షర్మిల విషయంలో టీడీపీలో అంతర్మథనం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » షర్మిల విషయంలో టీడీపీలో అంతర్మథనం

షర్మిల విషయంలో టీడీపీలో అంతర్మథనం

Written By news on Saturday, February 9, 2013 | 2/09/2013

షర్మిల మోకాలికి జరిగిన శస్త్రచికిత్సపై టీడీపీ చేసిన ఆరోపణలకు సంబంధించి ఆ పార్టీలో అంతర్మథనం కొనసాగుతూనే ఉంది. షర్మిల కాలికి గాయం ఒక నాటకమని ఆ పార్టీ నేతలు కొందరు చేసిన విమర్శలపై శుక్రవారం కూడా తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. పార్టీలో అవగాహన లేనివాళ్లు ఇచ్చే సలహాలతో పసలేని విమర్శలు చేసి ఆభాసుపాలవుతున్నామని ఒక సీనియర్ నాయకుడు సన్నిహితులతో జరిగిన చర్చ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ ఇటీవలి కాలంలో చేస్తున్న విమర్శలు, మీడియా సమావేశాలపై ఆ నేత సమక్షంలో నాయకులు సమాలోచనలు జరిపారు. పార్టీ తాజాగా చేసిన విమర్శలపై చర్చ వచ్చినప్పుడు.. ‘శస్త్ర చికిత్స జరక్కుండా జరిగిందని చెప్పాల్సిన అవసరం షర్మిలకు ఏముంది? అలా చెప్పడం వల్ల ఆమెకు గానీ ఆ పార్టీకి గానీ అదనంగా ఒరిగేదేముంటుంది? పాదయాత్రను ఆపాలని అనుకుంటే ఆమె నేరుగా చెప్పి ఆపేస్తారు. నిజానికి యాత్ర ప్రారంభించినప్పుడే ఆ విషయం చెప్పారు. 

జగన్‌మోహన్‌రెడ్డి ఈ యాత్రను కొనసాగించాల్సి ఉందని, రేపటిరోజున బయటకు రాగానే తన స్థానంలో అన్న జగన్ పాదయాత్ర కొనసాగిస్తారని కూడా ప్రకటించిన విషయం నేతల మధ్య చర్చకు వచ్చింది..’ అని ఆపార్టీ నాయకుడొకరు చెప్పారు. గాయం తగ్గడంతో ఇప్పుడు ఆమే యాత్ర కొనసాగిస్తున్నారని, ఇందులో మనం తప్పుబట్టాల్సిన అంశమేముంది.. అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ సంస్థాగత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా నాయకులను తక్కువచేసి వ్యవహరిస్తున్నారని, అవగాహన లేని ఇలాంటి వాళ్లిచ్చే సలహాలు పాటించే 2009 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవలసి వచ్చిందని మాజీ ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: