రైతులకు ఏంచేశారని సంబరాలు:విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రైతులకు ఏంచేశారని సంబరాలు:విజయమ్మ

రైతులకు ఏంచేశారని సంబరాలు:విజయమ్మ

Written By news on Tuesday, February 5, 2013 | 2/05/2013

రాష్ట్రంలో రైతులకు ఏం చేశారని సంబరాలు చేసుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. సహకార ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై విజయమ్మ పత్రికా ప్రకటన విడుదల చేశారు. సహకార సంఘాలకు అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగాయని తెలిపారు. కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా ఈ ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పుకునేందుకే తప్ప, రైతు శ్రేయస్సుకు కాదన్నారు. 
కాంగ్రెస్ పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడాల్సి వస్తోందన్నారు. ప్రజల పక్షాన ఉండి పోరాడాల్సిన టీడీపీ అధికార పార్టీతో కుమ్మక్కైందని విమర్శించారు. 

చీకట్లో కేంద్ర మంత్రి చిదంబరాన్ని కలిసి కేసులు మాఫీ చేసుకునేందుకే బాబు తాపత్రయపడ్డారని పేర్కొన్నారు. శాసనసభలో టీడీపీకి బలం ఉన్నా, అవిశ్వాసం పెట్టడం లేదన్నారు. పాదయాత్ర పేరుతో ప్రభుత్వాన్ని తిడుతున్నట్లు నటిస్తూ మొసలికన్నీరు కారుస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల కుమ్మక్కు రాజకీయాల ఫలితంగానే ప్రజలకు ఇబ్బందులు పడుతురన్నారని తెలిపారు.హేరామ్.. హేదేవా.. హేఅల్లా.. మీరే ఈ రాష్ట్రాన్ని కాపాడాలని ప్రార్ధించారు. విద్యుత్ లేక పంటలు దారుణంగా ఎండిపోలేదా? అని ఆమె ప్రశ్నించారు. లైలా తుపాను బాధితులకు పరిహారం ఈ రోజుకైనా చెల్లించారా?: అని అడిగారు. 
రైతులకు కనీసం పంటరుణాలను ఇవ్వలేకపోయారన్నారు. ఇందుకేనా రైతులు తమ వెన్నంటి ఉన్నారని ప్రగల్బాలు పలుకుతున్నారని విమర్శించారు. విద్యుత్ లేక వేలాది పరిశ్రమలు మూతపడి లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడలేదా? అని ప్రశ్నించారు. ఈ పరిస్థితులరలో తాము గెలిచామని కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుంటోందన్నారు. 

గడచిన మూడేళ్లలో ఒక్క కొత్త ఇల్లయినా రాష్ట్రంలో నిర్మించగలిగారా? కొత్త ఫించన్ ఒక్కటైనా మంజూరు చేశారా? గ్రామాల్లో తాగునీరు ఇవ్వగలిగారా? ఇందుకే రైతులు మీ పక్షాన నిలిచి గెలిపించారని సంబర పడుతున్నారా? అని ఆమె అడిగారు. విపక్షాలు ఓట్ల నమోదు కోసం వెళితే కనీసం సభ్యత్వ పుస్తకాలు ఇవ్వలేదన్నారు. తమ ఓట్లు ఏవని అడిగిన రైతులపై కూడా కేసులు పెట్టారన్నారు. ఇవి ఎన్నికలు అని కాంగ్రెస్ మురిసిపోతే సరిపోతుందా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేయకుంటే రుణాలు ఇవ్వమని, కేసులు పెడతామని బెదిరించారని ఆరోపించారు. కాంగ్రెస్ గెలవకుంటే సొసైటీకే నిధులు ఇచ్చేది లేదని అధికార పార్టీ నేతలు బెదిరించారన్నారు. సహకార ఎన్నికలను అప్రజాస్వామికంగా, నిరంకుశంగా నిర్వహించారని ఆమె విమర్శించారు.
Share this article :

0 comments: