బాబు బజారు రౌడీ స్థాయికి దిగజారారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు బజారు రౌడీ స్థాయికి దిగజారారు

బాబు బజారు రౌడీ స్థాయికి దిగజారారు

Written By news on Wednesday, February 13, 2013 | 2/13/2013

బాబు బజారు రౌడీ స్థాయికి దిగజారారు
ఆయన రెచ్చగొట్టినందుకే ‘సాక్షి ’ పై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు
నిస్పృహతోనే ఇలాంటివి ప్రోత్సహిస్తున్నారు

 రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి గుంటూరు సాక్షి కార్యాలయంపై దాడి జరగడానికి కారణమైన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై రౌడీషీట్‌ను తెరిచి తగు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు అంబటి రాంబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులను డిమాండ్ చేశారు. ఐదురోజులుగా గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు సాక్షి పత్రికపై ఇష్టానుసారం ఆరోపణలు చేస్తూ, టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి ఈ దాడికి కారణమయ్యారని చెప్పారు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, మరో తొమ్మిది ఏళ్లు ప్రతిపక్ష నాయకుడుగా పనిచేసిన బాబు ఇలాంటి దాడులకు కారణం కావడాన్ని బట్టి ఆయన ఏ స్థాయికి చేరుకున్నారో అర్థం అవుతోందన్నారు. 

సాక్షి కార్యాలయంపై జరిగిన దాడిని ప్రజాస్వామ్యవాదులంతా ముక్తకంఠంతో ఖండించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు. బజారు మూకలతో దాడులు చేయించే స్థాయికి, బజారు రౌడీలా వ్యవహరించే స్థాయికి చంద్రబాబు దిగజారారని చెప్పారు. రెండుసార్లు వరుస పరాజయాల పాలైన బాబుకు మూడోసారీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, అందుకే నిరాశానిస్పృహలకులోనై ఇలాంటివి చేయిస్తున్నారని దుయ్యబట్టారు. 

వాస్తవాలు రాస్తే దాడులు చేయిస్తారా?

‘సాక్షిలో అడ్డగోలు రాతలు రాస్తారని బాబు ఎలా అంటారు. గుంటూరు టీడీపీలోని ఇరువర్గాల మధ్య జరుగుతున్న అంతర్గత పోరును సాక్షిలో కళ్లకు కట్టినట్లుగా రాశారు. బాబు పాదయాత్రకు స్పందన కరువైందని రాశారు. ఉన్నది ఉన్నట్లుగా రాసినందుకు పార్టీ కార్యకర్తలతో దాడులు చేయించే స్థాయికి దిగజారతారా?’ అని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి జరుగుతున్న సమయంలో చంద్రబాబు అక్కడే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. గతంలో కొన్ని పత్రికలపై దాడుల సందర్భంగా పత్రికా స్వేచ్ఛపై దాడి జరిగిందని గగ్గోలు పెట్టిన బాబు.. సాక్షిపై దాడులు జరిగితే ఎలా ఊరుకున్నారని ప్రశ్నించారు. 88లో వంగవీటి రంగా హత్య జరిగినప్పుడు.. ఈనాడు కార్యాలయంపైనా కొన్ని ఇతర కార్యాలయాలపై దాడులు జరిగితే ‘అన్యాయం.. అక్రమం’ అంటూ ఖండించిన విషయం గుర్తుచేశారు. రిజర్వు బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి కార్యకలాపాలు సాగిస్తోందని ఓ ఎంపీ ఫిర్యాదు మేరకు అధికారులు సోదాలు, దాడులు నిర్వహిస్తే పత్రికా స్వేచ్ఛపై దాడి అంటూ బాబు ఖండించారని తెలిపారు. కొన్ని పత్రికలు రోజూ పేజీల కొద్దీ తమ నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా ఒక ఎజెండా ప్రకారం వార్తలు రాస్తున్నా.. వాళ్లను మేమేమైనా అన్నామా...దాడులు చేశామా...? అని ప్రశ్నించారు. 

బంగారం కాళ్లయితే పట్టుకుంటారా?

తన కాలి గాయాన్ని సైతం రాజకీయం చేసిన టీడీపీ నేతలకు షర్మిల విసిరిన సవాలు నూటికి నూరు పాళ్లు సమర్థనీయమేనని రాంబాబు చెప్పారు. టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు ఓవైపు మాట జారానని అంగీకరిస్తూనే, పట్టుకోవడానికి షర్మిల కాళ్లేమైనా బంగారానివా అంటూ వ్యాఖ్యానించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘బంగారం కాళ్లయితే పట్టుకోవచ్చా..! ముద్దుకృష్ణమ లక్ష్మీపార్వతి కాళ్లు పట్టుకున్నారు, ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్నారు, వై.ఎస్.రాజశేఖరరెడ్డి కాళ్లు పట్టుకున్నారు, ఇపుడు చంద్రబాబు కాళ్లు పట్టుకున్నారు. వారందరివీ బంగారం కాళ్లేనని పట్టుకున్నారా?’ అని అంబటి ప్రశ్నించారు. షర్మిలకైన గాయంపైనా, ఆమెకు జరిగిన శస్త్ర చికిత్సపైనా బాబుకు గానీ ఆయన వందిమాగధులకు గానీ ఏవైనా అనుమానాలుంటే ఆమెకు చికిత్స చేసిన అపోలో ఆసుపత్రి రికార్డులను చూసుకోవచ్చని అంబటి సవాల్ విసిరారు. 

పత్రికలపై గౌరవం అంటే వాటిని పెట్టకపోవడమా!

తనకు పత్రికలపై గౌరవం ఉండబట్టే పత్రికలు గానీ, టీవీ చానళ్లు గానీ పెట్టడం లేదని బాబు చెప్పడం వింతగా ఉందని రాంబాబు అన్నారు. ‘దివంగత రాజశేఖరరెడ్డి బహిరంగంగానే సాక్షి పత్రికను, చానల్‌ను స్థాపించారు. తమకు నిత్యం వ్యతిరేకంగా రాసే పత్రికల గురించి ప్రజలకు చెబుతూ వాటిని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారే తప్ప వాటిపై దాడులకు ఎన్నడూ ప్రోత్సహించలేదు..’ అని తెలిపారు. ‘అయినా నిజంగా చంద్రబాబుకు మీడియా లేదంటే నమ్మాలా...కొంతకాలం క్రితం ఆయన కుమారుడు లోకేష్ ఒక టీవీ చానెల్‌ను బినామీ పేరుతో నడిపిన మాట వాస్తవమా కాదా? నిత్యం స్తోత్రం చేసే పత్రికలుండగా ఇంకా బాబుకు సొంత పత్రికలెందుకు..’ అని ఎద్దేవా చేశారు.
Share this article :

0 comments: