'సర్దుకున్నాక అవిశ్వాసం పెడతారా?' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'సర్దుకున్నాక అవిశ్వాసం పెడతారా?'

'సర్దుకున్నాక అవిశ్వాసం పెడతారా?'

Written By news on Thursday, February 7, 2013 | 2/07/2013

ప్రభుత్వం మైనార్టీలో ఉన్నప్పుడు కాకుండా అంతా సర్దుకున్నాక అవిశ్వాసం పెడతారా అంటూ చంద్రబాబును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. కాంగ్రెస్ తో కుదుర్చుకున్న చీకటి ఒప్పందం కారణంగానే చంద్రబాబు అవిశ్వాసం పెట్టడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ను తిట్టొద్దు, అవిశ్వాసం పెట్టమని తెలుగు తమ్ముళ్లే అడుగుతున్నారని తెలిపారు. అవినీతిలో చంద్రబాబు నిష్ణాతుడని ఎన్టీఆర్ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. ఆల్మట్టిపై మాట్లాడని బాబు కృష్టా డెల్టాపై మొసలికన్నీరు కారుస్తున్నారని అన్నారు. షర్మిల మోకాలి గాయం గురించి టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు నీచమైన ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
Share this article :

0 comments: