కదా నీపై ఇన్నివిమర్శలు, నీకు ఇన్ని అవరోధాలు! రాజన్న ఎన్నో మహోన్నతమైన పథకాలు ప్రవేశపెట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించాడు. ఆ అభివృద్ధిని ఆయన మరణంతో ఆగిపోయేటట్లుగా కుట్ర పన్నింది ఇప్పుడున్న పాలక పక్షం. ఆ కుట్ర గురించి ప్రజలకు తెలియజెప్పినందుకే కదా నీపై నేరం మోపి జైలుకు పంపించారు.

ఇలాంటి వాళ్లు ఎన్ని కుయుక్తులు పన్నినా నీకేమీ కాదన్నా. పేదప్రజల నాయకుడిగా ఈ రాష్ట్రం నిన్ను ఆదరిస్తుంది. అక్కున చేర్చుకుంటుంది. అండగా ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో నిన్ను అధికార పీఠాన్ని ఎక్కిస్తుంది. ఇందులో సందేహం లేదు. అందరూ కలిసి మూకుమ్మడిగా నీపై ఇంతగా బురదజల్లి విమర్శిస్తున్నారంటే నీకు అంతగా ప్రజాబలం ఉందని! పాలక, ప్రతిపక్షాలు అంతగా భయపడుతున్నాయంటే నువ్వేమీ తప్పుచేయలేదని, తప్పు చేయకుండానే జైల్లో పెట్టారని! రాజన్న లాగా నువ్వు కూడా ప్రజల పక్షాన నిలబడి గ్రామసీమను సశ్యామలం చేస్తావవి, రాజన్న ఆశయాలు నెరవేరుస్తావని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తెలిసేటట్లు చేస్తావని మేమంతా నమ్ముతున్నాం. నీ పాలనలో రైతేరాజు అవుతాడు కాబట్టి ప్రతి ఒక్కరికి అనుకూలంగా నీ పాలన సాగుతుంది కాబట్టి నీవే అందరికీ నచ్చిన నాయకుడివి. నీవే అందరు మెచ్చిన నాయకుడివి. 

- కె.బి ప్రసాద్, చిదంబరం, తమిళనాడు
Share this article :

0 comments: