ప్రజలకు చేరువ కావడమే జగన్ చేసిన నేరమా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజలకు చేరువ కావడమే జగన్ చేసిన నేరమా?

ప్రజలకు చేరువ కావడమే జగన్ చేసిన నేరమా?

Written By news on Thursday, February 14, 2013 | 2/14/2013

వైఎస్సార్‌గారు పాదయాత్రలు చేసి, ప్రజలతో మమేకమై అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోను రెండుసార్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. ఆయన బతికున్నప్పుడు ఇంద్రుడు చంద్రుడు అని పొగిడిన రాజకీయాధినేతలు... మరణించాక ఆయనను, ఆయన కుటుంబాన్ని విమర్శించటమే పనిగా పెట్టుకున్నారు. క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం కీడుకు ప్రతిగా మేలు, దయ, క్షమాగుణాలు కలిగి ఉన్న కుటుంబం అది. అందుకే తమపై అన్యాయంగా నిందలు వేస్తూ, వేధిస్తున్న వారిని కూడా క్షమించి వదిలేశారు. 

వైఎస్సార్ పేద బడుగు బలహీన వర్గాలవారికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలుపరిచి, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎందరికో గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీల వంటి వ్యాధులకు ఉచితంగా వైద్యం చేయించారు. పేదల పాలిటి పెన్నిధిగా నిలిచిన తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని, ఆయన మరణంతో వ్యధ చెంది ఆత్మహత్యలు చేసుకున్న బడుగు జీవులను పరామర్శించి, ఓదార్పుయాత్రను రాష్ట్రమంతటా జరిపించి, ప్రజలకు చేరువవుతున్న జగన్‌ని, విజయమ్మని రాజకీయంగా, మానసికంగా ఈ ప్రభుత్వాధినేతలు వేధించటం క్షమించరాని నేరం. ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న యువనేతను నిర్బంధించడం అక్రమం. ప్రభుత్వాధినేతలు, న్యాయాన్ని రక్షించే న్యాయ కోవిదులు, నేర పరిశోధక విభాగంవారు చిత్తశుద్ధితో వ్యవహరించి జగన్‌కు న్యాయం చేకూర్చాలి. 
- బలిజేపల్లి లక్ష్మీపద్మావతి
మర్రివేముల, ప్రకాశం


స్త్రీ చేత కంటతడి పెట్టించడం శుభం కాదు!
వై.యస్.రాజశేఖరరెడ్డి అకాల మరణంతో రాష్ట్రాభివృద్ధిపై ఒక్కసారిగా కారు మబ్బులు కమ్ముకున్నాయి. వై.యస్. మరణవార్త విని కలత చెంది వందలసంఖ్యలో ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలను పలకరించి ఓదార్చాలన్న ఇంగితం కూడా కాంగ్రెస్ పార్టీకి లేకుండా పోయింది. తద్విరుద్ధంగా జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి వుండి ఓదార్పు కార్యక్రమాన్ని చేపట్టడంతో కాంగ్రెస్‌పార్టీ అధిష్టానం ఆయన్ని వేధిస్తోంది. ఆయన కుటుంబాన్ని అష్టకష్టాలు పెడుతోంది. 

గులాం నబీ ఆజాద్ గారు ఉప ఎన్నికల ప్రచారంలో ‘మా పార్టీలో జగన్ ఉండి ఉంటే కేంద్రమంత్రిని చేసే వాళ్లం. ఆ తరువాత ముఖ్యమంత్రిని కూడా చేసే వాళ్లం’ అని అనడం చూస్తే జగన్‌ను ఉద్దేశపూర్వకంగానే జైలు పాలు చేశారని తెలుస్తోంది. ఓదార్పుయాత్రలో జగన్‌పై రాష్ర్టవ్యాప్తంగా వెల్లువెత్తిన ప్రజాదరణను చూసి కాంగ్రెస్ ఆయనను వ్యూహాత్మకంగానే కట్టడి చేసిందని అందరికీ అర్థమౌతూనే ఉంది. స్త్రీని పూజించడం, గౌరవించడం మన సంప్రదాయం.

సీతను బంధించి కన్నీరు పెట్టించిన రావణుడు, ద్రౌపదిని పరాభవించి ఏడిపించిన కీచకుడు చివరికి ఏమయ్యారు? ఏ స్త్రీమూర్తి అయినా కంటతడి పెట్టడం శుభం కాదు. చిరంజీవి సౌభాగ్యవతి భారతి పడుతున్న ఆవేదనను, బాధను రాష్ట్రప్రజానీకం సహానుభూతితో చూస్తోంది. రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న మహానేత వై.యస్. కుటుంబంలోని స్త్రీలు కంటతడితో ప్రజల ముందుకు వచ్చారు. న్యాయం చేయండని అడుగుతున్నారు. జగన్‌ను ఇంతకాలం అక్రమంగా నిర్బంధించడం ఏమిటని ఆయన కుటుంబ సభ్యుల తరఫున ప్రజలూ అడుగుతున్నారు. ఇప్పటికైనా జగన్‌కు బెయిలు ఇవ్వండి. నిర్బంధం నుండి విడుదల చెయ్యండి. అప్పుడే రాష్ట్రానికి శుభం. కాంగ్రెస్‌కి శుభం. ప్రజలకు సంక్షేమం. 
- పోతిన బాబూరావు, విజయవాడ
Share this article :

0 comments: