పార్టీకోసం పని చేయండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పార్టీకోసం పని చేయండి

పార్టీకోసం పని చేయండి

Written By news on Tuesday, February 26, 2013 | 2/26/2013

మెదక్ జిల్లా ఎంపీపీల సంఘం మాజీ 
అధ్యక్షుడితోపాటు పార్టీలో చేరిన నేతలు

 వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేంత వరకు పార్టీ నేతలు, క్యాడర్ అనునిత్యం ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యల పరిష్కారంకోసం పోరాటాలు చేయాలని పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పిలుపు ఇచ్చారు. పార్టీలో ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు, మరే ఇతర విషయాలున్నా.. అవేవీ పట్టించుకోకుండా ప్రతి ఒక్కరూ పార్టీ ఉన్నతికోసం పనిచేయాలని సూచించారు. ఒకవేళ ఇబ్బంది కర సమస్యలు తలెత్తితే.. తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని చెప్పారు. మెదక్ జిల్లా ఎంపీపీల సంఘం మాజీ అధ్యక్షుడు రాజేశ్వరరావు దేశ్‌పాండేతో పాటు జిల్లాకు చెందిన ఇతర నేతలు పెద్ద సంఖ్యలో సోమవారం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి విజయమ్మ ప్రసంగించారు. 

‘‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ అనునిత్యం పేద ప్రజలకోసం పరితపించేవారు. పేదలను బాగుపరచడం కోసం ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ప్రాణం పోయేంత వరకు పేదలకోసమే పనిచేశారు. ఆయన ఆశయసాధన కోసం, పేదల పక్షపాతిగా ఏర్పడినదే వైఎస్సార్‌సీపీ. కాబట్టి ప్రతీ ఒక్క కార్యకర్త కలిసికట్టుగా పనిచేయాలి. ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేయాలి. వైఎస్ సువర్ణయుగాన్ని జగన్‌బాబు నాయకత్వంలో మరొకసారి తెచ్చుకుందాం. జగన్‌బాబు కూడా త్వరలో బయటికొస్తారు. అప్పటివరకు నేతలు, కార్యకర్తలు ప్రతీ ఒక్కరూ చిన్న చిన్న సమస్యలుంటే పక్కనపెట్టి పార్టీకోసం పనిచేయండి’’ అని విజయమ్మ కోరారు. పార్టీలో చేరిన రాజేశ్వరరావు దేశ్‌పాండేను విజయమ్మ అభినందించారు. ఆయనతోపాటు వచ్చిన ఇతర నేతలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పార్టీలో చేరారు. వారికి విజయమ్మ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 

ఇస్రోకు విజయమ్మ అభినందనలు
సాక్షి, హైదరాబాద్: శాస్త్ర, సాంకేతిక రంగాలలో భారతదేశం అగ్రరాజ్యాలకు దీటుగా ముందుకు దూసుకుపోతోందని చెప్పడానికి పీఎస్‌ఎల్వీ సీ-20 ప్రయోగం విజయవంతం కావడమే నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రయోగంలో పాల్గొన్న ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. 
Share this article :

0 comments: