జగన్ కోసం - 291 రోజులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ కోసం - 291 రోజులు

జగన్ కోసం - 291 రోజులు

Written By ysrcongress on Wednesday, March 13, 2013 | 3/13/2013

శ్రీ చంద్రబాబునాయుడు గారి పాదయాత్ర మార్నింగ్, ఈవెనింగ్ వాక్ లాగా ఉంది. చంద్రబాబుకి వైయస్సార్ పార్టీని గాని, జగన్‌మోహన్ రెడ్డి పేరును గాని తలవనిదే నిద్రపడుతున్నట్లులేదు. ఒక పక్క కాంగ్రెస్ పార్టీకి కొమ్ముకాస్తూ, మరో పక్క కాంగ్రెసు పార్టీని భూస్థాపితం చేస్తానని బాబుగారు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. జనం మధ్య నిరంతరం తిరుగాడే జగన్‌ని భవిష్యత్తులో సైతం ఎలా నిలువరించాలా అని కుయుక్తులు పన్నడం తప్ప చంద్రబాబు ఇంకేమీ చేయలేడు. అయినా ధూళిమేఘాలు అడ్డుపడితే సూర్యకాంతి తగ్గిపోతుందా? జగన్ సూర్యుడు. తండ్రిలా మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు. ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం జగన్‌ని ఎవరూ ఏమీ చేయలేదు. ఇది అక్షర సత్యం. నావంటి ఎందరో సీనియర్ సిటిజన్లు ఆ యువనాయకుడి కోసం నిరంతరం ఎదురుచూస్తున్నాం. త్వరలోనే ఆయన విడుదలౌతారు. అంతిమ విజయం అతడిదే. 
- బి.కైలాసరావు పట్నాయక్, పుణె

న్యాయపీఠాలపై మాకింకా నమ్మకం ఉంది

వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిక్కురుమనకుండా కూర్చున్న నాయకులు ఆయన మరణానంతరం తెగ రెచ్చిపోతున్నారు! దివంగత నేత కుటుంబాన్ని నానా అవస్థలు పెడుతున్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కు అయి, సంబంధంలేని కేసులను జగన్ మీదవేసి ఆయన్ని జైలుకు పంపి బెయిల్ రాకుండా అడ్డుకుంటున్న వైనం నేడు చిన్నపిల్లలకి కూడా అర్థమౌతోంది. జగన్ వ్యాపారం చేసి లాభాలు సంపాదిస్తే అది కూడా నేరమేనని చిత్రీకరించడానికి ఆయన మీద ‘క్విడ్ ప్రోకో’ అనే పేరుతో కేసు పెట్టారు. 

మరి ప్రతిపక్షనేత చంద్రబాబు రాష్ట్రప్రభుత్వాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసి, తన అవినీతి మీద ఎలాంటి ఎక్వయిరీ రాకుండా బేరం పెట్టాడు కదా, అది క్విడ్‌ప్రోకో కాదా! ఓదార్పు యాత్ర చేసుకునేందుకు అంగీకరించి జగన్‌కు సహకరించివుంటే కాంగ్రెస్ భవిష్యత్తులో కేంద్రలోను, రాష్ట్రంలోను బతికి బట్టకట్టేది. ఇప్పుడు ఆ ఛాన్సు లేకుండా కేంద్ర, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వాళ్ల గొయ్యి వాళ్లే తవ్వుకున్నారు. మన ప్రజాస్వామ్యంలో ప్రజలకి న్యాయస్థానాల మీద ఇంకా నమ్మకముంది. జగన్ ప్రస్తుతం ఇబ్బందులలో ఉన్నప్పటికి, న్యాయమూర్తుల తీర్పుతో ఆయన నిరపరాధిగా బైటకు రావడం ఖాయం. ప్రజలు అఖండ మెజారిటీతో వైయస్సార్ కాంగ్రెస్‌ను గెలిపించడమూ ఖాయమే. ప్రస్తుతం వైయస్సార్ రెక్కల కష్టం మీద అధికారం అనుభవిస్తున్న కేంద్ర, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు త్వరలోనే ఘోర పరాజయాన్ని చవిచూడబోతున్నారు. 
- పి.కృష్ణమాచార్యులు, హైదరాబాద్

త్వరగా విడుదలై రావాలని అల్లాను ప్రార్థిస్తున్నాం
జగన్ లాంటి అన్న కావాలని ప్రతి చెల్లి, తమ్ముడు కోరుకుంటారు. జగన్ లాంటి కొడుకు కావాలని ప్రతి తల్లి, తండ్రి కోరుకుంటారు. జగన్ లాంటి మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు కావాలని రాష్ట్రప్రజలు కోరుకుంటారు. 

జగన్ ఒక రాజకీయ ప్రభంజనం, జగన్ యువతరం ఆశాకిరణం. జగన్ అంటే వజ్ర సంకల్పం, ఒక ఉత్తేజం, ఉప్పొంగే కెరటం. యువకుల హృదయస్పందన. రాజశేఖర్ రెడ్డిగారి పథకాలతో ఎంతో లబ్ధి పొందిన మాలాంటి వాళ్లకు జగన్‌గారిని ఎలా రక్షించుకోవాలో తెలియడం లేదు. ఆయన కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడడం ఒక్కటే మాకు తెలిసింది. ఆయన త్వరగా విడుదలై రావాలని అల్లాను ప్రార్థిస్తున్నాం. 
- ఎస్.మస్తాన్, మాథ్స్ ఫ్యాకల్టీ, శ్రీచైతన్య, విజయవాడ 
Share this article :

0 comments: